Buddy ticket prices reduced to make Cinema accessible to family audiences: Allu Sirish

Allu Sirish's latest film is "Buddy," featuring Gayatri Bharadwaj and Prisha Rajesh Singh as the heroines. Produced by KE Gnanavel Raja and Adhana Gnanavel Raja under the banner of Studio Green Films and directed by Sam Anton, the film is an adventurous action entertainer. Neha Gnanavel Raja serves as co-producer. "Buddy" is set for a grand theatrical release on August 2. The pre-release press meet was held today, where:

Actor Gokul thanked director Sam Anton for the opportunity to act in "Buddy," highlighting his powerful teddy bear character and the support from the team. He encouraged everyone to watch the film with their families in theaters.

Director Sam Anton stated that "Buddy" will be released on August 2, with all preparations for the release completed. He emphasized the importance of media support for the film and expressed his satisfaction with the producer and the team. He hopes the audience will enjoy the film in theaters.

Heroine Gayatri Bharadwaj announced that "Buddy" will be released on August 2 with reduced ticket prices. She encouraged viewers to watch it with their families, promising a comforting and enjoyable experience. She thanked producer Gnanavel Raja for the opportunity and expressed pride in her role. She assured that the film, made with love and hard work, will be well-received.

Heroine Prisha Rajesh Singh shared her excitement for the release of "Buddy," which she has eagerly awaited for a year. She appreciated the opportunity to act in her first film and sought the audience's support.

Actor Ali described "Buddy" as a film that combines love, action, and comedy, and noted the positive response to the preview shows in Vijayawada, Vizag, and Hyderabad. He expressed his happiness at working with Allu Sirish and praised the film's director for bringing a quality movie to Telugu audiences. He hopes the film will be appreciated.

Hero Allu Shirish mentioned that the pre-release screenings of "Buddy" received positive feedback from all sections of the audience, including children and adults. He was pleasantly surprised by the response and noted that high ticket prices were discouraging people from attending second-week shows. Consequently, ticket prices have been set at 99 for single screens and 125 for multiplexes after discussions with about 200 exhibitors. He thanked Gnanavel Raja for this adjustment. Sirish described his role as secondary to the teddy bear, who he feels is the real hero of the film. He praised the film's action sequences and overall entertainment value, and encouraged everyone to watch "Buddy" on August 2.

Cast:
- Allu Sirish
- Gayatri Bharadwaj
- Ajmal Aamir
- Prisha Rajesh Singh
- Mukesh Kumar
- Ali

Technical Team:
- Editor: Ruben
- Cinematography: Krishnan Vasanth
- Art Director: R. Senthil
- Music: Hip Hop Tamizha
- Banner: Studio Green Films
- PRO: GSK Media (Suresh - Sreenivas)- Co-Producer: Neha Gnanavel Raja

  • Producers: KE Gnanavel Raja, Adhana Gnanavel Raja
  • Written and Directed by: Sam Anton

ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావాలనే "బడ్డీ" సినిమా టికెట్ రేట్లు తగ్గించాం - ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో అల్లు శిరీష్

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ "బడ్డీ". గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 2న "బడ్డీ" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు "బడ్డీ" ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

నటుడు గోకుల్ మాట్లాడుతూ - "బడ్డీ" సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శకుడు శామ్ గారికి థ్యాంక్స్. టెడ్డీ బేర్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. టీమ్ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. "బడ్డీ" సినిమాను థియేటర్స్ లో ఫ్యామిలీతో కలిసి చూడండి. అన్నారు.

దర్శకుడు శామ్ ఆంటోన్ మాట్లాడుతూ - "బడ్డీ" సినిమా ఆగస్టు 2న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా రిలీజ్ కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. మేము చేసే మూవీస్ కు మీడియా సపోర్ట్ ఎంత అవసరమో నాకు తెలుసు. మీ సపోర్ట్ మాకు కావాలి. నేను చేసిన ప్రతి మూవీ నిర్మాతను సంతృప్తి పరిచింది. "బడ్డీ" విషయంలో కూడా మా ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నారు. మా టీమ్ కూడా హ్యాపీగా ఉన్నారు. సినిమా సాధించబోయే సక్సెస్ తో పాటు నాకు ఇలా మా టీమ్ సంతోషంగా ఉండటమే కావాలి. "బడ్డీ"ని థియేటర్స్ లో చూస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

హీరోయిన్ గాయత్రి భరద్వాజ్ మాట్లాడుతూ - "బడ్డీ" సినిమా తక్కువ టికెట్ రేట్లతో మీ ముందుకు ఆగస్టు 2న వస్తోంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి తప్పక చూడండి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు నాకు చాలా స్పెషల్. మంచి క్యారెక్టర్ చేశాను. ఈ మూవీలో అవకాశం ఇచ్చిన నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఎంతో లవ్, హార్డ్ వర్క్ తో "బడ్డీ" సినిమా చేశాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పగలను. అన్నారు.

