గోదావరి ఎటకారం మామూలుగా వుండదు. ఆ భాషలో వున్న హాస్యపు జల్లు... ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించేస్తుంది. అందుకే ఆ భాషను బేస్ చేసుకుని తీసిని సినిమాలన్నీ గత దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి... మెప్పించేస్తున్నాయి. తాజాగా తీసిన ‘ఆయ్’ మూవీ కూడా అంతే. దీనికి ‘మేం ఫ్రెండ్సండీ’ అనేది శీర్షిక పెట్టడంతోనే ఈ సినిమా స్నేహితుల మధ్య జరిగే ప్రధాన కథ.. అని తెలిసిపోతుంది. ఆ కథను ముందుకు నడిపించడంలో దర్శకుడు క్రియేట్ చేసిన స్క్రీన్ ప్లే... ఆడియన్స్ ను మామూలుగా ఎంగేజ్ చేయదు. ఎక్కడేకానీ అర క్షణం కూడా బోరింగ్ అనిపించకుండా చాలా సరదాగా సినిమాను అలా క్లైమాక్స్ కు తీసుకెళ్లేసి... ‘ఆయ్’గా నవ్వుకున్నారు కదా... మళ్లీ ఒకసారి మీ స్నేహితులతో వచ్చేయండి అనిపించేలా సినిమాని తెరకెక్కించారు దర్శకుడు.
‘మ్యాడ్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నార్నె నితిన్ ఇసారి ‘ఆయ్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అతనితో పాటు రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య సహాయ నటులుగా చేశారు. నార్నె నితిన్ కి జోడీగా నయన్ సారిక నటించారు. ముగ్గురు స్నేహితుల నేపథ్యంలో ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఎ2 బ్యానర్ పై బన్ని వాసు, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు. కొత్త దర్శకుడు అంజి మణిపుత్త దర్శకత్వంలో ఈ సినిమాని వెండితెరపై ఆవిష్కరించారు. మరి ఈ సినిమా ఈరోజే విడుదలైంది. ఆల్రెడీ ఈరోజే రెండు పెద్ద సినిమాలు మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ విడుదలయ్యాయి. అలాగే హిందీ మూవీస్ అయిన వేదా, స్త్రీ2 కూడా రిలీజ్ అయ్యాయి. మరి ప్రేక్షకుల్ని ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన ముందుకు ‘ఆయ్’ మేం ఫ్రెండ్స్ మండీ అంటూ మన ముందుకుచ్చిన ఈ సినిమా ఎలా వుందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ: ఫస్ట్ లాక్ డౌన్ తరువాత... సెకెండ్ లాక్ డౌన్ కి మధ్యలో ఈ కథ జరుగుతుంది. హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే కార్తీక్... లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోంతో గోదావరి జిల్లాలోని తన సొంతవూరు పాసర్లపూడి గ్రామానికి వస్తాడు. అతని తండ్రి ఆడబాల బూరయ్య(సీనియర్ నటుడు వినోద్ కుమార్). అయితే ఇతనికి దాన ధర్మాలు ఎక్కువ. అప్పుచేసి మరీ దానం చేసేస్తుంటారు. అందుకే కార్తీక్ కి తన తండ్రి అంటే కొంత కోపం వుంటుంది. కార్తీక్ కి అదే ఊరిలో మరో ఇద్దరు మిత్రులు సుబ్బు(రాజ్ కుమార్ కసిరెడ్డి), హరి(అంకిత్ కొయ్య) వుంటారు. వర్క్ ఫ్రం హోం కావడంతో వీరితో సరదాగా ఊళ్లో తిరిగేస్తూ... సరదాగా సమయాన్ని గడిపేస్తుంటారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఫంక్ పల్లవి(నయన్ సారిక)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆమె తండ్రి వీరవాసం దుర్గ(మైమ్ గోపి) పేరు మోసిన రౌడీ. అతనికి కులాలు, ఆస్తి అంతస్తుల పట్టింపు ఎక్కువ. అయితే కార్తీక్, పల్లవి కులాలు వేరుకావంతో పల్లవి... తల్లిదండ్రుల కోరిక మేరకు వేరే అతనిని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. మరి కార్తీక్... తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నారు? అందుకు తన స్నేహితులు, తన తండ్రి బూరయ్య ఎలా సహాయం చేశారు? అతనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ... కథనం విశ్లేషణ: సినిమాలో కొత్త నటీనటులు నటిస్తున్నారంటేనే... నటనలో వారి స్ట్రెంత్ ఏంటో తెలుసుకోవాలి దర్శకుడు. అప్పుడే తను రాసుకున్న కథ... కథనాలకు న్యాయం చేస్తారు. వారి బలాలు, బలహీనతలు తెలుసుకుని సినిమాని ప్రేక్షకులు మెచ్చేలా అందిస్తే... ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్టే. ఇదే చేశారు ‘ఆయ్’ దర్శకుడు. తనకు డెబ్యూ మూవీనే అయినా... ఎక్కడా తడబాటు లేకుండా సినిమాని ఆద్యంతం అలరిస్తూ... ‘ఆయ్’గా ప్రేక్షకులను న్వించేశారు.
