Social News XYZ     

Music Director Ravi Basrur’s directional ‘Veera Chandrahaas’ Telugu rights has been bagged by producer MV Radha Krishna

సంగీత సంచలనం రవి బస్రూర్ రూపొందించిన ‘వీర చంద్రహాస’ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

రీసెంట్‌గా కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్.. తెలుగులోనూ సక్సెస్ గ్యారెంటీ అంటోన్న నిర్మాత రాధాకృష్ణ

కేజీయఫ్, సలార్ లాంటి యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్‌‌గా ఒక సంచలనం సృష్టించిన రవి బస్రూర్.. ఇప్పుడు దర్శకుడిగా కూడా సత్తా చాటుతున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించగా, శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌‌పై
ఎన్ ఎస్ రాజ్‌కుమార్ నిర్మించారు. ఏప్రిల్ 18న కన్నడలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులోనూ ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌‌గా రాధాకృష్ణకు గుర్తింపు ఉంది. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసిన ఆయన.. తాజాగా ‘వీర చంద్రహాస’ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. అతి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.

 

ఈ సందర్భంగా నిర్మాత ఎమ్‌వీ రాధాకృష్ణ మాట్లాడుతూ ‘రీసెంట్‌గా కన్నడలో విడుదలైన వీర చంద్రహాస’ చిత్రానికి హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రానికి తెలుగు ఆడియెన్స్‌ను కూడా బ్రహ్మారథం పడతారని ఆశిస్తున్నా. సినిమా సక్సెస్ గ్యారెంటీ అని నమ్ముతున్నా . తనదైన సంగీతంతో అందర్నీ అలరించిన రవి బస్రూర్ ఇప్పుడు దర్శకుడిగానూ సత్తా చాటడం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
వీర చంద్రహాస అనేది 'మహాభారతం'లోని అశ్వమేధిక పర్వంలోని కథ. ఇది ఒక అనాథ కుర్రాడి యొక్క గొప్ప కథను చెబుతుంది. పరాక్రమవంతుడు, సద్గుణవంతుడు వీర చంద్రహాసుడు అవుతాడు.
సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగానం వెండితెరపై పూర్తి వైభవంతో రావడం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీయెన్స్ ఇచ్చేలా ఉంటుంది.

చిత్రం : వీర చంద్రహాస
నటీ నటులు : శివరాజ్ కుమార్, శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ తదితరులు
సమర్పణ : హోంబలే ఫిల్మ్స్
బ్యానర్ : ఓంకార్ మూవీస్
సినిమాటోగ్రాఫర్ :కిరణ్ కుమార్ ఆర్
కథ, కథనం, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ : రవి బస్రూర్
నిర్మాత : ఎన్ ఎస్ రాజ్‌కుమార్ - ఎమ్‌వీ రాధాకృష్ణ
తెలుగు రైట్స్ : కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్(ఎమ్‌వీ రాధాకృష్ణ)
పిఆర్ఓ : భూషణ్ - హర్ష

Facebook Comments
Music Director Ravi Basrur's directional 'Veera Chandrahaas' Telugu rights has been bagged by producer MV Radha Krishna

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.