"Thangalan" will surprise you all in theaters - Hero Chiyaan Vikram
"Thangalaan" is a period action film starring Chiyaan Vikram as the lead. Directed by Pa Ranjith, the film is produced by prominent producer KE Gnanavel Raja under the Studio Green Films banner, in association with Neelam Productions. Parvathy Thiruvothu and Malavika Mohanan play the female leads. Set against the backdrop of the Kolar Gold Fields, "Thangalaan" is based on real events and is set for a grand worldwide theatrical release on the 15th of this month, coinciding with Independence Day. Mythri Movie Distribution will handle the Telugu release.
At the film’s press meet held today, Hero Vikram spoke:
“Pa Ranjith is my favorite director. I admire every film he has made and always wanted to work with him. I was thrilled when he presented the story of 'Thangalaan' to me. This story is relatable to everyone, not just in Telugu, Tamil, or Kannada, but globally. While the film highlights gold hunting, it also features a struggle for freedom. It transcends categorization. Life sometimes presents inconsistencies, and director Pa Ranjith expresses these through cinema. Just as we become immersed in the story of 'Sarpatta Parambharai,' this film will captivate you as well. There are no elements in the movie that would cause discomfort. Pa Ranjith has ensured that.
'Thangalaan' is named after a tribe. My initial expectations for the character’s look were high, wondering if it would resemble KGF. However, the tribal leader's appearance is raw and rustic. The film incorporates all essential elements. Preparing for my role involved several hours for makeup application and removal. We shot in both cold and heat, but when you are passionate about your work, hunger and sleep become secondary. I focus on whether I fit the role, rather than on awards. While I value awards, the appreciation from the audience brings greater joy.
I researched various tribes, including African ones, to better understand their appearance and contribute to the film’s authenticity. We managed to capture scenes in a single shot, even if it took 30 takes to get it right. Despite the absence of subtitles, our film reaches audiences across all languages in India. I believe 'Thangalaan' will be a surprising experience in theaters.
I also admire Power Star Pawan Kalyan’s work. His decade of dedication to politics and his current position as Deputy CM is an impressive achievement. It offers hope to those of us who consider entering politics.”
Hollywood actor Daniel said: “Pa Ranjith approached me for the film 'Thangalaan,' and we had several discussions. I was impressed by his previous films and agreed to be part of this project without even reading the script. Pa Ranjith has a clear vision and his ideas are innovative. My character has some complex traits, and I’m thrilled to act alongside Vikram, who is like a brother to me. The energy and scope of Indian cinema have grown significantly. Indian cinema is on the verge of surpassing Hollywood. If we create stories that resonate globally, Indian cinema will exceed Hollywood in influence.”
Heroine Malavika Mohanan said: “I always aim to work on projects where I can showcase my acting skills. I’m grateful for the opportunity to do so in 'Thangalaan.' I played the role of Aarti, a character that will surprise audiences. Working with Vikram was an incredible experience. Without his support, I wouldn't have been able to portray Aarti so effectively. 'Thangalaan' is one of the most challenging films in the Indian film industry. There were moments when we questioned if we could handle the roles properly. It was a shared concern among us all. If it weren’t for Chiyaan Vikram, I wouldn't have been able to perform as well. The Telugu film industry is vast, and I’ve been eager to make a significant entry into Tollywood. I feel fortunate to have this opportunity with Raja Saab. Working with Prabhas was a pleasure; he sent me the best food in Hyderabad, which was as delicious as my mother’s cooking. Maruti excels in designing female characters, and my role in 'Thangalaan' is quite different from my role in 'The Raja Saab.'”
Heroine Parvathy Thiruvothu said: “We all played our respective roles in 'Thangalaan,' and as actors, we have completed our part. Now, we await the audience’s response. Director Pa Ranjith has created a unique world in this film, one that everyone can relate to. We are eager to see how well the audience accepts our performances.”
