Lyca Productions Action King Arjun’s Dynamic First Look in Thala Ajith’s ‘Vidamuyarchi’

అజిత్ కుమార్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాత సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘విడాముయ‌ర్చి’ నుంచి యాక్ష‌న్ కింగ్ అర్జున్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

https://x.com/LycaProductions/status/1817441118146973809

యాక్ష‌న్ కింగ్ అర్జున్‌... ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని విల‌క్ష‌ణ న‌టుడు. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా, ప్ర‌తినాయ‌కుడిగా ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఈయ‌న మెప్పించారు. మ‌రోసారి త‌న‌దైన శైలిలో మ‌రో విభిన్న‌మైన పాత్ర‌తో ‘విడాముయ‌ర్చి’లో ఆక‌ట్టుకోబోతున్నారాయ‌న‌. అగ్ర క‌థానాయ‌కుడు అజిత్‌కుమార్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో మ‌గిళ్ తిరుమేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘విడాముయ‌ర్చి’. అనౌన్స్‌మెంట్ రోజు నుంచి భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ సినిమా రీసెంట్‌గానే షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ‘విడాముయ‌ర్చి’ నుంచి యాక్ష‌న్ కింగ్ అర్జున్ పాత్ర‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు.

పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే ఓ రోడ్డుపై స్టైలిష్ లుక్‌ను అర్జున్ నిల‌బ‌డి ఉన్నారు. బ్యాగ్రౌండ్‌లో అజిత్ షాడోలో క‌నిపిస్తున్నారు. అస‌లు అర్జున్‌కి, అజిత్ పాత్ర‌కు ఉన్న లింకేంట‌నే ఆస‌క్తిని పోస్ట‌ర్‌తో క్రియేట్ చేశారు మేక‌ర్స్‌. ‘ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్’ (కష్టం ఎప్పటికీ వృథా కాదు) అనే అర్థం వచ్చేలా ఉన్న వ్యాకం మ‌రింత క్యూరియాసిటీని క‌లిగిస్తోంది.

ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో స్టార్స్‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాలు, డిఫ‌రెంట్ కంటెంట్ బేస్డ్ సినిమాల‌ను నిర్మిస్తోన్న టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ సంస్థ అధినేత సుభాస్క‌ర‌న్..‘విడాముయ‌ర్చి’ సినిమాను నిర్మిస్తుండ‌టంతో అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. ఆద్యంతం ఆక‌ట్టుకునే ఎంట‌ర్‌టైన్మెంట్ చిత్రాల‌తో పాటు విల‌క్ష‌ణ‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడిగా పేరున్న మ‌గిళ్ తిరుమేని అజిత్‌తో భారీ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

అజిత్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘మంగాత’ (తెలుగులో గ్యాంబ్లర్)లో అజిత్ కుమార్‌, త్రిష‌, యాక్ష‌న్ కింగ్ అర్జున్ త్ర‌యం త‌మదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఇప్పుడు మ‌రోసారి వీరు ముగ్గురు ఆడియెన్స్‌ను మెప్పించ‌నున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆర‌వ్‌, రెజీనా క‌సాండ్ర‌, నిఖిల్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

కోలీవుడ్ మ్యూజిక‌ల్ రాక్ స్టార్ అనిరుద్ ఇప్ప‌టికే చార్ట్‌బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను సిద్ధం చేశారు. ఓం ప్ర‌కాష్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఎన్‌.బి.శ్రీకాంత్ ఎడిటర్‌గా, మిలాన్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సుంద‌ర్ స్టంట్స్‌ను కంపోజ్ చేస్తుండ‌గా, అను వ‌ర్ధ‌న్ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. సుబ్ర‌మ‌ణియ‌న్ నారాయ‌ణ‌న్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, జె.గిరినాథ‌న్‌, కె.జ‌య‌శీల‌న్ ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్స్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. ఇంకా జి.ఆనంద్ కుమార్ (స్టిల్స్‌), గోపీ ప్ర‌స‌న్న (ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌), హ‌రిహ‌ర‌సుత‌న్‌(వి.ఎఫ్‌.ఎక్స్‌), సురేష్ చంద్ర (పి.ఆర్‌.ఒ-త‌మిల్‌), నాయుడు సురేంద్ర‌కుమార్‌- ఫ‌ణి కందుకూరి (పి.ఆర్.ఒ-తెలుగు), లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌ సినిమాలో భాగ‌మై వ‌ర్క్ చేస్తున్నారు.

అజిత్ కుమార్ ‘విడాముయ‌ర్చి’ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను స‌న్ టీవీ సొంతం చేసుకోగా, ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. సోనీ మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%