Studio Green Films, Director Pa Ranjith, and Hero Chiyaan Vikram’s “Thangalaan” pre-release event held grandly; releasing worldwide on August 15th

Studio Green Films, Director Pa Ranjith, and Hero Chiyaan Vikram's "Thangalaan" pre-release event held grandly; releasing worldwide on August 15th

The pre-release event for "Thangalaan," a period action film starring Chiyaan Vikram, was held today. Directed by Pa Ranjith and produced by KE Gnanavel Raja under the Studio Green Films banner in association with Neelam Productions, "Thangalaan" is set for a worldwide theatrical release on August 15, in conjunction with Independence Day. Mythri Movie Distribution will handle the film’s release in Telugu.

Dialogue writer Rakendu Mouli commented, "I am a big fan of Vikram sir. My father, Vennelakanti, worked with him, and my brother, Shashank Vennelakanti, worked on Vikram's film 'Nanna.' I am thrilled to write dialogues for this movie. Vikram's dedication is extraordinary, and 'Thangalaan' showcases his commitment as an actor. Malavika Mohanan’s role will significantly enhance her image. This film should be enjoyed in theaters as it offers a unique cinematic experience. I hope everyone will watch it on August 15."

Hollywood actor Daniel said, "Without my brother Vikram, director Pa Ranjith, Malavika, and Parvathy, 'Thangalaan' wouldn’t have been possible. I am grateful to producer Gnanavel Raja for including me in this film. 'Thangalaan' is an incredible movie that provides an amazing experience. Be sure to watch it in theaters."

Heroine Malavika Mohanan expressed her gratitude, "I want to thank director Pa Ranjith for believing that I could portray the character of Aarti in 'Thangalaan.' I am thrilled to be part of this remarkable film. Thanks to Vikram, Gnanavel Raja, Parvathy, and Daniel. Watch 'Thangalan' in theaters on August 15 and enjoy the film."

Producer SKN noted, "Vikram’s previous hit movie, 'Aparichitudu,' was familiar to many, and 'Thangalaan' seems to be on a different level after watching the 15-minute footage Gnanavel Raja showed us. It promises a unique experience for the audience. Vikram is beloved by audiences in both Telugu states, and Pa Ranjith has a strong fan base here. I am confident that 'Thangalan' will be a blockbuster and provide a great experience for all."

Director Karuna Kumar stated, "While many films feature playful songs, director Pa Ranjith creates movies that highlight our history and cultural symbols. I am a big fan of his work. Vikram’s performance in 'Thangalan' is outstanding, and the film deserves an Oscar. Producer Gnanavel Raja is making significant efforts to achieve this. I encourage everyone to watch 'Thangalan' in theaters on August 15."

Director Sai Rajesh said, "Producer Gnanavel showed some footage from 'Thangalaan,' and it was truly amazing. This footage highlights how unique this film is. The effort put in by the entire team is impressive. This film transports the audience to another world. I wish director Pa Ranjith, Vikram, Gnanavel, and the entire team great success with 'Thangalan.'"

Shashi from Mythri Movie Distribution commented, "Vikram excels in every role he takes on, and his performance in 'Thangalaan' is exceptional. Thanks to Gnanavel for giving us the opportunity to distribute this film. We hope to gain a good reputation with 'Thangalaan.' Along with 'Thangalaan,' we are also releasing 'Mr. Bachchan.' I wish all the films released on August 15—'Thangalaan,' 'Mr. Bachchan,' 'AAY,' and 'Double ismart'—great success."

Producer Dhanunjayan said, "The teaser and trailer of 'Thangalaan' are just a glimpse of what the film has to offer. The movie contains captivating content, and Chiyaan Vikram’s performance is truly impressive. His dedication is evident, and 'Thangalan' will be a memorable film for both the team and the audience. I hope you enjoy watching it in theaters."

Producer Damodara Prasad remarked, "'Thangalaan' is a rare cinematic endeavor. Vikram is one of our country’s most versatile actors. While we now talk about Pan India, Vikram has always had a Pan India appeal. I hope 'Thangalaan' becomes a big hit and that this team gains well-deserved recognition."

