Social News XYZ     

A grand curtain raiser program of Nandamuri Balakrishna Golden Jubilee celebrations

It is a great thing for a hero to complete 50 years of reign in Tollywood in an unprecedented manner. Nandamuri Balakrishna, who made his debut with the film 'Tathamma Kala', is completing 50 years as an actor. Balayya making his 108th film under the direction of Bobby. On the auspicious occasion of Balakrishna's 50th birthday, the Telugu film industry is gearing up to celebrate his golden jubilee. A curtain raiser program was held at FNCC on Wednesday to reveal the details of the ceremony to be held on September 1. Both Nandamuri Ramakrishna and Nandamuri Mohanakrishna launched the poster of Golden Jubilee celebrations in this event which was attended by many celebrities.

Nandamuri Mohanakrishna said : "It is really a great thing that my younger brother Balakrishna has completed 50 years as an actor. He has proved himself as an actor who can do any role. Balakrishna stood in the industry as the successor of our Father continuing the legacy. Balakrishna is the successor of his father not only in acting but also in politics. He won the last election and achieved a hat trick. It has been proved that Hindupuram is the land of Nandamuris.

Producer Tammareddy Bharadwaja said : "Even after completing 50 years as an actor, Balakrishna continues to compete with young heroes. After Amitabh Bachchan, there is no other actor in Indian cinema who has completed as many years as Balakrishna. Even now Balayya walks like a common man since he went to school. He is very simple. When we both went to Goa once, he bought a tray of water bottles and carried them. That simple he is ever. Balayya is a producer's man. He is my favorite actor. I am very happy to complete 50 years. He said that everyone should come and make this program a grand success.

 

Producer Chadalavada Srinivasa Rao said : "On the occasion of Rama Rao garu acting successor Nandamuri Balakrishna's 50th birthday, the entire Telugu industry will come together to show the power of Tollywood."

Producer Kaikala Nageswara Rao said : ''Our family has very close ties with the Nandamuri family. Rama Raogaru treated my brother Kaikala Satyanarayana as his own younger brother. After NTR garu, his successor Balakrishna also takes the lead in giving respect to producers. Balayya believes that if the producer is good, the industry will be good. So sucha a person Balakrishna Golden Jubilee celebrations should be held in a grand manner."

Senior director Kodandarami Reddy said : ''I have done more films with Balayya. Having done 13 films with him, you can understand how good he is. Balayya also respects the directors like his brother. Being a hero for 50 years is a great thing. I feel lucky to be in this place with these legends NTR garu and Balakrishna garu. Jai Balayya is a slogan every one chants wherever I go. Balakrishna is the actor who caught the youth nerve. As the successor of Rama Rao, he got a good name in movies and politics.''

Actor Madalaravi said : "It is a great pleasure that the Movie Artist Association is also participating in Nandamuri Balakrishnagari's 50th anniversary celebrations. Balakrishna is the proud hero of our association. Apart from playing various roles in movies, he also served in politics by scoring a hat-trick. Also serving through cancer hospital. It is a great thing to celebrate the golden jubilee of the great hero Balakrishna who came from the Nandamuri family.''

Shivbalaji, treasurer of MAA association said :''It is a great thing to complete 50 years as an actor. Congratulations to Balayya. We are waiting for that event. We do what the elders say. I wish everyone to participate and make the event grand success."

Producer Damodar Prasad said : "We are making Balakrishna's golden jubilee celebrations a prestigious celebration. We are inviting many people from South India. We will make this ceremony a great memorable event."

Film Chamber President Bharat Bhushan said : ''We are asking for all your cooperation to make this program a success on September 1.''

Senior producer C Kalyan said : "I am happy and afraid that our Balayya Golden Jubilee function is going on. His films and his collections are all records. My wish is that this function will break all those records and go even bigger. We will definitely do great. No matter how any function was done before, this program is going to be successful. Everyone loves Balayya. Hope everyone will definitely participate. Actors of all languages across the country will participate in this program. The Balayya Golden Jubilee program will be held as a great event in the Indian film industry."

Director YVS Chowdhary said, "In May 1974, I saw the movie Tatamma Kala in Gudivada. From there, 50 years flashed before our eyes and we have come this far, it seems like a dream. Then I was the son of a lorry driver. A fan of Rama Rao garu. After that, I feel fortunate to come to the industry and speak in front of you like this. Nandamuri Balakrishna was at home with his parents as well as his teacher. That is his luck. He seemed like a legacy carrier to his father in politics as well as movies. I want his 50-year celebration to be inspirational for all.''

Tummala Prasannakumar said : ''Nandamuri Balakrishna is the only hero who entered as a hero and is still a hat-trick hero, a hat-trick MLA and also serving people by the Basavatharakam Cancer Hospital. Balakrishna is the hero who created a record that no one can achieve in the future. Only Nandamuri family has done Rama and Krishna for four generations. Balakrishna made many secret donations in the field of service. He helped and treated the daughter of a teacher in Madanapalle with his own money. A response program was undertaken in Rayalaseema when floods occurred. Balayya did the same as NTR's successor. Everyone should attend Balayya's 50th birthday celebration. Balayya did not agree to this ceremony before. But later he agreed that it would be an inspiring project. We will make this program like never before ever after."

