Social News XYZ     

“Kali” Movie will Impress Audiences with Its Intriguing Storyline – Director Siva Sashu

"Kali" Movie will Impress Audiences with Its Intriguing Storyline - Director Siva Sashu

Young heroes Prince and Naresh Agastya star in the movie Kali, produced by Rudra Creations and presented by renowned story writer K. Raghavendra Reddy and directed by Siva Sashu. Leela Gautam Varma is the producer. This psychological thriller is gearing up for a grand theatrical release on October 4. In a recent media interaction, Director Siva Sashu discussed the film's features.

"I have had a habit of reading and writing literature since childhood, which has helped me craft the script well. My desire to become a director led me back to the film industry after a brief stint in business. I have worked as a ghostwriter for several films and collaborated with directors like Ashok, known for Bhaagamathie, and Arun Pawar, director of Saptagiri Express.

 

I developed the script for Kali during the lockdown. I believed that if I pitched it to Prince, we would do very well. Gautham Varma agreed to produce it under Rudra Creations, which is how the film began. We faced some initial difficulties; we initially considered casting Jagapathi Babu, but that did not materialize. I then shared the concept with Naresh Agastya, who was very enthusiastic and agreed to be part of the film.

Once Kali story was ready, it took a year and a half for pre-production and casting. The film is set in a single location, filmed at Ramoji Film city. Our cast and crew are all from a young generation, and we worked with clear ideas, which made the process smooth. Thanks to teamwork, we completed the film happily. K. Raghavendra Reddy acted as the presenter and provided us with great support.

In our movie, we aim to convey that suicide is not the solution to life's problems. According to a survey, 70 percent of people consider suicide at some point. Prince plays the character Shivaram, a genuinely nice person who faces numerous difficulties due to his kindness. The society he lives in treats him harshly, pushing him to contemplate suicide. At that critical moment, a stranger, played by Naresh Agastya, arrives at his home. The plot revolves around the events that unfold in Shivaram's life after this encounter.

Although the story focuses on two characters, the script and dialogues are gripping, making the entire movie engaging. Both Prince and Naresh Agastya delivered outstanding performances. Neha Krishnan plays the female lead, and Kali also features a compelling love story. Priyadarshi provides the voice for the character Bali, while Mahesh Vitta and Ayyappa P. Sharma also contribute voiceovers.

VFX has a significant focus in Kali, and we have ensured high-quality visual effects. The residence of Kali has been grandly visualized using VFX, which you will see at the end of the trailer. The film has received a clean U certificate from the censor board. Kali is not related to the film Kalki 2898AD; we chose the title Kali independently, while Kalki 2898AD had its title designated as First Project K.

I drew inspiration for Kali from the character of Kali Purush in our Puranas. The film releasing in theaters on October 4, and don't miss it in theatres which explores themes of time and soul that resonate with the current age.

ఆసక్తికర కథా కథనాలతో "కలి" మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - దర్శకుడు శివ శేషు

యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మిస్తోంది. శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తన ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు శివ శేషు.

  • చిన్నప్పటి నుంచి సాహిత్యం చదవడం, రచనలు చేయడం అలవాటు. స్క్రిప్ట్ బాగా రాస్తాను. దర్శకుడు కావాలన్నది నా కోరిక. కొంతకాలం బిజినెస్ చేశాను గానీ తిరిగి నేను ఇష్టపడే చిత్ర పరిశ్రమకే వచ్చాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పనిచేశాను. ఆ తర్వాత భాగమతి దర్శకుడు అశోక్ గారి దగ్గర, సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్ర దర్శకుడు అరుణ్ పవార్ గారి దగ్గర పనిచేశాను.

  • లాక్ డౌన్ టైమ్ లో కలి పేరుతో స్క్రిప్ట్ రెడీ చేశాను. ప్రిన్స్ కు చెబితే చాలా బాగుంది చేద్దామని అన్నారు. రుద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గౌతమ్ వర్మ ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు. అలా మా కలి మూవీ మొదలైంది. అయితే ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జగపతి బాబు గారిని ఓ క్యారెక్టర్ కు అనుకున్నాం. అయితే మూవీ ప్రొడక్షన్ కు జగపతి బాబు గారి కాస్టింగ్ సెట్ కాలేదు. దాంతో నరేష్ అగస్త్య కు ఈ కాన్సెప్ట్ చెప్పాను. ఆయనకు బాగా నచ్చి మూవీలో నటించారు.

