Acclaimed Director-Producer Purvaj announced the launch of his new production company, Think Cinema

Director-producer Purvaj has captivated audiences with a range of films including "Shukra" and "Matarani Maunamidi." He is currently working on a major superhero project titled "A Masterpiece," featuring Arvind Krishna, Jyoti Purvaj, Manish Gilada, Ashu Reddy, and Sneha Gupta in prominent roles. Having been involved in the production of "Shukra," "Matarani Maunamidi," and "A Masterpiece," Purvaj has now announced the establishment of his own production house, Think Cinema.

Purvaj shared his vision for the new venture, stating that Think Cinema aims to entertain audiences with high-quality films featuring strong content. He revealed that the company’s debut film will begin production this year and is scheduled for release in July of the following year.

Purvaj remarked, "We have previously worked on several pilot films and web series, and were involved in the production of 'Shukra,' 'Matarani Maunamidi,' and 'A Masterpiece.' Building on our experience with these projects, we are excited to launch Think Cinema. Our goal is to create content-driven films and establish our company as a prominent production banner. We look forward to releasing our first film under Think Cinema in July next year."

థింక్ సినిమా ప్రొడక్షన్ కంపెనీ అనౌన్స్ చేసిన ప్రముఖ దర్శక నిర్మాత పూర్వాజ్

"శుక్ర", "మాటరాని మౌనమిది" వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శక నిర్మాత పూర్వాజ్. ఆయన ప్రస్తుతం "ఏ మాస్టర్ పీస్" అనే భారీ సూపర్ హీరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, మనీష్ గిలాడ , అషు రెడ్డి, స్నేహ గుప్త కీ రోల్స్ లో నటిస్తున్నారు. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ సినిమాల నిర్మాణంలో భాగమైన పూర్వాజ్...తాజాగా 'థింక్ సినిమా' ప్రొడక్షన్ హౌస్ ను ప్రకటించారు.

థింక్ సినిమా బ్యానర్ ద్వారా కంటెంట్ ఉన్న మంచి సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించబోతున్నట్లు ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ తెలిపారు. ఈ సంస్థ మొదటి సినిమా ఈ ఏడాదిలోనే ప్రారంభమై వచ్చే ఏడాది జూలైలో విడుదలకు తీసుకొస్తామని పూర్వాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా

దర్శక నిర్మాత పూర్వాజ్ మాట్లాడుతూ - మేము గతంలో పలు పైలట్ ఫిలింస్, వెబ్ మూవీస్ చేశాం. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ చిత్రాల నిర్మాణంలో భాగమయ్యాం. ఆ ప్రాజెక్ట్స్ లతో ప్రొడక్షన్ లో వచ్చిన అనుభవంతో సొంత నిర్మాణ సంస్థ థింక్ సినిమాను ప్రకటిస్తున్నాం. మా సంస్థలో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేసి ఒక మంచి బ్యానర్ గా స్థిరపడాలని ఆశిస్తున్నాం. థింక్ సినిమా సంస్థలో మొదటి సినిమా ఈ ఏడాది ప్రారంభించి వచ్చే ఏడాది జూలైలో విడుదల చేస్తాం. అన్నారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%