Making Music for "Thangalaan" Was Very Enriching - Music Director GV Prakash Kumar
"Thangalaan" is a period action film starring Chiyaan Vikram as the lead. The movie is produced by director Pa Ranjith and prominent producer KE Gnanavelraja under the Studio Green Films banner, in association with Neelam Productions. Parvathy Thiruvothu and Malavika Mohanan play the female leads in the film, which is set against the backdrop of the Kolar Gold Fields. Scheduled for a grand worldwide theatrical release on the 15th of this month, coinciding with Independence Day, the film has generated significant anticipation. In this context, talented music director GV Prakash Kumar shared his experience working on the film in a recent interview.
- I felt very excited when I received the offer to work on "Thangalaan." The film is on a grand scale, akin to Indiana Jones. Upon hearing the script, I understood the kind of music that would complement the story. Set in pre-independence times with a tribal backdrop, I was curious about the music created by tribal communities. I studied the music of Australian and African tribes to inform my approach. Instead of using modern music, we crafted an original score that fits the story’s context. My team was incredibly supportive throughout the process.
-
"Thangalaan" is a massive project. I spent 50 days re-recording the music for the film, and at times, I had to tune in advance by two or three days. The primary challenge was the limited time frame, but we managed to produce an excellent result. Director Pa Ranjith shared his vision with me, and I tailored the music to align with his vision. Working on "Thangalaan" as a music director was immensely satisfying.
-
The title song "Thangalaan" and the track "Manaki Manaki" have received a positive response, with many views on digital platforms. Beyond the songs, the background music (BGM) is also very impactful. The story encompasses a range of emotions—love, conspiracy, conflict, and anger. I created the BGM to enhance these emotions and connect more effectively with the audience.
-
Director Pa Ranjith has crafted a remarkable film with a magical realism screenplay. Although there have been period films with magical realism in the past, this one has additional layers. Working with Pa Ranjith was a fantastic experience.
-
Vikram's transformation for this film is impressive. The movie demands significant physical effort from the actors, and Vikram’s dedication was evident. The female characters, portrayed by Parvathy Thiruvothu and Malavika Mohanan, are particularly strong and their performances are outstanding.
-
"Thangalaan" will present audiences with a new world, and I am eagerly looking forward to watching it on the big screen with you all. I am confident that viewers will experience the thrill of "Thangalan."
-
Although new technologies, including AI, are becoming available, it's important not to rely solely on technology. There should be a balance in how much we use it.
-
I am also working on several exciting projects, including "Lucky Baskhar" starring Dulquer in Telugu and "Robin Hood" starring Nithiin. Additionally, I have projects with Dil Raju under Vyjayanthi banners and a Tamil film directed by Dhanush. I am also involved in films with Sivakarthikeyan's Amaran. As both an actor and music director, I have carefully planned my priorities to avoid causing any disruptions.
"తంగలాన్" కు మ్యూజిక్ చేయడం ఎంతో సంపృప్తినిచ్చింది - మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. "తంగలాన్" సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు మ్యూజిక్ చేసిన ఎక్సీపిరియన్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో షేర్ చేశారు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్.
- "తంగలాన్" సినిమా ఆఫర్ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. "తంగలాన్" ఇండియానా జోన్స్ వంటి భారీ మూవీ. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడు ఈ కథకు ఎలాంటి మ్యూజిక్ చేయాలి అనేది అర్థమైంది. ట్రైబల్ నేపథ్యంగా ప్రీ ఇండిపెండెన్స్ టైమ్ లో జరిగే స్టోరీ ఇది. ట్రైబల్స్ ఎలాంటి మ్యూజిక్ క్రియేట్ చేస్తారు అనేది ఆలోచించాను. ఆస్ట్రేలియన్, ఆఫ్రికన్ ట్రైబ్స్ క్రియేట్ చేసే కొన్ని మ్యూజిక్స్ అబ్సర్వ్ చేశాను. ఇలాంటి సినిమాకు మోడరన్ మ్యూజిక్ సెట్ కాదు. ఒరిజినల్ గా , ఆ కథా నేపథ్యానికి తగినట్లు మ్యూజిక్ క్రియేట్ చేశాం. "తంగలాన్"కు మ్యూజిక్ ఇవ్వడంలో నా టీమ్ ఎంతో సపోర్ట్ చేశారు.