"తంగలాన్" సినిమా థియేటర్స్ లో మీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది - హీరో చియాన్ విక్రమ్
చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. "తంగలాన్" సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. ఈ రోజు "తంగలాన్" చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
హీరో విక్రమ్ మాట్లాడుతూ - పా రంజిత్ నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన తీసిన ప్రతి సినిమా నాకు ఇష్టం. పా రంజిత్ తో మూవీ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. ఆయన "తంగలాన్" కథ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇది తెలుగు, తమిళ, కన్నడ అని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ. బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా..ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. ఇది ఒక వర్గానికి ఆపాదించలేం. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు అసమానతలకు గురవుతూ ఉంటాం. అలాంటి వారి కోసం దర్శకుడు పా రంజిత్ సినిమా అనే మాధ్యమం ద్వారా తన అభిప్రాయాలు చెబుతున్నారు. సార్పట్ట సినిమా చూసినప్పుడు ఆ కథలోకి లీనమవుతాం గానీ మిగతా విషయాలు పట్టించుకోం. అలాగే ఈ సినిమా కథ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టే పేర్లు, మాటలు ఈ సినిమాలో ఉండవు. ఆ జాగ్రత్తలు దర్శకుడు పా రంజిత్ తీసుకున్నారు. "తంగలాన్" అనేది ఒక తెగ పేరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్స్ చూసినప్పుడు ఒక్కోసారి ఒక్కో అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ టైమ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇది కేజీఎఫ్ లా ఉంటుందా అన్నారు. మరోసారి తెగ నాయకుడి గెటప్ రిలీజ్ చేసినప్పుడు ఇది రా అండ్ రస్టిక్ గా ఉంటుందని అన్నారు. కానీ "తంగలాన్" లో అన్ని అంశాలు ఉన్నాయి. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొన్ని గంటల పాటు మేకోవర్ కు పట్టేది. మళ్లీ మేకప్ తొలగించుకునేందుకు కనీసం రెండు గంటలు అయ్యేది. చలిలో, వేడిలో అలాగే షూటింగ్ చేశాం. మనకు ఇష్టమైన పని దొరికినప్పుడు ఆకలి, నిద్ర మర్చిపోతుంటాం. అలా నేను నా సినిమాల్లో నటిస్తున్నప్పుడు మిగతా విషయాలేవీ పట్టించుకోను. ఆ పాత్రకు తగినట్లు మారానా లేదా అనేదే ఆలోచిస్తాను. అవార్డులు నాకు ఇష్టమే. కానీ మీ నుంచి వచ్చే ప్రశంసలు మరింత సంతోషాన్ని ఇస్తాయి. ఆఫ్రికన్ ట్రైబ్స్ సహా ప్రపంచంలోని కొన్ని తెగలు ఎలా ఉంటాయో నేను తెలుసుకున్నాను. అవి ఈ మూవీ చేయడంలో హెల్ప్ అయ్యాయి. నాతో పాటు ఆర్టిస్టులంతా సింగిల్ షాట్ లో సీన్స్ చేశాం. ఆ సీన్ లో 30 టేక్స్ ఉన్నా..సింగిల్ షాట్ లోనే చేసేవాళ్లం. ఇవాళ సినిమాకు భాషాంతరాలు లేవు. పాన్ ఇండియా అని మనమే అంటున్నాం. నేను ఎక్కడ నటించినా అది అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. థియేటర్ లో మిమ్మల్ని ఈ సినిమా సర్ ప్రైజ్ చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వర్క్ అంటే నాకు ఇష్టం. ఆయన పదేళ్లు రాజకీయాల్లో కష్టపడి ఇప్పుడు డిఫ్యూటీ సీఎం అయ్యారు. అది సాధారణ అఛీవ్ మెంట్ కాదు. మాలాంటి వాళ్లకు పాలిటిక్స్ లోకి రావాలనుకుంటే ఆయన ఒక హోప్ ఇచ్చినట్లు అయ్యింది. అన్నారు.
