Manyam Dheerudu Movie Review: A Delightful Story Of A Revolutionary (Rating:3.25)

బ్రిటీష్ వారి బాని సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా... వెండితెరపై చూసినా.... కొత్తగానే వుంటుంది. ఆ పాత్ర నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. అలాంటి పాత్రను మరోసారి రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ తానే సినిమాని నిర్మించి టైటిల్ పాత్రలో నటించారు. మన్యం ధీరుడు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి.మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ఆడియన్స్ ను ఏమాత్ర ఆకట్టుకున్నారో చూద్దాం పదండి.

కథ: మన్యం వీరుడు అంటే ఈ కాలం వారికి అందరికీ తెలిసిందే. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన అల్లూరి సీతారామరాజు వారి తుపాకీ గుళ్లకు బలై నెలకొరిగారు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ పోషించారు. సహజసిద్ధంగా లభించిన భూమిని దుక్కి దున్ని చేసుకుంటున్న మన్యం ప్రజలపై పన్నులు వేసి... బలవంతంగా వసూళ్లను చేయడం అల్లూరి సీతారామరాజు వ్యతిరేకిస్తారు. అందుకు ప్రతిగా బ్రిటీష్ వారు ఎలా స్పందించారు? సీతారామరాజు వారిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి... ప్రజల తరఫున పోరాడాడు? స్వాతంత్రం కోసం మన్యం ప్రజలను ఎలా మేలుకొల్పాడు? గూడేళ్లో వున్న పేద ప్రజల్లో వున్న మద్యం సేవించడం తదితర అలవాట్లను ఎలా మాన్పించి వారిని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేశారు? లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథ... కథనం విశ్లేషణ: స్వాతంత్రోద్యమంలో విప్లవ వీరుల కథలను నేటి యువతకూ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా వుంది. టెక్నాలజీ యుగంలో కొట్టుకుపోతున్న యువతకు ఇలాంటి స్వాతంత్రోద్యమకారుల గురించి ఎప్పటికప్పుడు చెబుతూ... భావి తరాల వారికి చరిత్ర మరిచిపోకుండా చేయడం మనవంతు. గతంలో అల్లూరి సీతారామరాజు జీవిత కథను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డులు పొందాయి. అలాంటి మన్యం వీరుడి కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను అపహరించడం... వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడంలాంటి సన్నివేషాలన్నీ ఆడియన్స్ కు గూస్ బమ్స్ తెప్పిస్తాయి. అలాగే మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఎదిరించడం... బ్రిటీష్ వారి మీద పోరాటం చేసే సన్నివేషాలన్నీ మాస్ ని అలరిస్తాయి. అందుకుతగ్గట్టుగా రాసుకున్న సంభాషణలు కూడా మెప్పిస్తాయి. నటుడు రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ కూడా స్పష్టంగా వుంది. వీటికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా వున్నా... సెకెండాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా వుండటం వల్ల సినిమా పరుగులు పెడుతుంది. దాంతో ఆడియన్స్ ఎక్కడా బోరింగ్ గా ఫీల్ అవ్వరు. జబర్దస్థ్ అప్పారావుతో కాసేపు నవ్వించే ప్రయత్నం చేసినా... ఓ యువజంట ప్రేమాయణం గురించి కథకు అవసరం లేకున్నా చొప్పించినా... అవి కూడా సరదాగానే ఉంటాయి. మద్యపానం సేవించడం సమాజానికి, కుటుంబానికి మంచిది కాదని చెప్పే ప్రయత్నం బాగుంది.

అలాగే స్వాతంత్రం భారతదేశానికి ఎంత అవసరమో... బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు చెప్పడం, వారిని కూడా వారికి వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, మన భూమిన మనం దుక్కి దున్నితే... వాళ్లకు పన్ను ఎందుకు కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అనేక అంశాలను ఇందులో చూపించారు. ఇలాంటి వన్నీ యువతకు బాగా మెసేజ్ ఇచ్చేలా వున్నాయి. ఓవరాల్ గా ఈ మన్యం ధీరుడు పేరుతో మన ముందుకు వచ్చిన ఈ సినిమా... బ్రిటీష్ వారిపై పోరాడిన ఓ విప్లవ వీరుడి కథగా ఆకట్టు ఆకట్టుకుంటుంది. రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ టైటిల్ పాత్రలో బాగా ఒదిగిపోయారు. ఆహర్యం, డైలాగ్ డెలివరి, డిక్షన్ బాగున్నాయి. అలాగే ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గుర్రపుస్వారీ, కత్తియుద్ధం కూడా విల్లు విద్యలు నేర్చుకుని నటించడం రియల్ స్టిక్ గా వుంది. ఓ యథార్థకథను ప్రజల ముందుంచే ప్రయత్నం చేయడం అభినందనీయం. అలాగే బ్రిటీష్ వారిని ఎదిరించే మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ కూడా చివరి దాకా బాగా నటించారు. అతన్ని విడిపించడానికి సీతారామరాజు చేసే ప్రయత్నం... బ్రిటీష్ వారికి, సీతారామరాజుకు మధ్య జరిగే భీకర సన్నిశాల్లో మల్లుదొర పాత్ర కూడా ఎంతో ప్రాధన్యత సంతరించుకుంది. జబర్దస్థ్ అప్పారావు, సత్తి పండు పాత్రలు కాసేపు ఉన్నా... నవ్విస్తాయి. కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

ఈ చిత్రంలో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది విలేజ్ సెట్టింగ్. మన్యంలో గూడెం ఎలా వుంటుందో చాలా నాచురల్ గా వేశారు. అర్ట్ వర్క్ రిచ్ గా వుంది. సినిమాటోగ్రఫీ చాలా నాచురల్ గా వుంది. మన్యం అందాలు, గూడెం ప్రాంతాలను బాగా చూపించారు. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రదేశాలలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుంది. ఆ ప్రాంతాలను కూడా బాగా అందంగా కెమెరాలో బందించారు. అల్లురి సీతారామరాజు ఎలివేష్ షాట్స్ బాగున్నాయి. పాటల పిక్చరైజేషన్ మరింత పవర్ ఫుల్ గా వుండాల్సింది. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. బోర్ కొట్టించే సన్నివేశాలన్నింటినీ ట్రిమ్ చేసి... చాలా పకడ్బంధీగా సినిమాని ఎడిటింగ్ చేశారు. దాంతో సినిమా చాలా ఫాస్ట్ గా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. రెండుగంటలలోపే నిడివి వుండటం ఈ సినిమాకి ప్రధాన బలం. డైరెక్టర్ కథను బాగానే డీల్ చేశారు. ఓ విప్లవ వీరుడి కథకు కావాల్సిన యాక్షన్ సీన్స్, సంభాషణలన్నీ చాలా పవర్ ఫుల్ గా వున్నాయి. హీరో మరింత బలిష్టంగా వుంటే... సీతారామరాజు పాత్ర మరింత బాగా పండేది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని తెరకెక్కించారు.

గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3.25

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.