Heroine Payal Rajput shared, "I am thrilled to be invited to the 'Thangalaan' event. I had seen Vikram at a Filmfare function but didn’t get a chance to speak with him. It’s exciting to speak in front of him now. I am a big fan of Vikram and hope 'Thangalaan' breaks all box office records."

Director-Producer Madhura Sreedhar Reddy stated, "We have eagerly awaited 'Thangalaan.' It resonates with the essence of our roots, similar to films like 'Baahubali,' 'Pushpa,' and 'Balagam.' 'Thangalaan' is a film of gold. Director Pa Ranjith has created a world-class cinema with this film. Both Vikram and Pa Ranjith have large fan bases in Telugu. Creating a film like 'Thangalaan' requires immense courage, and my friend Gnanavel Raja possesses that courage and passion. I hope this film brings him great success and boosts his confidence to continue making such films. Best wishes to the entire 'Thangalan' team."

Heroine Parvathy Thiruvothu said, "I am delighted to have acted with Vikram in 'Thangalaan.' He was very supportive, and the entire film team received his full cooperation. I play the character of Gangamma, who will always be special to me. Thanks to director Pa Ranjith for giving me such a wonderful role. 'Thangalaan' will take you to a new world, so be sure to watch it in theaters."

Producer Gnanavel Raja expressed his gratitude, "Thanks to Damodara Prasad, SKN, Sai Rajesh, Payal Rajput, and everyone who attended the 'Thangalaan' event. The Telugu audience has a great love for cinema, which is my passion. I appreciate Vikram, Parvathy, Malavika, Pa Ranjith, Daniel, and the entire team for their hard work on 'Thangalaan.' The trailer and other content reflect our efforts. I hope you will support our film in theaters. Alongside 'Thangalaan,' I wish success to Ravi Teja's 'Mr. Bachchan,' Ram Gari's 'Double ISmart,' and Bunny’s 'AAY.' Congratulations to SKN and Sai Rajesh for winning five Filmfare Awards for 'Baby.'"

Director Pa Ranjith said, "I am grateful to everyone who supports my ideas and perspectives expressed through cinema. It is rare to receive such favor. Oppression and inequality still persist in our country, lingering in our society for many years. I chose film as a medium to address these issues. I am pleased to be in Hyderabad for the 'Thangalaan' event, as the Telugu audience has always embraced my films. I hope you will appreciate this movie as well. 'Thangalaan' is not an ordinary film. We are depicting a historical event that occurred before independence. This story is not just about a quest for gold but a struggle for freedom and rights. These struggles continue in society today. Through cinema, I have expressed my views. Vikram has deeply understood the story, the character, and the emotions of 'Thangalaan.' We are fortunate to have an actor like Vikram. Gnanavel Raja supported this film with great faith and commitment. He was impressed by 'Thangalaan,' and we are confident it will be a success. We are witnessing a trend where good movies are gaining popularity nationwide, and we hope 'Thangalan' will be well-received as well."

Hero Chiyaan Vikram said, "The energy and enthusiasm you are showing are like gold. Telugu cinephiles are very special, and we need your continuous support and encouragement. I hope you enjoyed the teaser and trailer of 'Thangalaan.' I am grateful to all the guests who attended our event. Your kind words about me and our film brought me immense joy. I portrayed Aditya Karikalan in 'Ponniyin Selvan,' a story set a thousand years ago, and received your love. 'Thangalaan' is set a hundred years ago and is a beautiful adventure film. Director Ranjith has created it with remarkable artistry. 'Thangalaan' is a fantastic movie, and I am eager for you all to watch it. Seeing the performances from my previous films on stage made me emotional and inspired me to take on different roles. Ranjith is my dream director, and I was thrilled when he told me about 'Thangalaan.' We have kept many aspects of the movie under wraps to surprise you. This film contains adventure, a message, magic, and emotions. I believe this is the best role I have had. Gnanavel Raja provided us with complete freedom in producing the film. I am thankful to him for aiming to take it to a global stage, not just Pan India. Everyone on our team contributed passionately to this film. I am confident you will connect with the content when you watch it in theaters. Parvathy and Malavika delivered excellent performances. Thank you for your response to 'Thangalan.' See you in theaters on August 15.

