"Buddy" will entertain Class, Mass and All - Hero Allu Sirish
Allu Sirish's latest movie is "Buddy," featuring Gayathri Bharadwaj and Prisha Rajesh Singh as the heroines. The film is produced by KE Gnanavel Raja and Adhana Gnanavel Raja under the Studio Green Films banner, with Sam Anton as the director and Neha Gnanavel Raja as co-producer. "Buddy" is an adventurous action entertainer set for a grand theatrical release on August 2. In today’s interview, hero Allu Sirish discussed the film’s features.
- We started filming "Buddy" in March last year and completed it by July. We initially aimed to release it in December, but there was a gap between my movies. Producer Gnanavel and I decided to expedite the process and host a success party on December 31. However, with over 3,000 CG shots in the movie and the need for perfect animation of the Buddy character, we required additional time for the artists. This led to a delay, moving the release from summer to August. The key aspect of the film is how the doll comes to life, ensuring that "Buddy" meets international standards.
-
Director Sam Anton presented the story to me, mentioning that the Teddy Bear would be a significant element. Although a similar film called "Teddy" had been released in Tamil and an English version exists, Sam assured me that the story would feel new. After listening to the story, I watched the Tamil "Teddy" on OTT and found that while the concept of a teddy bear coming to life was similar, everything else in "Buddy" is unique. The conflict between the heroine and the villain, the hero's characterization, and the justifications in the story are all well-scripted. I was impressed by the novelty of "Buddy." I am also making my debut as a pilot, and my character is intense.
-
Since the release of the "Buddy" poster, there have been comments questioning whether it is a remake. It has become a challenge for us to clarify that it is an original film. Despite the comments, we can't change people’s opinions or prove it until the film is released. After its release, audiences will see that "Buddy" is an original film. "Buddy" offers both class and mass entertainment for everyone.
-
Telugu movie lovers still prefer to watch films in theaters, which is why we have focused on ensuring that "Buddy" is available in theaters at affordable prices. This is in contrast to the North, where theater attendance is relatively low despite the large population. I noticed that my friends went to the cinema only in the second week. Hence, we are making "Buddy" accessible in theaters for everyone to enjoy.
-
"Buddy" includes a love story, but it is a very small part of the film. Director Sam has included only as much romance as the story requires, believing that too much focus on the love story would cause the narrative to deviate. The movie's runtime is crisp at 2 hours and 8 minutes. For a concept-oriented film like "Buddy," a longer length would not be appropriate. The story needs to move quickly, almost like performing magic, and Director Sam achieved this with "Buddy."
-
"Buddy" features four major action sequences. I instructed our action choreographers to design them in a natural manner. Surprisingly, they had already planned to approach them naturally, which aligned with my vision. It seemed we were all thinking along the same lines.
-
The film is rich in production quality. Studio Green’s Gnanavel Raja produced "Buddy" without compromise. We even acquired an old airplane, created artwork for it, and shot scenes inside it, including the climax fight. The producer emphasized that the film should receive everything it needs, though not to rush the shoot. We completed the film in two shifts.
-
The music and background score by Hip Hop Tamizha are excellent. When we watched "Buddy," the BGM was superb, and special showings received a positive response from the audience. I enjoy Hip Hop Tamizha movie songs like "Thani Oruvan" and "Dhruva."
-
I previously worked with Ali in "Srirastu Subhamastu," and we acted together again in this film. I’m happy to collaborate with such a senior actor. Ali plays the role of a co-pilot in "Buddy."
-
I prefer not to work on multiple films simultaneously, focusing on one project at a time. This is why there are gaps between my releases. Generally, any film, regardless of size, can experience delays and may not be completed on the originally scheduled timeline.
"బడ్డీ" క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది - హీరో అల్లు శిరీష్
అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపారు హీరో అల్లు శిరీష్.
