The Telugu Film Directors Association hosted a special event, the Darshaka Sanjeevani Mahotsavam, to distribute health insurance cards to its members. The event, held in Hyderabad, was graced by star hero Vijay Devarakonda as the chief guest. The program saw the participation of notable figures including Director's Association President Veera shankar, Vice-President Sai Rajesh, Producer TG Vishwa prasad, Writer Paruchuri Gopalakrishna, Director-Producer Tammareddy Bharadwaj, along with many members of the Directors' Association and several celebrities from the film industry. The health insurance cards, named Dasari Health Cards in honor of the late legendary director Dasari Narayana Rao, were presented to the members by the guests. The event was organized under the auspices of Shreyas Media.
Director's Association President Veerashankar stated, "Since our committee's election, we have focused on welfare programs. Initially, we provided 25 thousand rupees to members in need, which was later increased to one lakh rupees. However, many members suggested that health insurance would be more beneficial. We promised to provide free health insurance to those who needed it without utilizing the association’s capital. As promised, Oriental Insurance Company agreed to provide the health cards. We have issued insurance to 1920 people and their families, out of 720 applicants. This initiative was started by our director Sai Rajesh, who is the Karta, Karma, and Kriya. It is an honor to have Hero Vijay Devarakonda, Producer TG Vishwaprasad, and other dignitaries join us today."
Sai Rajesh, Vice-President of the Director's Association, added, "Upon learning that our members were struggling without health cards, we made it a top priority. The film industry responded generously, with Prabhas contributing 35 lakhs, producer SKN 10 lakhs, and Bunny Vas and UV Vamsi also providing financial support. Selecting the right health insurance took time, but Hero Vijay Devarakonda's presence at our event is deeply appreciated. His foundation has helped hundreds, and I hope that none of you will need to use these health cards."
Hero Vijay Devarakonda expressed, "I am honored to be part of this significant event organized by the Directors' Association. I understand the challenges faced by dreamers, having witnessed their struggles before becoming a hero myself. There is no guaranteed income or future, but you persist in pursuing your dreams. The energy and commitment of this committee are inspiring. Providing free health cards and organizing this event is a commendable initiative. I applaud everyone involved in this effort and want to assure you of my continued support."
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా ఘనంగా దర్శక సంజీవని మహోత్సవం కార్యక్రమం
తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ తమ సభ్యులకు హెల్త్ ఇన్సురెన్స్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని దర్శక సంజీవని మహోత్సవం పేరుతో ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ఉపాధ్యక్షులు సాయి రాజేశ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు దర్శకుల సంఘం సభ్యులు, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ హెల్త్ కార్డులను స్వర్గీయ దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పేరు మీద దాసరి హెల్త్ కార్డుగా సభ్యులకు అతిథుల చేతుల మీదుగా అందజేశారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో
దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ - మా డైరెక్టర్స్ అసోసియేషన్ కమిటీగా మేము ఎన్నికయ్యాక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టిసారించాం. మా సంఘంలో సభ్యుడికి ఏదైనా ఇబ్బంది కలిగితే గతంలో 25 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆ తర్వాత అది లక్ష రూపాయలకు పెంచారు. అయితే చాలా మంది సభ్యులు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తే బాగుంటుందని అడిగేవారు. మేము ఈసారి ఎలక్షన్స్ లో అవసరమైన సభ్యులకు ఉచితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. అది కూడా అసోసియేషన్ మూలధనం ముట్టుకోకుండా బయట నుంచి ఫండ్స్ సేకరించి అందిస్తామని హామీ ఇచ్చాం. హామీ ఇచ్చినట్లే ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఉచిత హెల్త్ కార్డ్స్ అందిస్తుండటం సంతోషంగా ఉంది. దీనంతటికీ కర్త, కర్మ, క్రియ మా సాయి రాజేశ్. సంఘంలోని 720 మంది అవసరమైన వారు ఈ హెల్త్ కార్డులకు అప్లై చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 1920 మందికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాం. ఈ రోజు మా ఈవెంట్ లో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఇతర పెద్దలంతా అతిథులుగా పాల్గొనడం ఆనందంగా ఉంది. అన్నారు.
దర్శకుల సంఘం ఉపాధ్యక్షులు సాయిరాజేశ్ మాట్లాడుతూ - అసోసియేషన్ సభ్యులు హెల్త్ కార్డ్ లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలియగానే మా కమిటీలో మొదటి ప్రాధాన్యత కింద ఆ అంశాన్ని చేర్చాం. హెల్త్ కార్డుల విషయం చెప్పగానే చిత్ర పరిశ్రమలోని ఎంతమంది స్పందించి ఆర్థిక సాయం చేశారు. ప్రభాస్ గారు 35 లక్షలు ఇచ్చారు. నా ఫ్రెండ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ 10 లక్షలు, బన్నీ వాస్ గారు, యూవీ వంశీ గారు ఇలా చాలా మంది ఆర్థిక సాయం అందించారు. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేయడం కోసమే కొంత టైమ్ పట్టింది. హీరో విజయ్ దేవరకొండ మా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. ఆయన తన ఫౌండేషన్ ద్వారా వందలాది మందికి హెల్ప్ చేశారు. మీలో ఎవరికీ ఈ హెల్త్ కార్డ్ అవసరం రావొద్దని కోరుకుంటున్నా. అన్నారు
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - ఈ రోజు దర్శకుల సంఘం నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరంతా డ్రీమర్స్. డ్రీమర్స్ కష్టాలు ఎలా ఉంటాయో నేను హీరోగా ఎదగకముందు చూశాను. స్థిరమైన ఆదాయం ఉండదు, భవిష్యత్ మీద భరోసా ఉండదు. కానీ మీ కలను సాకారం చేసుకోవడంలో ముందుకు సాగుతుంటారు. ఈ అసోసియేషన్ సభ్యులు నా దగ్గరకు వచ్చి కలిసినప్పుడు ఈ కమిటీలో ఒక ఎనర్జీ కనిపించింది. తమ సభ్యులకు ఏదో మంచి చేయాలనే తపన కనిపించింది. మధ్యాహ్నం భోజనం పెట్టడం అలాగే ఉచిత హెల్త్ కార్డ్స్ ఇవ్వడం మంచి ఆలోచన. ఈ ప్రయత్నంలో భాగమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. ఈ అసోసియేషన్ కు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. అన్నారు.
Photos - https://we.tl/t-WqFq6KKX7Z
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.