ఘనంగా స్టూడియో గ్రీన్ ఫిలింస్, డైరెక్టర్ పా రంజిత్, హీరో చియాన్ విక్రమ్ "తంగలాన్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ నెల 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ "తంగలాన్". ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్ తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. "తంగలాన్" సినిమాలో పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. "తంగలాన్" సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డైలాగ్ రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ - నేను విక్రమ్ గారికి పెద్ద అభిమానిని. ఆయనతో మా నాన్న వెన్నెలకంటి గారు వర్క్ చేశారు. మా బ్రదర్ శశాంక్ వెన్నెలకంటి విక్రమ్ గారి నాన్న సినిమాకు వర్క్ చేశారు. నేను ఈ సినిమాకు డైలాగ్స్ రాయడం సంతోషంగా ఉంది. విక్రమ్ గారి డెడికేషన్ అద్భుతం. "తంగలాన్" సినిమా నటుడిగా ఆయన అంకితభావాన్ని మరోసారి ప్రూవ్ చేస్తుంది. ఈ సినిమాతో హీరోయిన్ మాళవిక మోహనన్ ఇమేజ్ పూర్తిగా మారిపోతుంది. "తంగలాన్" సినిమాను థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి. మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే చిత్రమిది. తప్పకుండా థియేటర్ లో ఆగస్టు 15న చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

హాలీవుడ్ నటుడు డేనియల్ మాట్లాడుతూ - మా బ్రదర్ విక్రమ్, డైరెక్టర్ పా రంజిత్, మాళవిక, పార్వతీ వీళ్లంతా లేకుంటే "తంగలాన్" సినిమా జరిగేది కాదు. నన్ను ఈ మూవీలోకి తీసుకొచ్చిన నిర్మాత జ్ఞానవేల్ రాజాకు థ్యాంక్స్. "తంగలాన్" ఒక అమోజింగ్ మూవీ. అమోజింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. థియేటర్ లో తప్పుకుండా చూడండి. అన్నారు.

హీరోయిన్ మాళవిక మోహనన్ మాట్లాడుతూ - "తంగలాన్" సినిమాలో ఆరతి అనే క్యారెక్టర్ నేను చేయగలను అని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడు పా రంజిత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఇలాంటి ఒక గొప్ప మూవీలో నటించడం సంతోషంగా ఉంది. నా టీమ్ అందరికీ విక్రమ్, జ్ఞానవేల్ రాజా, పార్వతీ, డేనియల్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఈ నెల 15న "తంగలాన్" సినిమా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - విక్రమ్ గారి సూపర్ హిట్ సినిమా అపరిచితుడు, కానీ ఆయన మనందరికీ సుపరిచితుడే. జ్ఞానవేల్ రాజా గారు కొద్ది రోజుల క్రితం తంగలాన్ 15 నిమిషాల ఫుటేజ్ చూపించారు. అది చూశాక ఈ సినిమా వేరే లెవల్ అనిపించింది. ప్రేక్షకుల్ని ఒక కొత్త అనుభూతికి లోనుచేస్తుంది. విక్రమ్ గారిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు అభిమానిస్తారు. పా.రంజిత్ గారికి తెలుగులో అభిమానులు ఉన్నారు. వాళ్లంతా ఉదయం ఆటనే చూసేందుకు థియేటర్స్ కు వస్తారు. ఆయన మార్క్ తంగలాన్ లో మరోసారి కనిపిస్తోంది. జ్ఞానవేల్ రాజా గారు తన సినిమాలను సగర్వంగా సమర్పిస్తారు. ఆయన మరెన్నో తెలుగు మూవీస్ చేయాలని కోరుకుంటున్నా. రాజా సాబ్ హీరోయిన్ మాళవిక ఈ సినిమా కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. తంగలాన్ సినిమా ఈ టీమ్ అందరికీ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. అన్నారు.

