Social News XYZ     

Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments’ unveil rocking Lucky Baskhar Title Track on actor’s birthday!

''లక్కీ భాస్కర్'' చిత్రం నుంచి టైటిల్ ట్రాక్ విడుదల

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ''లక్కీ భాస్కర్'' చిత్రం నుంచి టైటిల్ ట్రాక్‌ విడుదల

వివిధ భాషలలో సినిమాలు చేస్తూ, దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. తెలుగులోనూ "మహానటి", "సీతా రామం" వంటి ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు "లక్కీ భాస్కర్" అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

 

''లక్కీ భాస్కర్'' సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, "శ్రీమతి గారు" గీతం విశేషంగా ఆకట్టుకొని, సినిమాపై అంచనాలను పెంచాయి. తాజాగా ఈ చిత్రం నుంచి టైటిల్ ట్రాక్‌ విడుదలైంది.

జులై 28న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సంద‌ర్భంగా "లక్కీ భాస్కర్" నుంచి టైటిల్ ట్రాక్‌ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ పాట మనల్ని 1980-90ల రోజుల్లోకి తీసుకెళ్తోంది. వాయిద్యాలు వినియోగించిన విధానం, ముఖ్యంగా లెజెండరీ సింగర్ ఉషా ఉతుప్ గాత్రం.. ఈ గీతాన్ని ఓ కమ్మటి విందు భోజనంలా మలిచాయి.

గీత రచయిత రామజోగయ్య శాస్త్రి మరోసారి తన కలం బలం చూపించారు. "శభాష్ సోదరా.. కాలరెత్తి తిరగరా.. కరెన్సీ దేవి నిను వరించెరా" అంటూ తనదైన సాహిత్యంతో గీతాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు. కథానాయకుడి పాత్రను ఆవిష్కరించడంతో పాటు, శ్రోతలలో స్ఫూర్తి నింపేలా సాహిత్యాన్ని అందించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ పాట కోసం 1980ల నాటి ఇండి-రాక్‌ని ప్రస్తుత తరానికి తగ్గట్టుగా స్వరపరిచారు. ఈ గీతం ప్రస్తుత గీతాలకు భిన్నంగా సరికొత్త అనుభూతిని ఇస్తుంది. వయసు, భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రియులందరినీ ఆకట్టుకునేలా ఉంది.

1980-90 ల కాలంలో, అసాధారణ విజయాన్ని సాధించిన ఒక సాధారణ బ్యాంక్ క్యాషియర్ యొక్క ప్రయాణాన్ని ''లక్కీ భాస్కర్'' చిత్రంలో చూడబోతున్నాం. దుల్కర్ సల్మాన్ సినీ ప్రయాణంలో మరొక చిరస్మరణీయమైన చిత్రంలా నిలిచేలా దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాని మలుస్తున్నారు.

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

"లక్కీ భాస్కర్" చిత్రానికి అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు బంగ్లాన్ ఈ చిత్రం కోసం 80ల నాటి ముంబైని పునర్నిర్మించారు. ఈ చిత్రంలో ఆయన అద్భుత పనికి అవార్డులు అందుతాయని నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. ఛాయాగ్రాహకుడు నిమిష్ రవి కెమెరా పనితనం దర్శకుని ఊహకు ప్రాణం పోసింది. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. తెలుగు, మలయాళం, హిందీ మరియు తమిళ భాషల్లో సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.

తారాగణం: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: నిమిష్ రవి
కూర్పు: నవీన్ నూలి
రచన, దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్

Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments' unveil rocking Lucky Baskhar Title Track on actor's birthday!

Dulquer Salmaan, the highly regarded and respected Multi-lingual actor, is coming up with an extraordinary tale of a common man, Lucky Baskhar. Movie team unveiled title track of the film on the eve of actor's birthday on 28th July.

Taking us back to late 1980's and early 1990's, the song is addictive. With its beats, usage of instruments and on top of it all, legendary singer Usha Uthup's vocals make it a rocking nostalgic meal.

Lyricist Ramjaoggaya Sastry has written lyrics that are perfectly in sync with character of Dulquer Salmaan, as Lucky Baskhar, while also providing equal inspiration to the listeners.

Ace composer GV Prakash Kumar composed this song fusing Indi-rock of 1980's with current generation sensibilities. The track feels fresh and stands out from current tracks, making it an easy addition to music lovers playlists across different languages.

Blockbuster writer-director Venky Atluri is writing and directing the film with a penchant to deliver yet another memorable Dulquer Salmaan film, who already has a esteemed list of cult classics to his name.

Meenakshi Chaudhary is playing the leading lady role opposite Dulquer Salmaan. Suryadevara Naga Vamsi and Sai Soujanya of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, are producing the film. Srikara Studios is presenting it.

Ace Production designer Banglan recreated 80's Mumbai, then Bombay, for the film and his work would receive awards suggest makers. Adding beauty to every frame cinematographer Nimish Ravi, brought director's vision to life.

National Award winning editor Navin Nooli is editing the film. The highly anticipated movie shoot is wrapped recently and it is slated to release in Telugu, Malayalam, Hindi and Tamil languageson 7th September, worldwide..

Team wishes the Happiest Birthday to @dulQuer ❤️

Vibe with the ultimate 90’s Beats! ������������

#LuckyBaskharTitleTrack Full song out now! ������

A @gvprakash's musical magic ✨ ������
Legendary @singerushauthup‘s ������ Vocals
Lyrics by 'Saraswati Putra' @ramjowrites

@dulQuer #VenkyAtluri @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios @adityamusic

In Cinemas #LuckyBaskharOnSept7th ✨������

Facebook Comments
Dulquer Salmaan, Venky Atluri, Sithara Entertainments' unveil rocking Lucky Baskhar Title Track on actor's birthday!

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.