ఆయ్ సినిమాని ముందు నుంచి కూడా కామెడీ ఎంటర్టైనర్ అనే చెప్తూ ప్రమోట్ చేసారు. దానికి తగ్గట్టే సీరియస్ క్యాస్ట్ సబ్జెక్టుని కూడా కామెడిగానే చూపించారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో వర్షాకాలంలో ఈ సినిమాని చాలా అందంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కార్తీక్ ఊరికి రావడం, ఫ్రెండ్స్ తో అల్లరిగా తిరగడం, పల్లవితో ప్రేమలో పడటం, ఫ్రెండ్స్ చేసే కామెడీతో సాగుతుంది. ఇంటర్వెల్ కి పల్లవి ఇంట్లో చూసిన సంబంధం ఒప్పుకొని షాక్ ఇస్తుంది. దాంతో సెకండ్ హాఫ్ లో వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనే ఆసక్తి నెలకొంది. ఇక సెకండ్ హాఫ్ లో కార్తీక్ బాధ, అతని ఫ్రెండ్స్ చేసే కామెడీతో పాటు వాళ్లిద్దరూ ఎలా కలుస్తారో చూపించారు.
ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అవ్వలేదు. లవ్ స్టోరీ బాగుంది. సెకండ్ హాఫ్ లో మాత్రం ఫుల్ గా నవ్వించడంతో పాటు లవ్ ఎమోషన్ ని, తండ్రి – కొడుకుల ఎమోషన్ ని పండించారు. అయితే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ముందు కొంచెం సాగదీసినట్టు అనిపించినా క్లైమాక్స్ లో ఓ మంచి ఎలివేషన్ తో ట్విస్ట్ ఇచ్చి అదరగొట్టారు. ఒక సీరియస్ క్యాస్ట్ సబ్జెక్టు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజి అంశాన్ని చాలా కామెడీగా చక్కగా చూపించారు. కామెడీ మాత్రం ఫుల్ గా వర్కౌట్ అయింది. ఓ ఐటెం సాంగ్ మాత్రం అనవసరంగా పెట్టారు అనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ బామ్మర్ది అవడంతో సినిమాలో చాలా ఆచోట్ల హీరో వెనక ఎన్టీఆర్ బ్యానర్లు, బొమ్మలు వచ్చేలా పెట్టడంతో పాటు వేరే హీరోల రిఫరెన్స్ లు కూడా వాడుకున్నారు.
నార్నె నితిన్ ‘మ్యాడ్’ సినిమాలో లాగే... చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో సింపుల్ గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఎక్కడా తడబాటు లేకుండా త్రూ అవుట్ మూవీ మొత్తం మెప్పించే ప్రయత్నం చేశారు. అతనికి సహాయ నటులుగా నటించిన అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి మాత్రం ఫుల్ ఎంటర్టైన్ చేశారు. ఫుల్ ఫన్ డైలాగులతో వీరిద్దరూ చేసినంత ఎంటర్టైన్... ఇందులో మరెవ్వరూ చేయలేదనే చెప్పాలి. నితిన్ కి జంటగా నటించిన నయన్ సారిక కూడా... సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా... ఏ విషయాన్నైనా చాలా సింపుల్ గా తీసుకుని... గలగలా మాట్లాడేసే గోదావరి జిల్లా అమ్మాయిగా తెగ ఆకట్టుకుంటుంది. ఈ జనరేషన్ అమ్మాయిగా మెప్పించేసింది. కార్తీక్ తండ్రిగా వినోద్ కుమార్, పల్లవి తండ్రిగా మైమ్ గోపిల పాత్ర క్లైమాక్స్ లో ప్రేక్షకుల్ని గుండెలకు హత్తుకునేలా చేస్తుంది. బిగ్ బాస్ ఫేం సరయు పాత్ర కూడా బాగుంది. ఇక మిగతా పాత్రలన్నీ తమతమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు ఫస్ట్ సినిమాకే మంచి హిలేరియస్ కామెడీ మూవీని తెరకెక్కించి హిట్ కొట్టారు. తన పెన్ పవర్ ఇందులో పేలింది. అందుకే ఎలాంటి హీరోయిజం లేకున్నా... ఓ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ని ఆవిష్కరించి విజయం సాధించారు. విజువల్స్ చాలా బాగున్నాయి. మరోసారి గోదావరి జిల్లాల అందాల్ని చూపించారు. సంగీతం ఈ సినిమాకి బాగా ప్లస్ అయింది. పాటలు బాగున్నాయి. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం కూడా ఒకింత సినిమాకి లాభం అయింది. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా వున్నాయి. సరదాగా ఈ సినిమాని చూసేయండి.
రేటింగ్: 3
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.