Vijay Antony's Poetic Action Film "Toofan" Pre-Release event held grandly, Theatrical Release On 2nd August
Hero Vijay Antony's latest movie, Toofan, is set for a grand theatrical release worldwide on August 2. Produced by Kamal Bora, D. Lalitha, B. Pradeep, and Pankaj Bora under the Infinity Film Ventures banner, this company has previously produced Raghavan and Hathya, also starring Vijay Antony. The film, directed by Vijay Milton, is a poetic action entertainer.
At the pre-release event held in Hyderabad, several notable individuals shared their thoughts:
Lyricist Bhashyashree said, "Toofan is hitting the theaters on August 2. It features a compelling screenplay, and we hope you all will appreciate it. The music will be a special highlight of the film, and we have also taken great care with the dubbing. I am grateful to Vijay Antony and director Vijay Milton for the opportunity to work on this movie."
Singer Saket Komanduri expressed his enthusiasm, saying, "I felt delighted after listening to the music composed by Acha Rajamani for Toofan. I thank the director for the opportunity to sing in this film. It is a movie that provides a true theatrical experience, so make sure to watch it in theaters on August 2."
Producer G. Dhanunjayan added, "We are grateful to director Karunakaran for attending our Toofan pre-release event. We are also pleased that Sathyaraj, who plays a special role in the movie, could join us. Toofan is a high-quality, commercial entertainment film. Along with its impressive music, it features strong dialogues. Vijay Antony's performance will captivate you, and the film includes numerous combination scenes with various artists. Our writer Bhashyashree has crafted excellent dialogues, and director Vijay Milton has incorporated all the elements to appeal to the audience. Watch Toofan in theaters on August 2—you will definitely enjoy it."
Music director Achu Rajamani said, "I want to thank the singers and lyricists who worked with me on Toofan. We put in maximum effort for this film. I am grateful to director Vijay Milton, hero Vijay Antony, and the entire team. I’m also pleased that Sathyaraj and my favorite director Karunakaran could join us. Watch the movie and let me know how you like the music."
Director Vijay Milton expressed his gratitude, saying, "I want to thank Sathyaraj and my favorite director Karunakaran for attending the pre-release event of Toofan. Thirty years ago, I worked as an assistant cameraman on Sathyaraj’s film. Now, I feel blessed to work with him as a director. Achu Rajamani’s music has elevated Toofan to another level. He has been a valued team member for many years. Vijay Antony has supported me throughout this film, and I am thankful to our producers Kamal, Pradeep, and Dhanunjayan. I hope you will watch Toofan in theaters on August 2."
Director Karunakaran commented, "Director Vijay Milton has been a good friend since my days as an assistant director. All his films are excellent, and every shot in Toofan is well-crafted. My friend Shashi directed Bicchagadu, and I hope Toofan will be as successful in Telugu as that film was."
Hero Vijay Antony said, "I want to thank Sathyaraj and Karunakaran for attending the pre-release event of Toofan. Sathyaraj played a significant role in this movie, and it would have been incomplete without him. Director Vijay Milton has crafted a great script, and dialogue writer Bhashyashree is my right hand. Making a big movie is challenging in today’s climate, but our producers Kamal, Pradeep, and Dhanunjayan believed in the content. The film is being promoted well and will be released in both Tamil and Telugu. I see the effort everyone is putting in. The quality and content of this film will ensure its success. Music director Achu Rajamani has enhanced the film with his background score. I was amazed by the music in the interval and climax scenes. We should collaborate on future projects. We will soon release a sneak peek of the movie to generate more interest. After Baahubali, the scale of Telugu films has increased, and I have developed a strong connection with Hyderabad and its audience. I hope Toofan will bring us even closer."
Actor Sathyaraj said, "My speech at the Tamil trailer launch of Toofan led to many memes. I joined the movie at the last minute, and director Vijay Milton designed my character with great care. My look and makeover are entirely new. Producer Dhanunjayan has a youthful appearance and is reserved when asked questions. Vijay Antony knows how to separate his personal and professional life and is a philosopher who faces life's challenges. Toofan is my favorite thriller. Please watch it in theaters on August 2 and share your feedback."
Actors - Vijay Antony, Sarath Kumar, Sathyaraj, Daali Dhanunjaya, Megha Akash, Murali Sharma, Prithvi Amber, Sharanya Ponvannan, Thalaivasal Vijay etc.
Technical team
Costumes - Shimona Stalin
Designer - Tandora Chandru
Action Choreographer - Supreme Sundar
Art Director - Arumugaswamy
Editing - Praveen KL
Music - Achu Rajamani, Vijay Antony
Dialogue Writer - Bhashya Shri
PRO - GSK Media (Suresh - Sreenivas)
Producers - Kamal Bora, D. Lalitha, B. Pradeep, Pankaj Bora
Written, Cinematography, Direction - Vijay Milton
ఘనంగా విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్" ప్రీ రిలీజ్ వేడుక, ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
మాటలు, పాటల రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ - "తుఫాన్" ఆగస్టు 2న థియేటర్స్ లోకి వస్తోంది. మంచి స్క్రీన్ ప్లే ఉన్న చిత్రమిది. మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అలాగే డబ్బింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. "తుఫాన్" సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారికి థ్యాంక్స్. అన్నారు.