- "బడ్డీ" మూవీని లాస్ట్ ఇయర్ మార్చి లో మొదలుపెట్టి జూలైలో సినిమా కంప్లీట్ చేశాం. డిసెంబర్ లోనే రిలీజ్ కు తీసుకురావాలని అనుకున్నాం. నా మూవీస్ కు గ్యాప్ వస్తోంది. ఫాస్ట్ గా చేసి డిసెంబర్ 31 సక్సెస్ పార్టీ చేసుకోవాలని నేనూ నిర్మాత జ్ఞానవేల్ గారూ అనుకున్నాం. అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. బడ్డీ ఫేస్ ను యానిమేట్ చేయాలి. వాటిని పర్పెక్ట్ గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్ ఇవ్వాలి. దాంతో లేట్ అయ్యింది. సమ్మర్ అనుకున్నది ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే కీ పాయింట్ మీదే సినిమా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గకుండా సీజీ వచ్చింది.
-
డైరెక్టర్ శామ్ ఆంటోనీ ఈ కథతో నా దగ్గరకు వచ్చి టెడ్డీ బేర్ పాయింట్ తో ఉంటుందని చెప్పారు. టెడ్డీ మూవీ తమిళంలో వచ్చింది, అలాగే ఇంగ్లీష్ లోనూ ఇలాంటి సినిమా ఉందని చెప్పాను. మీరు కథ వినండి మీకు కొత్తగా అనిపిస్తుంది, స్టోరీ విన్నాక మల్లీ ఓటీటీలో టెడ్డీ మూవీ చూడండి అన్నారు శామ్ ఆంటోనీ. అలా కథ విన్నాను. టెడ్డీ బేర్ కు ప్రాణం రావడం అనే ఒక్క పాయింట్ ను మాత్రమే దర్శకుడు టెడ్డీ సినిమా నుంచి తీసుకున్నాడు. మిగతాదంతా కొత్త కథ. హీరోయిన్ కు విలన్ కు ఉండే కాన్ ఫ్లిక్ట్, హీరో క్యారెక్టరైజేషన్, కథకు ఇచ్చిన జస్టిఫికేషన్స్ అన్నీ బాగా స్క్రిప్టింగ్ చేశాడు. "బడ్డీ" కథ వింటునప్పుడు కొత్తగా అనిపించింది. నేనూ రోజు కథలు వింటా...ఒక వెరైటీ పాయింట్ ఏ కథలో దొరుకుతుందా అని వెతుకుతుంటా. ఆ కొత్తదనం "బడ్డీ" కథలో ఫీల్ అయ్యా. నేను ఫస్ట్ టైమ్ పైలట్ గా కనిపించబోతున్నా. నా క్యారెక్టర్ ఇంటెన్స్ గా ఉంటుంది.
-
"బడ్డీ" పోస్టర్ రిలీజ్ నుంచి ఇది రీమేక్ కదా అని కామెంట్స్ వచ్చాయి కాదు స్ట్రైట్ ఫిల్మ్ అని చెప్పడమే మాకు పెద్ద సవాల్ గా మారింది. ఎంత చెప్పినా ఇది రీమేక్ అనే కామెంట్స్ రాసేవారు. అలాంటి వాళ్లను మనం మార్చలేం, వారికి మొత్తం సినిమా చూపెట్టి ప్రూవ్ చేయలేం కదా. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లకే తెలుస్తుంది "బడ్డీ" స్ట్రైట్ ఫిలిం అని. "బడ్డీ" క్లాస్, మాస్ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది.
-
తెలుగు ఆడియెన్స్ మూవీ లవర్స్. వాళ్లు ఇప్పటికీ థియేటర్స్ లోనే సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అందుకే మన దగ్గర థియేటర్స్ లో పుట్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. సింగిల్ స్క్రీన్స్ లోనూ బాగా సినిమాలు చూస్తుంటారు. అదే నార్త్ లో అలా ఉండదు. వాళ్ల జనాభాకు థియేటర్స్ కు వెళ్లే వారి సంఖ్య చూస్తే చాలా తక్కువ. సెకండ్ వీక్ సినిమాకు వెళ్తామనే ఫ్రెండ్స్ ను చూశాను. అందుకే అందరికీ అందుబాటు ధరల్లో మా "బడ్డీ" సినిమాను థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం.