డైరెక్టర్ కరుణ కుమార్ మాట్లాడుతూ - ఆట పాటలతో కూడిన సినిమాలు చూస్తుంటాం కానీ మన చరిత్రను చూపిస్తూ, మన గుర్తులకు తెరరూపమిచ్చే సినిమాలు రూపొందిస్తుంటారు దర్శకుడు పా రంజిత్ గారు. ఆయన సినిమాలను బాగా అభిమానిస్తాను. విక్రమ్ గారు గ్రేట్ యాక్టర్. తంగలాన్ లో విక్రమ్ గారి పర్ ఫార్మెన్స్ అద్భుతం. తంగలాన్ సినిమా ఆస్కార్ కు వెళ్లాలి. ఆ ప్రయత్నం ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారు చేయాలని కోరుకుంటున్నా. ఈ నెల 15న థియేటర్స్ లో తంగలాన్ మూవీ ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ - తంగలాన్ సినిమా కొంత ఫుటేజ్ చూపించారు నిర్మాత జ్ఞానవేల్ గారు. ఆ ఫుటేజ్ చూశాక అద్భుతం అనిపించింది. ఇదెంత అరుదైన చిత్రమో ఆ ఫుటేజ్ తో తెలిసింది. నిజంగా ఈ టీమ్ అంతా గొప్ప ప్రయత్నం చేశారు. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. దర్శకుడు పా రంజిత్ గారికి, విక్రమ్ గారికి, జ్ఞానవేల్ గారికి ఇతర టీమ్ అందరికీ తంగలాన్ పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ నుంచి శశి మాట్లాడుతూ - విక్రమ్ గారు ఏ క్యారెక్టర్ చేసినా చాలా బాగుంటుంది. ఆయన తంగలాన్ లో గొప్పగా నటించారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన జ్ఞానవేల్ గారికి థ్యాంక్స్. తంగలాన్ సినిమాతో మాకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. మిస్టర్ బచ్చన్ కూడా మేమే రిలీజ్ చేస్తున్నాం. ఆగస్టు 15న రిలీజ్ అయ్యే తంగలాన్, మిస్టర్ బచ్చన్, ఆయ్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలన్నీ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ - తంగలాన్ సినిమా నుంచి మీరు ఇప్పటిదాకా చూసిన టీజర్, ట్రైలర్ కొంత మాత్రమే. సినిమాలో చాలా మెస్మరైజింగ్ కంటెంట్ ఉంది. ఛియాన్ విక్రమ్ గారి అద్భుతమైన పర్ ఫార్మెన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఆయన ఈ క్యారెక్టర్ లో ఎలా నటించారని మీరు ఆశ్చర్యపోతారు. అంత డెడికేషన్ తో విక్రమ్ గారు నటించారు. తంగలాన్ సినిమాను మా టీమ్ తో పాటు ప్రేక్షకులకు మెమొరబుల్ మూవీ అవుతుంది. తప్పకుండా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

నిర్మాత దామోదర ప్రసాద్ మాట్లాడుతూ - తంగలాన్ సినిమా ఒక అరుదైన ప్రయత్నం అని చెప్పాలి. విక్రమ్ గారు మన దేశంలో ఉన్న వర్సటైల్ నటుల్లో ఒకరు. మనం ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం గానీ విక్రమ్ గారు ఎప్పటినుంచో పాన్ ఇండియా మూవీస్ తో ఆదరణ దక్కించుకున్నారు. తంగలాన్ కూడా పెద్ద హిట్ కావాలి. ఈ టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ - తంగలాన్ సినిమా ఈవెంట్ కు నన్ను ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మాటలు రావడం లేదు. విక్రమ్ గారిని ఫిలింఫేర్ ఫంక్షన్ లో చూశాను. ఆయనతో మాట్లాడలేకపోయా. ఇప్పుడు ఆయన ఎదురుగా మాట్లాడటం థ్రిల్లింగ్ గా ఉంది. విక్రమ్ గారికి నేనో పెద్ద అభిమానిని. తంగలాన్ అన్ని బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - తంగలాన్ సినిమా కోసం మనం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం. మనం మన మూలాలున్న చిత్రాలని ఆదరిస్తారం. బాహుబలి, పుష్ప, బలగం ..ఇవన్నీ మన నేటివ్ సినిమాలు. తంగలాన్ కూడా అలాంటిదే. ఇదొక బంగారం లాంటి సినిమా. ఈ చిత్రంతో దర్శకుడు పా రంజిత్ ఒక వరల్డ్ సినిమాను రూపొందించారు. ఆయనకు తెలుగులో అభిమానులు ఉన్నారు. విక్రమ్ గారికి తెలుగులో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తంగలాన్ లాంటి సినిమా నిర్మించాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యం, సినిమా మీద ప్యాషన్ నా స్నేహితుడు జ్ఞానవేల్ రాజాకు ఉన్నాయి. ఈ సినిమా జ్ఞానవేల్ రాజాకు పెద్ద సక్సెస్ ఇచ్చి ఇలాంటి సినిమాలు చేసే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. తంగలాన్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

