Social News XYZ     

Malayalam star Joju George’s movie “Pani” pre-release event held, Movie to release in Telugu on Dec 13th.

ఘనంగా మలయాళ స్టార్ జోజు జార్జ్ "పని" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 13న తెలుగులో గ్రాండ్ రిలీజ్.


రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్టయిన స్టార్ హీరో మరియు దర్శకుడు జోజు జార్జ్ సినిమా "పని" తెలుగులో ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో అభినయ కీలక పాత్రలో నటించింది. ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. రాజవంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. పని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో

తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు డైరెక్టర్ వీరశంకర్ మాట్లాడుతూ - పని సినిమా మలయాళంలో రిలీజ్ మంచి విజయాన్ని సాధించింది. ఇదొక సెన్సబుల్ ఫిల్మ్. పని సినిమా తెలుగులోకి నా మిత్రుడు రాజ వంశీ తీసుకొస్తున్నారు. జోజు జార్జ్ మంచి నటుడు. ఆయన ఎన్నో అవార్డ్ లు అందుకున్నారు. తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. పని సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధించాలి, రాజ వంశీతో పాటు టీమ్ అందరికీ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.

తెలుగు ఫిలింఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మాట్లాడుతూ - మలయాళ సినిమా అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం. వాళ్లు కంటెంట్ ను గౌరవిస్తారు. అందుకే మంచి విజయాలు సాధిస్తున్నారు. పని సినిమా కూడా అలాంటి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్న మూవీ. ప్రేక్షకులు ఈ చిత్రానికి మంచి విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నా అన్నారు.

 

నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ - రాజవంశీ నాకు మంచి మిత్రులు. జోజు జార్జ్ గారికి నేను అభిమానిని. ఆయన మూవీస్ ఓటీటీలో చూస్తుంటాను. ఎప్పుడెప్పుడు ఆయనను కలుస్తానా అనుకున్నాను. ఈ వేదిక మీద కుదిరింది. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో కూడా ఆకట్టుకోగల నటుడు. అభినయ మనల్ని ఎన్నో సినిమాలతో ఆకట్టుకుంది. వీరు కలిసి నటించిన పని సినిమా తన పనితనం ఎంటో తెలుగు బాక్సాఫీస్ దగ్గర కూడా చూపించాలి అన్నారు.

మలయాళ ప్రొడ్యూసర్ సిజో వడక్కన్ మాట్లాడుతూ - పని చిత్రంతో జోజు జార్జ్, అభినయ వంటి మంచి ఆర్టిస్టులతో పనిచేసే అవకాశం కలిగింది. పని సినిమా మలయాళం, కన్నడ, తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ అలాంటి విజయాన్నే సాధిస్తుందని కోరుకుంటున్నా అన్నారు.

నటి అభినయ మాట్లాడుతూ - పని చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఇదొక ఎక్సలెంట్ ఫిల్మ్. జోజు జార్జ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. నటుడిగానే కాదు దర్శకుడిగానూ జోజు జార్జ్ గారు తన ప్రతిభ చూపించారు. నాతో పాటు మా టీమ్ అందరికీ ఎన్నో మంచి మెమొరీస్ ఇచ్చిందీ సినిమా. తెలుగులో "పని" సినిమా పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ వంశీ మాట్లాడుతూ - వర్క్ ఈజ్ గాడ్...మనం చేసే పని మనకు దేవుడు. పని సినిమాను తెలుగులోకి తీసుకొస్తుండటం సంతోషంగా ఉంది. ఇది మంచి థ్రిల్లర్ సినిమా. 2 గంటల పాటు ఆడియెన్స్ ను ఎంగేజ్ చేస్తుంది. ఈ చిత్రంలో జోజు జార్జ్ గారు నటిస్తూ అద్భుతంగా రూపొందించారు. ఇలాంటి సినిమా చేయాలంటే ధైర్యం ఉండాలి. నటుడిగా ఆయన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఈ సినిమా ఈ నెల 20న ఓటీటీలో రావడం లేదు. తెలుగులో థియేటర్స్ లో సక్సెస్ పుల్ గా రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. మీరంతా పని చిత్రానికి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

హీరో, దర్శకుడు జోజు జార్జ్ మాట్లాడుతూ - ఈ రోజు మా పని సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ లు అందరికీ థ్యాంక్స్. వాళ్లు నా గురించి గొప్పగా మాట్లాడటం సంతోషంగా ఉంది. నా దృష్టిలో మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలో ప్రేక్షకులైనా ఆదరిస్తారు. తెలుగు చిత్రాల్లో నటించి మీ ఆదరణ పొందాను. పని సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్. మా టీమ్ లోని ప్రతి మెంబర్ తన వర్క్ ను అద్భుతంగా చేశారు. అభినయతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. పని మూవీ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చుతుంది. మీరంతా మా మూవీని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

ఈ కార్యక్రమంలో పని సినిమాలో నటించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్స్ పాల్గొన్నారు.

నటీనటులు - జోజు జార్జ్, అభినయ, సాగర్ సూర్య, జునైద్, అభయ హిరణ్మయి, సీమ, బాబీ కురియన్, తదితరులు

టెక్నికల్ టీమ్
బ్యానర్ - అప్పు పతు పప్పు ప్రొడక్షన్ హౌస్
డీవోపీ - వేణు ఐఎస్ సీ, జినో జార్జ్
ఎడిటర్ - మను ఆంటోనీ
మ్యూజిక్ - సామ్ సీఎస్, విష్ణు విజయ్
పీఆర్ఓ - చందు రమేష్
తెలుగు రిలీజ్ - ఆమ్ వర్డ్ ఎంటర్ టైన్ మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రాజ వంశీ
దర్శకత్వం - జోజు జార్జ్

Facebook Comments
Malayalam star Joju George's movie "Pani" pre-release event held, Movie to release in Telugu on Dec 13th.

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.