-
"తంగలాన్" ఒక భారీ సినిమా. ఈ సినిమా కోసం 50 రోజులు రీ రికార్డింగ్ చేశాను. కొన్నిసార్లు రెండు మూడు రోజుల ముందు ట్యూన్ చేయాల్సి వచ్చేది. టైమ్ తక్కువగా ఉండటం ఒక్కటే ఈ సినిమాకు మ్యూజిక్ చేయడంలో నేను ఎదుర్కొన్న సవాలు. అయినా పర్పెక్ట్ ఔట్ పుట్ తీసుకురాగలిగాం. దర్శకుడు పా రంజిత్ తన విజన్ ను నాకు చెప్పాడు. ఆయన విజన్ ను అర్థం చేసుకుని అందుకు తగినట్లు మ్యూజిక్ చేశాను. సంగీత దర్శకుడిగా "తంగలాన్"కు వర్క్ చేయడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది.
-
"తంగలాన్" టైటిల్ సాంగ్, మనకి మనకి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో చాలా వ్యూస్ వస్తున్నాయి. పాటలే కాదు బీజీఎం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ కథలో ప్రేమ, కుట్ర, పోరాటం, కోపం వంటి ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని ఎలివేట్ చేసేలా, మరింతగా ప్రేక్షకులకు ఎఫెక్టివ్ గా రీచ్ చేసేలా బీజీఎం చేశాను.
-
దర్శకుడు పా.రంజిత్ గారు ఒక గొప్ప మూవీని మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఆయన మ్యాజికల్ రియలిజం స్క్రీన్ ప్లేతో సినిమాను రూపొందించారు. మ్యాజికల్ రియలిజంతో గతంలోనూ కొన్ని పీరియాడిక్ మూవీస్ వచ్చినా..ఇందులో మరికొన్ని అదనపు లేయర్స్ ఉంటాయి. పా రంజిత్ గారితో వర్క్ చేయడం ఫెంటాస్టిక్ ఎక్సీపిరియన్స్ ఇచ్చింది.
-
విక్రమ్ గారు ఈ సినిమా కోసం మారిపోయిన తీరు ఆశ్చర్యపరిచింది. ఇది నటీనటులకు ఫిజికల్ గా స్ట్రెయిన్ చేసే సినిమా. విక్రమ్ గారు తన గత చిత్రాల్లాగే ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. "తంగలాన్"లో ఫీమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. పార్వతీ తిరువోతు, మాళవిక ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ ఇచ్చారు.
-
"తంగలాన్" సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. నేను మీతో పాటే ఈ సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తున్నాను. మీరంతా "తంగలాన్" చూసి థ్రిల్ ఫీలవుతారని మాత్రం చెప్పగలను.
-
ఏఐ సహా ఎన్నో కొత్త టెక్నాలజీలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే టెక్నాలజీపైనే ఆధారపడటం సరికాదు. ఎంతవరకు మనం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి అనే ఐడియా ఉండాలి.
-
తెలుగులో దుల్కర్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్, నితిన్ హీరోగా చేస్తున్న రాబిన్ హుడ్ తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దిల్ రాజు గారితో, వైజయంతీ బ్యానర్స్ లో మూవీస్ చేయాల్సిఉంది. తమిళంలో ధనుష్ గారి డైరెక్షన్ లో మూవీ, శివకార్తికేయన్ అమరన్ తో పాటు మరికొన్ని బిగ్, ఎగ్జైటింగ్ సినిమాలు చేస్తున్నాను. నటుడుగా, సంగీత దర్శకుడిగా నా ప్రయారిటీస్ క్లియర్ గా పెట్టుకున్నాను. ఏ సినిమాలకు ఎప్పుడు వర్క్ చేయాలనేది ఎవరికీ ఇబ్బంది రాకుండా ప్లాన్ చేసుకుంటున్నా.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.