Social News XYZ     

Devara Movie Review: NTR’s Mass Festival (Rating:3.25)

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వెండితెర మీద క‌నిపించి రెండున్న‌రేళ్లు అయ్యింది. త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ సినిమా రాలేదు. అది రామ్‌చ‌ర‌ణ్‌తో న‌టించిన మ‌ల్టీస్టార‌ర్‌.. అదే ఎన్టీఆర్ సోలో సినిమా అయితే 2018 చివ‌ర్లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌ రాఘ‌వ‌. ఐదున్న‌రేళ్ల త‌ర్వాత ఎన్టీఆర్ సోలోగా చేస్తోన్న సినిమా దేవ‌ర. ఎన్టీఆర్ సోలో స్టెప్పులు.. సోలో డ్యాన్సులు.. డైలాగుల కోసం నంద‌మూరి, ఎన్టీఆర్ అభిమానులే కాకుండా.. తెలుగు సినీ ప్రేమికులు.. ప్ర‌తి ఒక్క తెలుగు వ్యక్తి త‌పించిపోతున్నారు. వారి కోరిక ఎట్ట‌కేల‌కు దేవ‌ర రూపంలో వచ్చింది. దర్శకుడు కొర‌టాల శివ లాంగ్ గ్యాప్ తీసుకుని క‌సితో దేవ‌ర తీశారు. గ‌తంలో ఎన్టీఆర్ – కొర‌టాల కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి వీరి కాంబినేష‌న్ కావ‌డంతో స‌హ‌జంగానే అంచ‌నాలు ఉన్నాయి. రెండు పార్టులుగా వ‌స్తోన్న దేవ‌ర‌.. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ మానియాను కంటిన్యూ చేస్తుందా ? ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు అంచ‌నాలు అందుకుందా లేదా ? అన్న‌ది రివ్యూలో చూద్దాం పదండి.

కథ: దేవ‌ర ( ఎన్టీఆర్ ) భైర ( సైఫ్ ఆలీఖాన్ ) స్నేహితులు. స‌ముద్రంలో కొంద‌రు వ్యాపారుల స్మ‌గుల్ గూడ్స్ దొంగ‌త‌నానికి సాయం చేయ‌డం.. చేప‌లు ప‌ట్ట‌డం చేస్తూ బ‌తుకుతూ ఉంటారు. మ‌రో హీరో శ్రీకాంత్ కూడా ఇదే టీంలో ఉంటాడు. స‌మీపంలో నాలుగు గ్రామాల‌కు చెందిన వారంతా ప్ర‌తి యేటా ఆయుధ పూజ‌లో పాల్గొని మిగిలిన గ్రామాల వారిని ఓడించి ఆయుధాల‌ను ఆ యేడాది వాళ్ల ఊరికి తీసుకెళుతుంటారు. దేవ‌ర .. భైర‌ను ఓడించి ఒక్క‌సారి ఆయుధాలు వెళ్ల‌ని శ్రీకాంత్ గ్రామానికి ఆయుధాలు వెళ్లేలా చేస్తాడు. ఆ సంఘ‌ట‌న‌తో పాటు దేవ‌ర ఆధిప‌త్యం భైర స‌హించ‌లేక‌పోతుంటాడు. ఈ క్ర‌మంలోనే దేవ‌ర‌పై భైర ప‌గ‌బ‌ట్ట‌డం.. ఆ త‌ర్వాత దేవ‌ర క‌నిపించ‌కుండా పోవ‌డం జ‌రుగుతుంది.. ఇలా దేవ‌ర మాయ‌మై 12 ఏళ్లు అవుతుంది. ఆ త‌ర్వాత దేవ‌ర కొడుకు వ‌ర ( ఎన్టీఆర్ ) ఎంట్రీ ఇచ్చి త‌న తండ్రి త‌మ‌ను వ‌దిలేసి వెళ్లిపోయాడ‌ని.. తండ్రిపై కోపంతో భైర టీంలో చేర‌డం.. త‌న తండ్రిపై కోపంతో తండ్రినే చంపాల‌నుకోవ‌డం చేస్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలోనే వ‌రను తంగం ( జాన్వీక‌పూర్‌) ప్రేమిస్తుంది…ఇక భైర కూడా దేవ‌ర‌ను చంపేందుకు వ‌ర‌ను పంపుతాడు… మ‌రి వ‌రతో పాటు భైర టీం దేవ‌ర‌ను చంపిందా ? అస‌లు దేవ‌ర అన్నేళ్ల పాటు ఏమ‌య్యాడు ? ఎక్క‌డ ఉన్నాడు… తొలి పార్ట్ ఎక్క‌డితో ముగిసింది అన్న‌దే క‌థ‌.

