‘First Love’ song gives a beautiful movie watching experience. Heart break at the end. Sure to be a Big Hit: Sensational Composer SS Thaman in First Love Song Launch

'ఫస్ట్ లవ్' సాంగ్ ఒక బ్యూటీఫుల్ సినిమా చూసిన ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. చివర్లో హార్ట్ బ్రేక్ అయ్యింది. తప్పకుండా బిగ్ హిట్ అవుతుంది: ఫస్ట్ లవ్ సాంగ్ లాంచ్ లో సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్

దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్ లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బం 'ఫస్ట్ లవ్'. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బం టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సెన్సేషనల్ కంపోజర్ ఎస్ఎస్ తమన్ ఫస్ట్ లవ్ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ తమన్ మాట్లాడుతూ.. ఫస్ట్ లవ్ మ్యూజిక్ వీడియో చాలా బ్యూటీఫుల్ గా వుంది. సాంగ్ లో ఒక అద్భుతమైన కథ చూపించారు. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కెమరామెన్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మధు పొన్నాస్ బ్యూటీ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. సంజీవ్ థామస్, సిద్ శ్రీరామ్ ప్రాణం పెట్టి చేశారు. అందరూ ప్రాణం పెట్టి చేయడం వలనే ఆల్బం ఇంత అద్భుతంగా వచ్చింది. దీపు, వైశాలి స్క్రీన్ పై గొప్పగా షైన్ అయ్యారు. చివరి నిముషాలు చూస్తున్నపుడు ఒక లవ్లీ బ్రేక్ వచ్చింది. లాస్ట్ లో హార్ట్ బ్రేక్ అయ్యింది. ఈ ప్రొడక్షన్ నాకు చాలా నచ్చింది. చాలా పాషన్ తో చేశారు. ఆల్బం చాలా బావుంది. వైశాలీ, ఖుషి సినిమాలు గుర్తుకు వచ్చాయి. కొత్తవారు చేసిన ఈ మంచి ప్రయత్నానికి సిద్ శ్రీరామ్ సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా వుంది. తనకి అభినందనలు. ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. ఆల్బం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు.

హీరోయిన్, ప్రొడ్యూసర్ వైశాలిరాజ్ మాట్లాడుతూ.. మా స్పెషల్ గెస్ట్ తమన్ గారికి థాంక్ యు సో మచ్. ఆయన చాలా బిజీగా వుండి కూడా మమ్మలి సపోర్ట్ చేయడానికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. మేము చాలా కష్టపడి ప్రేమతో ఈ పాట చేశాం. డైరెక్టర్ గారికి థాంక్ యూ. సిద్ శ్రీరామ్ గారికి బిగ్ థాంక్స్. ప్రతి టెక్నిషియన్స్ కే థాంక్ యూ. అందరూ చాల బాగా సపోర్ట్ చేశారు. మా సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి సాగర్ గారు చాలా సపోర్ట్ చేశారు. సాంగ్ మీకు నచ్చింది కాబట్టి సాంగ్ కోసం రాయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేయండి. థాంక్ యు ఆల్' అన్నారు

హీరో దీపు జాను మాట్లాడుతూ.. తమన్ గారికి థాంక్ యూ సో మచ్. ఆయన ఈ వేడుకకు వచ్చి మా సాంగ్ సైజు పెద్దది చేశారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి థాంక్ యూ వెరీ మచ్. ఈ సాంగ్ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారికే దక్కుతుంది. మధు, సంజీవ్ కి థాంక్ యు. ఈ సాంగ్ అందరికీ నచ్చుతుందని, వైరల్ అవుతుందనే నమ్మకం వుంది'అన్నారు.

డైరెక్టర్ బాలరాజు మాట్లాడుతూ .. మా స్పెషల్ గెస్ట్ తమన్ గారికి థాంక్ యు సో మచ్. అందరూ సెలబ్రేట్ చేసుకునే చాలా స్పెషల్ ఆల్బం ఇది. దీపు, వైశాలిరాజ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు, వైశాలిరాజ్ చాలా పాషన్ తో ప్రొడక్షన్ చేశారు. సిద్ శ్రీరామ్ కి స్పెషల్ థాంక్స్. ఆయన వోకల్స్ తో పాట మరో లెవల్ కి చేరుకుంది, సంజీవ్, మధు పొన్నాస్ బ్రిలియంట్ వర్క్ చేశారు, మా టీం అందరికీ థాంక్స్. ఈ సాంగ్ తప్పకుండా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది' అన్నారు. ఈ ఈవెంట్ లో యూనిట్ అంతా పాల్గొన్నారు.

నటీనటులు : దీపు జాను, వైశాలిరాజ్
బ్యానర్: D&D పిక్చర్స్
రచన & దర్శకత్వం : బాలరాజు ఎం
నిర్మాత: వైశాలిరాజ్
డీవోపీ: మారుతి పెమ్మసాని
సంగీత దర్శకుడు: సంజీవ్.టి
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: మధు పొన్నాస్
సాహిత్యం : కిట్టువిస్సాప్రగడ
Vfx : దిలీప్, సునీల్, వెంకట్
డిఐ: విష్ణు బాలమురుగన్
ఎడిటర్: దుర్గా నరసింహ
పబ్లిసిటీ డిజైనర్ : Mks_manoj , Vamsekrishnadesigns
పీఆర్వో: తేజస్వి సజ్జా

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%