  • కలి కథ సిద్ధమయ్యాక ఏడాదిన్నర ప్రీ ప్రొడక్షన్, కాస్టింగ్ కు టైమ్ పట్టింది. ఈ సినిమా ఒక లొకేషన్ లో జరుగుతుంది. ఫిలింసిటీలో సెట్ వేశాం. మా సినిమా పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ టీమ్ అంతా యంగ్ బ్యాచ్. స్పష్టమైన ఆలోచనలతో వర్క్ చేశాం కాబట్టి ఎక్కడా ఇబ్బంది రాలేదు. హ్యాపీగా టీమ్ వర్క్ తో మూవీ కంప్లీట్ చేశాం. కె.రా‌ఘవేంద్ర రెడ్డి గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు.

  • జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశాన్ని మా మూవీలో చెబుతున్నాం. ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో 70శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఆత్మహత్య ఆలోచన చేస్తున్నారు. కలి చిత్రంలో ప్రిన్స్ చేసిన శివరామ్ క్యారెక్టర్ చాలా మంచి వ్యక్తి. అతని మంచితనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. మెత్తగా ఉండేవాడిని సొసైటీ ఆడుకుంటుంది. అలా అతి మంచితనంతో ఉన్న శివరామ్ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. ఆ సమయంలో అతని ఇంటికి ఓ అపరిచిత వ్యక్తి వస్తాడు. ఈ క్యారెక్టర్ నరేష్ అగస్త్య చేశాడు. అతను వచ్చాక శివరామ్ లైఫ్ లో జరిగిన ఘటనలు ఏంటి అనేది ఈ చిత్ర కథాంశం.

  • ఇద్దరు పాత్రల మధ్య కథ సాగినా స్క్రిప్ట్, డైలాగ్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి కాబట్టి సినిమా అంతా ఆసక్తికరంగా సాగుతుంది. ప్రిన్స్, నరేష్ అగస్త్య ఇద్దరూ తమ పాత్రల్లో సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. హీరోయిన్ గా నేహా కృష్ణన్ నటించింది. కలి మూవీలో మంచి ప్రేమ కథ కూడా ఉంటుంది. ప్రియదర్శి బల్లి పాత్రకు డబ్బింగ్ చెప్పారు. అలాగే మహేశ్ విట్టా, అయ్యప్ప పి శర్మ ఇద్దరూ వాయిస్ ఓవర్స్ ఇచ్చారు.

  • కలి సినిమాలో వీఎఫ్ఎక్స్ కు మంచి ప్రాధాన్యత ఉంటుంది. క్వాలిటీగా వీఎఫ్ఎక్స్ చేశాం. కలికి ఓ నివాసం ఉంటుంది. వీఎఫ్ఎక్స్ లో ఆ నివాసాన్ని గ్రాండ్ గా విజువలైజ్ చేశాం. మీకు ట్రైలర్ చివరలో ఆ విజువల్స్ కనిపిస్తాయి. సెన్సార్ నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. కలి సినిమాకు కల్కి మూవీకి సంబంధం లేదు. మేము ముందు నుంచీ కలి అనే టైటిల్ నే పెట్టుకున్నాం. కల్కికి ఫస్ట్ ప్రాజెక్ట్ కె అనే టైటిల్ ఉండేది.

  • మన పురాణాల్లోని కలి పురుషుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని కలి మూవీ చేశాను. సమయాన్ని, ఆత్మను ఆధారం చేసుకుని ఈ యుగాన్ని ప్రభావితం చేసే కలిని మా కథలో ఎలా చూపించాం అనేది అక్టోబర్ 4న థియేటర్స్ లో చూడండి.

"Kali" Movie will Impress Audiences with Its Intriguing Storyline - Director Siva Sashu

Facebook Comments
"Kali" Movie will Impress Audiences with Its Intriguing Storyline - Director Siva Sashu

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.