Sivakarthikeyan, Sudha Kongara, Akash Baskaran, Dawn Pictures Production No. 2 #SK25 Announcement

శివకార్తికేయన్, సుధా కొంగర, ఆకాష్ బాస్కరన్, డాన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం2 అనౌన్స్ మెంట్

ట్యాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ తన మైల్ స్టోన్ 25వ మూవీ కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో కొలాబరేట్ అవుతున్నారు. ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీలో జయం రవి, అథర్వ, శ్రీలీల కీ రోల్స్ పోషించనున్నారు. ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ బాస్కరన్ గ్రాండ్ గా నిర్మించనున్నారు. ఈ మచ్ అవైటెడ్ మూవీని మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత ఆకాష్ బాస్కరన్ మాట్లాడుతూ.. మా ప్రొడక్షన్ నెం.2 చిత్రాన్ని తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రతిభావంతుడైన హీరో శివకార్తికేయన్ తో గ్రాండ్ గా నిర్మిస్తునందుకు ఆనందంగా వుంది. శివకార్తికేయన్ 25వ చిత్రాన్ని నిర్మించడం మాకు గొప్ప సంతోషాన్ని ఇస్తోంది. ఈ మైల్ స్టోన్ ప్రాజెక్ట్ జాతీయ అవార్డు-విన్నర్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అత్యంత భారీ అంచనాల చిత్రాలలో ఒకటిగా నిలుస్తోంది. అసాధారణమైన కథలను ఎంచుకునే నటులు జయం రవి, అథర్వ, శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌లో చేతులు కలపడం మాకు సంతోషంగా ఉంది.

ప్రతిష్టాత్మకగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చనున్నారు. ఇది G.V. ప్రకాష్‌కి 100వ సినిమా కావడం మరింత ప్రత్యేకం. యూనిక్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని మీకు హామీ ఇస్తున్నాము' అన్నారు.

నటీనటులు: శివకార్తికేయన్, జయం రవి, అథర్వ, శ్రీలీల
రచన, దర్శకత్వం: సుధా కొంగర
నిర్మాత: ఆకాష్ బాస్కరన్
బ్యానర్: డాన్ పిక్చర్స్
సంగీతం: జీవి ప్రకాష్ కుమార్
డీవోపీ: రవి కె. చంద్రన్
పీఆర్వో: వంశీ శేఖర్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share
Tags: SK25

This website uses cookies.

%%footer%%