-
"బడ్డీ" లో లవ్ స్టోరీ ఉంటుంది కానీ చాలా తక్కువ పార్ట్ ఉంటుంది. కథకు ఎంత కావాలో అంతే ఉంచాడు దర్శకుడు శామ్. లవ్ స్టోరీ ఎక్కువ ఉంటే కథ డీవీయేట్ అవుతుందని ఆయన భావించాడు. "బడ్డీ" సినిమా రన్ టైమ్ కూడా చాలా క్రిస్ప్ గా ఉంటుంది. 2 గంటల 8 నిమిషాలు రన్ టైమ్ ఉంది. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ కు ఎక్కువ లెంగ్త్ ఉంటే బాగుండదు. అలా మ్యాజిక్ చేస్తున్నట్లు కథ ఫాస్ట్ గా వెళ్లాలి. "బడ్డీ" కి డైరెక్టర్ శామ్ అదే ప్రయత్నం చేశాడు.
-
"బడ్డీ" లో నాలుగు మేజర్ యాక్షన్ సీక్వెన్సులు ఉంటాయి. వాటిని చాలా న్యాచురల్ గా ఉండేలా డిజైన్ చేయమని మా యాక్షన్ కొరియోగ్రాఫర్స్ కు చెప్పాను. నేను చెప్పే ముందే వాళ్లే ఇలా న్యాచురల్ గా చేద్దాం సార్ అన్నారు. నేను సర్ ప్రైజ్ అయ్యాం. మా అందరికీ ఒకేలా ఆలోచిస్తున్నాం అనిపించింది.
-
ప్రొడక్షన్ పరంగా మూవీ చాలా రిచ్ గా ఉంటుంది. స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా గారు సినిమాను రాజీ పడకుండా నిర్మించారు. ఒక పాత విమానం కొని దాన్ని మూవీ కోసం ఆర్ట్ వర్క్ చేసి అందులో షూట్ చేశాం. క్లైమాక్స్ ఫైట్ కూడా అందులోనే ఉంటుంది. సినిమాకు కావాల్సింది ఇస్తాను కానీ తక్కువ డేస్ లో షూటింగ్ చేయండని ప్రొడ్యూసర్ చెప్పేవారు. రెండు షిఫ్టుల్లో సినిమాను కంప్లీట్ చేశాం.
-
హిప్ హాప్ తమిళ చేసిన మ్యూజిక్, బీజీఎం అదిరిపోతుంది. మేము "బడ్డీ" చూసినప్పుడు బీజీఎం సూపర్బ్ గా ఉందనిపించింది. స్పెషల్ షోస్ వేసినప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి మ్యూజిక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిప్ హాప్ థమిళ చేసిన తని ఓరువన్, ధృవ లాంటి మూవీస్ పాటలు నాకు ఇష్టం.
-
అలీ గారితో నేను గతంలో శ్రీరస్తు శుభమస్తు సినిమా చేశాను. ఈ సినిమాలో మరోసారి కలిసి నటించాను. అలాంటి సీనియర్ యాక్టర్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో కో పైలట్ క్యారెక్టర్ లో అలీ గారు కనిపిస్తారు.
-
ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయడాన్ని ఇష్టపడను. ఒక సినిమా తర్వాతే మరొకటి. అందుకే నా మూవీస్ లేట్ అవుతున్నాయి. సాధారణంగా చిన్నా, పెద్దా ఏ సినిమా అయినా అనుకున్న టైమ్ కు చేయలేం. ఖచ్చితంగా ఎంతో కొంత ఆలస్యమవుతూనే ఉంటుంది.
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.