Writer Paruchuri Gopalakrishna said : "I am a fan of Rama Rao garu. We were fortunate enough to write a film for Rama Raogar, whom I adored. In 1981, I wrote for the movie Chandasasanudu. At that time a handsome boy came. He is Balakrishna. Each hero has a different body language. Balayya has a different body language. The thigh-slapping dialogue suits Balayya. Every movie we wrote was success for Balayya. I am shocked that he has completed 50 years. I thought I was 50 years old. I want the world to know about Balayya's 50-year celebration by including all the associations."

Film Employees Federation President Anil Kumar said : "All the associations are happy to participate in the Balakrishna gari program which he has completed 50 years in our industry. We are lucky that our association is also participating.

Director Boyapati Srinivas said : "We get tired just walking for 50 minutes. He has been making films like this for 50 years. It is a very commendable thing that all the film giants came on a platform to recognize his hard work and honor him. I would like to thank everyone who is doing this program. Completing 50 years and 109 films in the industry without playing a repeating role is not a common thing. I want him to always be energetic and make good movies. Similarly, on the occasion of the completion of 50 years of actor Balakrishna's life on September 1, I wish everyone to come and make the program a big success.

ఘనంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల కర్టన్ రైజర్ కార్యక్రమం

కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగబోయే వేడుక వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఎఫ్‌ఎన్‌సీసీలో క్టరన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ ఇద్దరూ స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ..‘‘మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మానాన్న గారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారు.’’ అని చెప్పారు.

దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా కుర్రహీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే ఇన్ని ఏళ్లు నటుడిగా చేసిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. మేమిద్దరం ఒకసారి గోవా వెళ్లినప్పుడు ఒక ట్రే వాటర్ బాటిల్స్ కొని ఆయనే మోసుకొచ్చారు. అంత సింపుల్‌గా ఉంటారు. బాలయ్య నిర్మాతల మనిషి. నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి’’ అని అన్నారు.

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘‘రామారావు గారి నట వారసుడు నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం కలిసి టాలీవుడ్ పవర్ ఏంటో చూపించేలా గొప్పగా చేస్తాం’’ అని అన్నారు.

నిర్మాత కైకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ..‘‘ నందమూరి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలున్నాయి. మా సోదరుడు కైకాల సత్యనారాయణను రామారావుగారు సొంత తమ్ముడిలా చూసుకునేవారు. నిర్మాతలకు గౌరవం ఇవ్వడంలో అన్నగారి తర్వాత ఆయన వారసుడు బాలకృష్ణ కూడా ముందువరుసలో ఉంటారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందని బాలయ్య నమ్ముతారు. అలాంటి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.’’ అని అన్నారు.

సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..‘‘బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేసింది నేనే. 13 సినిమాలు ఆయనతో చేశానంటే ఆయన ఎంత మంచి వాడో అర్థమవుతుంది. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారు. 50 ఏళ్లు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రస్థానంలో నేను కూడా ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ మధ్య ఎక్కడికెళ్లినా జై బాలయ్య అని అంటున్నారు. యూత్ నాడి పట్టుకున్న నటుడు బాలకృష్ణ. రామారావుగారి వారసుడిగా సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.’’ అని చెప్పారు.

నటుడు మాదాలరవి మాట్లాడుతూ ‘‘నందమూరి బాలకృష్ణగారి 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా అసోసియేషన్‌లో గర్వించదగ్గ హీరో బాలకృష్ణ గారు. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేయడమే కాకుండా రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ కొట్టి సేవ చేస్తున్నారు. అలాగే క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా కూడా సేవ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన గొప్ప హీరో బాలకృష్ణ గారికి గోల్డెన్ జూబ్లీ చేయడం ఎంతో గొప్ప విషయం.’’ అని చెప్పారు.

మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ మాట్లాడుతూ..‘‘నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. బాలయ్య గారికి కంగ్రాట్స్. ఆ ఈవెంట్ కోసం వేచి చూస్తున్నాం. పెద్దలు ఏం చెప్తే అలా చేస్తాం. ఈవెంట్‌ను విజయవంతం చేయాలని కోరుతున్నా’’ అని అన్నారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలను ఒక ప్రతిష్టాత్మక వేడుకగా చేస్తున్నాం. సౌతిండియా నుంచి ఎంతోమందిని ఆహ్వానిస్తున్నాం. ఈ వేడుకను గొప్పగా గుర్తుండిపోయేలా చేస్తాం’’ అని చెప్పారు.

ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ మాట్లాడుతూ..‘‘సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మీ అందరి సహకారం కావాలని కోరుతున్నా’’ అని చెప్పారు.