హీరోయిన్ పార్వతీ తిరువోతు మాట్లాడుతూ - తంగలాన్ సినిమాలో విక్రమ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. నాకే కాదు సినిమా టీమ్ అందరికీ విక్రమ్ గారి పూర్తి సహకారం దొరికింది. ఈ సినిమాలో గంగమ్మ క్యారెక్టర్ లో మీ ముందుకు రాబోతున్నా. గంగమ్మ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఇలాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ పా రంజిత్ గారికి థ్యాంక్స్. తంగలాన్ మీ అందరినీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. తప్పకుండా ఈ సినిమా థియేటర్ లో చూడండి. అన్నారు.

నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ - మా తంగలాన్ ఈవెంట్ కు అతిథులుగా వచ్చిన దామోదరప్రసాద్, ఎస్ కేఎన్, సాయి రాజేశ్, పాయల్ రాజ్ పుత్ , మిగతా అందరికీ థ్యాంక్స్. తెలుగు ప్రేక్షకులు సినిమాలను బాగా అభిమానిస్తారు. నాకూ సినిమాలంటే ప్యాషన్. తంగలాన్ సినిమాకు వర్క్ చేసిన విక్రమ్ , పార్వతీ, మాళవిక, పా రంజిత్, డానియేల్, ఇతర టీమ్ అందరికీ థ్యాంక్స్. తంగలాన్ సినిమా ట్రైలర్, మిగతా కంటెంట్ చూస్తే మేమంతా సినిమా కోసం ఎంత కష్టపడ్డామో తెలుస్తుంది. థియేటర్స్ లో మా సినిమాకు మీరంతా పెద్ద సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నా. మా సినిమాతో పాటు అన్నయ్య రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ గారి డబుల్ ఇస్మార్ట్, బన్నీ వాస్ ఆయ్ సినిమాలు కూడా పెద్ద హిట్ కావాలి. బేబి సినిమాకు ఐదు ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చినందుకు ఎస్ కేఎన్, సాయి రాజేశ్ గారికి కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

దర్శకుడు పా రంజిత్ మాట్లాడుతూ - సినిమా మాధ్యమం ద్వారా నేను చూపించే నా ఆలోచనలను, దృక్పథాలను ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్. ఇలా మీ ఆదరణ పొందడం సాధారణ విషయం కాదు. మన దేశంలో అణిచివేత, అసమానత్వం ఇంకా ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా మన సమాజంలో ఉండిపోయాయి. వీటిని ఎదుర్కొనేందుకు నేను సినిమా మాధ్యమాన్ని ఎంచుకున్నాను. తంగలాన్ ఈవెంట్ కోసం హైదరాబాద్ రావడం సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నా సినిమాలను ఎంతో ఆదరించారు. ఈ సినిమా కూడా ఇష్టపడతారని కోరుకుంటున్నా. తంగలాన్ ఆర్డినరీ మూవీ కాదు. ఇండిపెండెన్స్ కు ముందు జరిగిన ఒక చారిత్రక ఘటనకు తెరరూపమిస్తున్నాం. ఈ కథ బంగారం కోసం జరిగే వేట కాదు స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం జరిగే పోరాటం. ఇప్పటికీ సమాజంలో ఇలాంటి పోరాటాలు జరుగుతున్నాయి. మన హక్కుల కోసం ఇప్పటికీ గళమెత్తుతూనే ఉన్నాం. నేను సినిమా అనే ఆర్ట్ ఫామ్ ద్వారా నా అభిప్రాయాలు తెలియజేశాను. విక్రమ్ గారు తంగలాన్ కథను, ఆ పాత్రను, అందులోని భావోద్వేగాలను అర్థం చేసుకుని నటించారు. విక్రమ్ లాంటి నటుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. నా మీద నమ్మకంతో ఈ సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారు జ్ఞానవేల్ రాజా గారు. నాకు ఎంతో సపోర్ట్ చేశారు. జ్ఞానవేల్ గారు తంగలాన్ చూసి అప్రిషియేట్ చేశారు. మాకు బిగ్ సక్సెస్ వస్తుందనే నమ్మకం ఉంది. మంచి సినిమాలకు దేశవ్యాప్తంగా ఆదరణ దక్కుతున్న ట్రెండ్ లో ఉన్నాం. తంగలాన్ కూడా అలాగే ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