హీరోయిన్ ప్రిషా రాజేశ్ సింగ్ మాట్లాడుతూ - "బడ్డీ" రిలీజ్ కోసం మేమంతా వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. రిలీజ్ ఎప్పుడు అని నేను మా డైరెక్టర్ ను రెగ్యులర్ అడిగేదాన్ని. ఆయన త్వరలోనే అంటూ రిప్లై ఇచ్చేవారు. "బడ్డీ" మీ అందరికీ నచ్చుతుంది. ఈ మూవీలో నటించడాన్ని ఎంజాయ్ చేశాం. నాకు ఇది ఫస్ట్ మూవీ. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు అలీ మాట్లాడుతూ - లవ్, యాక్షన్, కామెడీ అన్నీ ఉన్న సినిమా "బడ్డీ". ఈ చిత్రానికి తక్కువ టికెట్ రేట్స్ పెట్టారు. రిలీజ్ ముందు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ లో వేసిన మూడూ షోస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ సినిమా నచ్చుతుంది. అల్లు శిరీష్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. మెగా ఫ్యామిలీలో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించాను. శిరీష్ తాను ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చానని ఎప్పుడూ బిహేవ్ చేయడు. హీరోయిన్ గాయత్రికి తెలుగులో రెండో సినిమా. దర్శకుడు శామ్ గారు మన తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి మూవీ తీసుకొస్తున్నారు. బాగున్న సినిమాలను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. "బడ్డీ"కి కూడా మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.

హీరో అల్లు శిరీష్ మాట్లాడుతూ - "బడ్డీ" సినిమా రిలీజ్ ముందు వేసిన షోస్ కు అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి, పిల్లలు, పెద్దలు అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియెన్స్ కూడా మూవీని బాగా ఎంజాయ్ చేశారు. నేను ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు. నేను కూడా వారితో కలిసే సినిమా చూశాను. మేము ఏ ఏ సీన్స్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేశామో ఆ సీన్స్ వారికి బాగా నచ్చుతున్నాయి. టికెట్ రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది సెకండ్ వీక్ థియేటర్స్ కు వెళ్తున్నారు. అందుకే "బడ్డీ" సినిమాకు సింగిల్ స్క్రీన్ 99, మల్టీప్లెక్స్ 125 రూపాయల టికెట్ రేట్స్ పెట్టాం. దాదాపు 200 మంది ఎగ్జిబిటర్స్ తో మాట్లాడి మా ప్రొడ్యూసర్ టికెట్ రేట్లు తగ్గించారు. అందుకు జ్ఞానవేల్ రాజా గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నేను సెకండ్ హీరో అనుకోవచ్చు. టెడ్డీ బేర్ ఫస్ట్ హీరో. తను చేసే యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో నేను యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువగా చేశా. యాక్షన్, కామెడీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగుంటాయి. థ్రిల్లర్ ఎలిమెంట్స్ కు సరైన లాజిక్ కూడా ఉంటుంది. "బడ్డీ"లో టెడ్డీ బేర్ సినిమాలు బాగా చూస్తుంటంది. తను అందరు హీరోల ఫ్యాన్. అందుకే కొన్ని ఫేమస్ డైలాగ్స్ పెట్టాం. ఆగస్టు 2న థియేటర్స్ కు వెళ్లండి. "బడ్డీ" మీ అందరినీ బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

నటీనటులు - అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు

టెక్నికల్ టీమ్

ఎడిటర్ - రూబెన్
సినిమాటోగ్రఫీ - కృష్ణన్ వసంత్
ఆర్ట్ డైరెక్టర్ - ఆర్ సెంథిల్
మ్యూజిక్ - హిప్ హాప్ తమిళ
బ్యానర్ - స్టూడియో గ్రీన్ ఫిలింస్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ - నేహా జ్ఞానవేల్ రాజా
ప్రొడ్యూసర్ - కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం - శామ్ ఆంటోన్

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.