సీనియర్ నిర్మాత సీ కల్యాణ్ మాట్లాడుతూ..‘‘మా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతోందంటే నాకు భయంగా ఉంది. ఆయన సినిమాలు, ఆయన కలెక్షన్స్ అన్నీ రికార్డులకెక్కాయి. ఈ ఫంక్షన్ ఆ రికార్డులన్నింటినీ దాటి ఇంకా గొప్పగా జరగాలనేది నా తాపత్రయం. తప్పకుండా గొప్పగా చేస్తాం. ఇంతకు ముందు ఏ ఫంక్షన్ ఎలా జరిగినా.. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. బాలయ్య గారి మీద అందరికీ ప్రేమ ఉంది. అందరూ తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తున్నా. దేశవ్యాప్తంగా అన్ని భాషల నటులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గొప్ప ఈవెంట్‌గా బాలయ్య గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం జరుగుతుంది.’’ అని తెలిపారు.

దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘1974 మేలో గుడివాడలో తాతమ్మ కల సినిమా చూశా. అక్కడి నుంచి 50 ఏళ్లు మా కళ్ల ముందు గిర్రున తిరిగి ఇంత దూరం వచ్చేశామా అనేది ఒక కలలా అనిపిస్తోంది. అప్పుడు నేనొక లారీ డ్రైవర్ కొడుకుని. రామారావుగారి అభిమానిని. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఇలా మీ ముందు మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. నందమూరి బాలకృష్ణ గారికి తల్లిదండ్రులతో పాటు గురువు కూడా ఇంట్లోనే ఉన్నారు. అది ఆయన అదృష్టం. ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆయన 50 ఏళ్ల వేడుక అందరికీ స్ఫూర్తిదాయంకంగా ఉండేలా జరగాలని కోరుకుంటున్నా.’’ అని అన్నారు.

తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..‘‘హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ హ్యాట్రిక్ హీరోగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి సేవలందరిస్తూ ఉన్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. భవిష్యత్తులో ఎవరూ సాధించలేని రికార్డును సృష్టించిన హీరో బాలకృష్ణ. నాలుగు తరాలపాటు రాముడిగా, కృష్ణుడిగా చేసింది ఒక్క నందమూరి కుటుంబమే. సేవారంగంలో బాలకృష్ణగారు ఎన్నో గుప్తదానాలు చేశారు. మదనపల్లెలోని ఒక టీచర్ కుమార్తెకు తన సొంతడబ్బుతో చికిత్స చేయించారు. రాయలసీమలో వరదలు వచ్చినప్పుడు స్పందన కార్యక్రమం చేపట్టారు. ఎన్టీయార్ జోలెపట్టుకుని ఎలా వెళ్లారో.. అలా వారసుడిగా బాలయ్య కూడా చేశారు. అలాంటి బాలయ్య 50 ఏళ్ల వేడుకకు అందరూ హాజరు కావాలి. ఈ వేడుకకు బాలయ్య ముందు ఒప్పుకోలేదు. కానీ ఇదొక స్ఫూర్తిదాయ కార్య్రక్రమంగా ఉంటుందని చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనేలా చేస్తాం’’ అని చెప్పారు.

రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..‘‘నేను రామారావుగారి అభిమానిని. నేను అభిమానించిన రామారావుగారికి సినిమా రాయడం అనేది మాకు దొరికిన అదృష్టం. 1981లో నేను ఛండశాసనుడు సినిమాకు రాశాను. ఆ టైమ్‌లో ఒక అందమైన కుర్రాడు వచ్చాడు. అతనే బాలకృష్ణ. ఒకొక హీరోకు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అలా బాలయ్యకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంది. తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది. మేము రాసిన ప్రతి సినిమా బాలయ్యకు సక్సెస్ అయింది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడంటే నేను షాకయ్యా. 50 ఏళ్ల వయసు వచ్చిందేమో అనుకున్నా. అన్ని అసోసియేషన్స్ కలుపుకుని బాలయ్య 50 ఏళ్ల వేడకను ప్రపంచానికి తెలిసేలా చేయాలని కోరుతున్నా.’’ అని చెప్పారు.

ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ..‘‘మన ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణగారి కార్యక్రమంలో అన్ని అసోసియేషన్స్ వాళ్లు పాల్గొనడం సంతోషంగా ఉంది. మా అసోసియేషన్ కూడా పాల్గొనడం మా అదృష్టం’’ అని చెప్పారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘‘50 నిమిషాల పాటు వాక్ చేస్తేనే మనం అలసిపోతాం. అలాంటిది ఆయన 50 ఏళ్లు సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఆయన కష్టాన్ని గుర్తించి సినిమా పెద్దలందరూ ఒక వేదిక మీదకు వచ్చి ఆయనకు సన్మానం చేయడం చాలా అభినందనీయమైన విషయం. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చేసిన పాత్ర చేయకుండా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు 109 సినిమాలు పూర్తి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఎప్పుడూ ఇలా ఎనర్జిటిక్ గా ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సెప్టెంబర్ 1న ఘనంగా బాలకృష్ణ గారి నట జీవితానికి నిర్వహించే 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

Facebook Comments
A grand curtain raiser program of Nandamuri Balakrishna Golden Jubilee celebrations

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.