హాలీవుడ్ నటుడు డేనియల్ మాట్లాడుతూ - "తంగలాన్" సినిమా కోసం పా రంజిత్ నన్ను అప్రోచ్ అయ్యారు. మేము చాలా సార్లు మాట్లాడుకున్నాం. నేను ఆయన సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా చదవకుండా నటించేందుకు ఒప్పుకున్నాను. పా రంజిత్ విజన్ ఎలా ఉంటుందో తెలుసు. ఆయన ఆలోచనలు కొత్తగా ఉంటాయి. నా క్యారెక్టర్ కొంత క్లే షేడ్స్ తో ఉంటుంది. విక్రమ్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను నా బ్రదర్ లాంటి వారు. ఇండియన్ సినిమా ఎనర్జీ, స్పాన్ చాలా పెరిగింది. హాలీవుడ్ ను ఇండియన్ సినిమా దాటేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. అంతర్జాతీయంగా అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీస్ చేస్తే ఇండియన్ సినిమా హాలీవుడ్ ను దాటేస్తుంది. అన్నారు.
హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుూ - నేనెప్పుడూ నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకునే కథల్లో, క్యారెక్టర్స్ లో నటించాలని కోరుకుంటాను. "తంగలాన్" సినిమాతో అలాంటి అవకాశం దక్కడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో ఆరతి అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ క్యారెక్టర్ మిమ్మల్ని సర్ ప్రైజ్ చేస్తుంది. విక్రమ్ గారితో కలిసి నటించడం గొప్ప ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. విక్రమ్ గారు లేకుంటే నేను ఈ సినిమాలో ఆరతి క్యారెక్టర్ ను ఇంత బాగా పర్ ఫార్మ్ చేసేదాన్ని కాదేమో. ఎందుకంటే తంగలాన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాణమైన ఒక టఫెస్ట్ ఫిల్మ్ అని చెప్పాలి. ఈ సినిమాలో నటించేప్పుడు మేము ఈ పాత్రలు సరిగ్గా చేయగలమా లేదా ఈ సినిమాలో నటించడం చాలా కష్టంగా ఉంది అని చాలాసార్లు అనుకున్నాం. నాకే కాదు మా అందరిలోనూ అదే ఫీలింగ్ ఉండేది. చియాన్ విక్రమ్ లాంటి కోస్టార్ లేకుంటే నేను ఇంత బాగా నటించలేకపోయేదాన్ని. తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది. ఒక బ్యాంగ్ లాంటి సినిమాతో టాలీవుడ్ కు రావాలని వెయిట్ చేస్తూ వచ్చాను. రాజా సాబ్ సినిమాతో నాకు అలాంటి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన హైదరాబాద్ లోని బెస్ట్ పుడ్ నాకు పంపారు. మా మదర్ చేసిన ఫుడ్ అంత టేస్ట్ గా ఆ ఫుడ్ ఉంది. మారుతి గారు ఫీమేల్ క్యారెక్టర్స్ బాగా డిజైన్ చేస్తారు. తంగలాన్ లో నా క్యారెక్టర్ కు రాజా సాబ్ లో నా క్యారెక్టర్ తో చూస్తే పూర్తి భిన్నంగా ఉంటుంది. అన్నారు.
హీరోయిన్ పార్వతీ తిరువోతు మాట్లాడుతూ - "తంగలాన్" సినిమాలో మేమంతా మా క్యారెక్టర్స్ చేశాం. నటీనటులుగా మా పని ఫినిష్ చేశాం. ఇక ఇప్పుడు ప్రేక్షకుల తీర్పు కోసం వేచి చూస్తున్నాం. ఈ సినిమాలో మా డైరెక్టర్ పా రంజిత్ ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు. అందరికీ రిలేట్ అయ్యేలా మూవీ ఉంటుంది. ఆడియెన్స్ మమ్మల్ని ఈ మూవీతో ఎంతగా ఆదరిస్తారని చూడాలనుకుంటున్నాం. అన్నారు.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.