Women and Child Welfare Minister Seethakka releases the title poster and glimpses of the movie “Nari”, the movie is set for a grand theatrical release on December 25th

స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క చేతుల మీదుగా "నారి" సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్, డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

ఆమని, వికాస్ వశిష్ఠ,మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా నారి. మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న నారి సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క ఈ సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా

స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క మాట్లాడుతూ - మహిళలు ఎన్నో రంగాల్లో ఎదుగుతున్నారు. అయినా వారి పట్ల వివక్ష, చిన్నచూపు తగ్గడం లేదు. సమాజ నిర్మాతలు మహిళల అనే నిజాన్ని మనమంతా గుర్తుపెట్టుకోవాలి. ఆడ పిల్లలు ఎదిగేందుకు ప్రతి ఒక్కరు తోడ్పాడు అందించాలి. మహిళల్ని గౌరవించాలి. ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ తో నారి సినిమా చేసిన సూర్య వంటిపల్లి గారికి అభినందనలు. ఈ సినిమా పోస్టర్, గ్లింప్స్ నా చేతుల మీదుగా విడుదల చేసుకోవడం సంతోషంగా ఉంది. నారి సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. మహిళల గురించి వారి మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ - ఈ రోజు మా నారి సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క గారికి కృతజ్ఞతలు. ఆమె ఎంతో బిజీగా ఉన్నా మా మూవీ కాన్సెప్ట్ విని టైమ్ ఇచ్చారు. ఇటీవల ఓ స్కూల్ అమ్మాయి తన టీచర్ తో అమ్మాయిగా తన కష్టాలు చెబుతూ తాను మగవాడిగా మారాలని అనుకుంటున్నట్లు చెప్పిన వీడియో ఒకటి బాగా వైరల్ అయ్యింది. ఆ సన్నివేశం మా నారి సినిమాలోనిది. ఆ అమ్మాయి నిత్యశ్రీ. మహిళల పట్ల మనం ఎలా వ్యవహరించాలి. వారికి ఎలా సపోర్ట్ చేయాలనే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించాను. డిసెంబర్ 25న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి మహిళ తమ ఇంట్లోని పురుషుడిని వెంట తీసుకెళ్లి ఈ సినిమాను చూపిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు - ఆమని, వికాస్ వశిష్ఠ, కార్తికేయ దేవ్, నిత్య శ్రీ, మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ, ఛత్రపతి శేఖర్, నాగ మహేశ్, సునైన, రామచంద్ర, రాజశేఖర్, ఫణి, గీతాకృష్ణ రెడ్డి, ధృవన్ వర్మ, రాజమండ్రి శ్రీదేవి, సత్తన్న, వి. లోకేష్, నాగిరెడ్డి, అచ్యుత రామారావు, శేఖర్ నీలిశెట్టి, లడ్డు, గూడ రామకృష్ణ, భార్గవి, శ్రీవల్లి, సాయి రేణుక, గీత, మహేశ్, వినయ్, అఖిల్ యడవల్లి, తదితరులు

టెక్నికల్ టీమ్

డీవోపీ - వి రవికుమార్, భీమ్ సాంబ
ఎగ్జిక్యూటివ్‌ డీవోపీ - కృష్ణ
మ్యూజిక్ - వినోద్ కుమార్
లిరిక్స్ - భాస్కరభట్ల, ప్రసాద్ సాన
సింగర్స్ - రమణ గోగుల, ఆర్పీ పట్నాయక్, చిన్మయి శ్రీపాద, సి.షోర్
ఎడిటర్ - మాధవ్ కుమార్ గుల్లపల్లి
పీఆర్ఓ - మూర్తి మల్లాల
నిర్మాత - శ్రీమతి శశి వంటిపల్లి
దర్శకత్వం - సూర్య వంటిపల్లి

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%