"Buddy" is a movie meant to be enjoyed in theaters - Director Sam Anton
Allu Sirish's latest film, "Buddy," features Gayathri Bharadwaj and Prisha Rajesh Singh as the leading ladies. Produced by KE Gnanavel Raja and Adhana Gnanavel Raja under the Studio Green Films banner, and directed by Sam Anton, with Neha Gnanavel Raja as co-producer, "Buddy" is an adventurous action entertainer that recently premiered in theaters and is receiving positive audience feedback. In a recent interview, Director Sam Anton shared his experience working on "Buddy."
- "Buddy" is receiving a positive response from everywhere. I'm thrilled that both children and adults are enjoying the film. The word of mouth about the movie being a hit began with the morning shows. Our entire team is delighted to have entertained you with 'Buddy.' The blend of comedy, emotion, action, and the teddy bear character in 'Buddy' is captivating audiences.
-
Discussions about "Buddy" began two years ago with our producer, Gnanavel. Although there were initial talks about remaking the Tamil film "Teddy," we decided to craft "Buddy" with an entirely new story, using only one concept from "Teddy." That's how the movie came into being. We approached Allu Sirish, believing a young hero would be perfect for this film. He has been familiar with my work for a long time, and after discussing the story of "Buddy," he liked it and agreed to start the project.
-
Nowadays, audiences seek movies that offer a true theatrical experience. "Buddy" was designed with this in mind. We focused on bringing expressions to the teddy bear character, with impressive CG work to enhance the feel. While the film encompasses action and adventure, at its core, it is a love story between a girl who works in ATC and a pilot.
-
Though Rajamouli’s film was referenced for "Buddy," I assure you that the emotional elements in our movie will resonate as well. Whether dealing with a villain character, a love story, or the teddy bear, we were committed to creating impactful emotions. We aimed to make "Buddy" as engaging as films like "Khaidhi" and "Vikram," with a highlight being the action sequence in the flight's climax. The music by Hip Hop Tamizha has been well-received, and Hip Hop Adi is set to star in his next film as a hero.
-
I have a great appreciation for Telugu films and watch them regularly. I am planning to make a straight Telugu film in the future. As a director, I am open to working across various genres, whether it be comedy, action, or love stories.
"బడ్డీ" థియేటర్ లోనే ఎంజాయ్ చేయాల్సిన సినిమా - డైరెక్టర్ శామ్ ఆంటోన్
అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించగా..శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "బడ్డీ" రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో "బడ్డీ"కి వర్క్ చేసిన ఎక్సీపిరియన్స్ షేర్ చేసుకున్నారు డైరెక్టర్ శామ్ ఆంటోన్.
- "బడ్డీ" మూవీకి అన్ని చోట్ల నుంచీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాగుందని, తమకు నచ్చిందని పిల్లలు, పెద్దలు చెబుతుండటం సంతోషంగా ఉంది. మార్నింగ్ షోస్ నుంచే సినిమా హిట్ అనే మౌత్ టాక్ మొదలైంది. "బడ్డీ" మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడం మా టీమ్ అందరికీ హ్యాపీగా ఉంది. "బడ్డీ"లోని కామెడీ, ఎమోషన్, యాక్షన్ తో పాటు టెడ్డీ బేర్ క్యారెక్టర్ ప్రేక్షకుల్ని బాగా ఎంటర్ టైన్ చేస్తోంది.
-
మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారితో రెండేళ్ల క్రితమే "బడ్డీ" గురించి డిస్కషన్ జరిగింది. తమిళ్ మూవీ టెడ్డీని రీమేక్ చేయాలనే ప్రస్తావన వచ్చింది. అయితే టెడ్డీలోని ఒక లైన్ మాత్రమే తీసుకుని కంప్లీట్ గా కొత్త కథతో "బడ్డీ" రూపొందించాలని అనుకున్నాం. అలా ఈ సినిమా మొదలైంది. ఈ మూవీకి ఒక యంగ్ హీరో అయితే బాగుంటుందని అల్లు శిరీష్ ను అప్రోచ్ అయ్యాం. ఆయన నాకు చాలాకాలంగా పరిచయం. నా మూవీస్ చూసి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. మేము సినిమా చేయాలని గతంలోనే అనుకున్నాం. "బడ్డీ" కథ చెప్పగానే శిరీష్ కు నచ్చి ప్రాజెక్ట్ బిగిన్ చేశాం.
-
ఇవాళ ప్రేక్షకులు థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే మూవీస్ కు మాత్రమే థియేటర్స్ కు వెళ్తున్నారు. "బడ్డీ" థియేటర్ కోసమే చేసిన సినిమా. ఇందులో టెడ్డీకి ఎక్స్ ప్రెషన్స్ తీసుకురావడం మెయిన్ టాస్క్ గా భావించాం. సీజీ వర్క్ బాగా చేయించి ఆ ఫీల్ తీసుకొచ్చాం. యాక్షన్, అడ్వెంచర్ కథలో ఉన్నా.ఇది మెయిన్ గా లవ్ స్టోరీ. ఏటీసీలో వర్క్ చేసే అమ్మాయి, పైలట్ కు మధ్య జరిగే ప్రేమ కథ.
-
"బడ్డీ" కోసం రాజమౌళి ఈగ రిఫరెన్స్ తీసుకున్నా. ఆ సినిమాలో వర్కవుట్ అయిన ఎమోషన్ మనకూ వర్కవుట్ అవుతుందని చెప్పా. అది విలన్ క్యారెక్టర్ అయినా, లవ్ అయినా, టెడ్డీ బేర్ క్యారెక్టర్ అయినా ఎమోషన్ వర్కవుట్ అవుతుందని నమ్మకం ఉండేది. ఖైదీ, విక్రమ్, కల్కిలా ఎపిసోడ్స్ లా "బడ్డీ" సినిమాను చేసుకుంటూ వెళ్లాం. క్లైమాక్స్ లో ఫ్లైట్ లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు హైలైట్ గా ఉంటుంది. హిప్ హాప్ తమిళ చేసిన మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హిప్ హాప్ ఆది హీరోగా నెక్ట్ మూవీ చేయబోతున్నా.
-
నాకు తెలుగు మూవీస్ ఇష్టం. రెగ్యులర్ గా తెలుగు మూవీస్ చూస్తుంటా. స్ట్రైట్ తెలుగు సినిమా చేయాలనే ప్లాన్స్ ఉన్నాయి. దర్శకుడిగా ఒక జానర్ కు రెస్ట్రిక్ట్ కాలేను. కామెడీ, యాక్షన్, లవ్ స్టోరి ఇలా ఏ జానర్ అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నా.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.