కథ... కథనం విశ్లేషణ: మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడ‌డానికి పుట్టాయి. మీ ఆయుధాలు మంచిని చంప‌డానికి పుట్టాయి. నువ్వుకాని మీ వాళ్లు కోసం ఈ ప‌ని కోసం మ‌ళ్లీ నా ద‌గ్గ‌ర‌కు వ‌స్తే మీ శ‌వాలు కూడా ఈ గ‌ట్టు దిగ‌వు.. ఇదే ఈ దేవ‌ర మాట‌.. ఈ డైలాగే చెబుతుంది దేవర సినిమా ఫ్యాన్స్ ను ఎంతలా అలరిస్తుందో. సెకండాఫ్‌లో ఆయుధాల కోసం వ‌ర చేసే ఫైట్‌ ఫ్యాన్స్ కు ఊరమాస్ ఎంటర్టైన్ మెంట్ ఇస్తుంది. అలాగే చుట్టమల్లే చుట్టుసావే పాట థియేటర్లో ఫ్యాన్స్ ను కుర్చీల్లో కుర్చోనివ్వదు. కొరటాల శివ తన మార్క్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ను అలరించారు. టోటల్ గా దేవర... ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. ఐదున్నరేళ్ల తరువాత వచ్చిన ఎన్టీఆర్ మూవీ... ఫ్యాన్స్ కు పండగే.

 

దేవరగా, వరగా డ్యూయెల్ రోల్ లో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడు... ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఎన్టీఆర్ తన మార్క్ మాస్ లుక్ లో ఫ్యాన్స్ ను అలరించారు. తన పాత్రకు జాన్వీ కపూర్ న్యాయం చేసింది. తెలుగు ఆడియన్స కు శ్రీదేవి కూతురుగా ఎన్టీఆర్ సినిమాతో పరిచయం కావడం ఆమె బాగా ప్లస్ అయింది. ఆమె హావ భావాలు అన్నీ పక్కింటి అమ్మాయిలా వన్నాయి. మాస్ లుక్ లో బాగా మెప్పించింది. రంగస్థలంలో సమంత పాత్రను పోలి వుంటుంది లంగా వోణిలో. సైఫ్ అలీ ఖాన్ విలక్షణ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు.. మాస్ లుక్ లో అలరించారు. ఇక శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళి శర్మ ఎవరికి వారు తక్కువ కాకుండా వారి నట విశ్వరూపాన్ని చూపించారు.. దర్శకుడు ఇచ్చిన పాత్రలకు నటులు పూర్తిగా న్యాయం చేశారు.
అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.. సాంగ్స్ కు వచ్చిన హైప్ కు మించి తన.. అసలు ఏ సినిమాలో ఇవ్వని పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక రత్నవేలు సినెమాటోగ్రపి గురించి అయితే అసలు చెప్పాల్సిన పనిలేదు . రత్నవేలు, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా ఎక్కడికోవెళ్ళిపోయింది.. దర్శుకుడు కొరటాల శివ ఫ్యాన్స్ కు కావాలన్సిన దానికంటే ఎక్కువే ఇచ్చారు.. ప్రీ ఇంటర్వెల్ సీన్స్.. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల్లో ఊహించని ట్విస్టులు ఇచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మంచి సినిమా ఇచ్చారు. చివరగా ఎన్టీఆర్ కోసం సినిమా చూడొచ్చు.

రేటింగ్: 3.25

Devara Movie Review: NTR's Mass Festival (Rating:3.25)

Facebook Comments
Devara Movie Review: NTR's Mass Festival (Rating:3.25)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.