హీరో చియాన్ విక్రమ్ మాట్లాడుతూ - మీరు చూపిస్తున్న ఎనర్జీ, క్రేజ్ బంగారంలా అనిపిస్తోంది. తెలుగు సినీప్రియులు ఎంతో ప్రత్యేకం. మాకు మీ సపోర్ట్, ఎంకరేజ్ మెంట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. తంగలాన్ టీజర్, ట్రైలర్ మీకు బాగా నచ్చాయని ఆశిస్తున్నా. మా ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ అందరికీ థ్యాంక్స్. మీరు నా గురించి, మా తంగలాన్ సినిమా చెప్పిన ప్రోత్సాహాన్నిచ్చే మాటలు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. వెయ్యేళ్ల క్రితం జరిగిన కథతో తీసిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఆదిత్య కరికాలన్ గా నటించా. నాకు మీ లవ్ అందించారు. తంగలాన్ వందేళ్ల క్రితం జరిగిన కథ. ఇదొక బ్యూటిఫుల్ అడ్వెంచరస్ మూవీ. డైరెక్టర్ రంజిత్ తన ఆర్ట్ ఫామ్ లో అందంగా రూపొందించాడు. తంగలాన్ ఒక మంచి సినిమా. మీరంతా ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూస్తారా అని వెయిట్ చేస్తున్నాను. ఈ స్టేజీ మీద నా సినిమాల్లోని పర్ ఫార్మెన్స్ లు చూపించారు. అవన్నీ చూసినప్పుడు ఎమోషన్ అయ్యాను. ఇవన్నీ చేశానా అనిపించింది. ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలనే స్ఫూర్తి కలిగింది. రంజిత్ గారు నా డ్రీమ్ డైరెక్టర్. ఆయనతో పని చేయాలని ఎప్పటి నుంచో అనుుకుంటున్నా. ఎందుకో గానీ కుదరలేదు. తంగలాన్ గురించి ఆయన చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. మీకు సర్ ప్రైజ్ గా ఉండాలని సినిమా గురించి ఏమీ రివీల్ చేయడం లేదు. ఈ సినిమాలో అడ్వెంచర్, మెసేజ్, మ్యాజిక్, ఎమోషన్స్ ఉన్నాయి. ఇది నాకు దొరికిన ది బెస్ట్ రోల్ అని అనుకుంటున్నా. జ్ఞానవేల్ రాజా గారు మాకు ఫుల్ లిబర్టీ ఇచ్చి మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. ఇది పాన్ ఇండియా కాదు వరల్డ్ స్టేజీ మీదకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు జ్ఞానవేల్ రాజా గారు. మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ఇష్టపడి సినిమా కోసం వర్క్ చేశారు. మీరు థియేటర్స్ కు వచ్చినప్పుడు తప్పకుండా ఈ కంటెంట్ తో కనెక్ట్ అవుతారు. పార్వతీ, మాళవిక చాలా బాగా పర్ ఫార్మ్ చేశారు. మీరు తంగలాన్ కు చూపిస్తున్న రెస్పాన్స్ కు థ్యాంక్స్. ఈ నెల 15న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%