సింగర్ సాకేత్ కొమండూరి మాట్లాడుతూ - "తుఫాన్" సినిమాకు అచ్చు రాజమణి గారు చేసిన మ్యూజిక్ విని హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాను ఆగస్టు 2న థియేటర్స్ లో చూడండి. థియేట్రికల్ ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది. అన్నారు.
నిర్మాత జి. ధనుంజయన్ మాట్లాడుతూ - మా "తుఫాన్" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన దర్శకుడు కరుణాకరన్ గారికి థ్యాంక్స్. ఈ మూవీలో ఒక స్పెషల్ రోల్ చేసిన సత్యరాజ్ గారు ఈ ఫంక్షన్ కు రావడం హ్యాపీగా ఉంది. "తుఫాన్" ఒక క్వాలిటీ, కమర్షియల్, ఎంటర్ టైన్ మెంట్ ఉన్న సినిమా. మ్యూజిక్ తో పాటు మంచి డైలాగ్స్ ఉంటాయి. విజయ్ ఆంటోనీ మిమ్మల్ని ఈ సినిమాతో ఆకట్టుకుంటారు. చాలా మంది ఆర్టిస్టుల కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. మా రైటర్ భాష్యశ్రీ మంచి డైలాగ్స్ రాశారు. ప్రేక్షకులకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ తో మా డైరెక్టర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాను రూపొందించారు. ఆగస్టు 2న థియేటర్స్ లో "తుఫాన్" చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి మాట్లాడుతూ - "తుఫాన్" సినిమాలో నాతో వర్క్ చేసిన సింగర్స్, లిరిసిస్ట్ లకు థ్యాంక్స్. మాగ్జిమమ్ ఎఫర్ట్స్ ఈ సినిమా కోసం పెట్టాం. డైరెక్టర్ విజయ్ మిల్టన్, హీరో విజయ్ ఆంటోనీ, ఇతర టీమ్ అందరికీ థాంక్స్. సత్యరాజ్ గారు, నా ఫేవరేట్ డైరెక్టర్ కరుణాకరన్ గారు ఇక్కడికి రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా చూసి నా మ్యూజిక్ ఎలా ఉందో చెప్పండి. అన్నారు.
డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ - "తుఫాన్" ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన సత్యరాజ్ గారు, నా ఫేవరేట్ డైరెక్టర్ కరుణాకరన్ గారికి థ్యాంక్స్. సత్యరాజ్ గారి సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్ గా 30 ఏళ్ల క్రితం పనిచేశాను. ఇప్పుడు ఆయనతో డైరెక్టర్ గా వర్క్ చేయడం బ్లెస్సింగ్ గా భావిస్తున్నా. అచ్చు రాజమణి గారి మ్యూజిక్ "తుఫాన్" సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కొన్నేళ్ల నుంచి ఆయన నా టీమ్ మెంబర్ గా ఉంటూ వస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా విజయ్ ఆంటోనీ గారు తన సపోర్ట్ నాకు ఇస్తూనే ఉన్నారు. మా ప్రొడ్యూసర్స్ కమల్, ప్రదీప్, ధనుంజయన్ గారికి థ్యాంక్స్. "తుఫాన్" సినిమాను థియేటర్స్ లో ఆగస్టు 2న చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
డైరెక్టర్ కరుణాకరన్ మాట్లాడుతూ - డైరెక్టర్ విజయ్ మిల్టన్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటినుంచి మంచి మిత్రుడు. ఆయన సినిమాలన్నీ బాగుంటాయి. "తుఫాన్" సినిమాలోనూ ప్రతి షాట్ బాగుంది. నా ఫ్రెండ్ శశి డైరెక్ట్ చేసిన బిచ్చగాడు సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలాగే తెలుగులో "తుఫాన్" సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ - "తుఫాన్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన సత్యరాజ్ గారికి, కరుణాకరన్ గారికి థ్యాంక్స్. సత్యరాజ్ గారు ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. ఆయన మా మూవీలో భాగమవకుంటే ఇది అసంపూర్తి అయ్యేది. డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు మంచి స్క్రిప్ట్ ఈ మూవీకి రాశారు. నా రైట్ హ్యాండ్ లాంటి పర్సన్ డైలాగ్ రైటర్ భాష్యశ్రీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ భారీ సినిమా చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అయినా కంటెంట్ మీద నమ్మకంతో మా ప్రొడ్యూసర్స్ కమల్, ప్రదీప్, ధనుంజయన్ గారు "తుఫాన్" సినిమా చేశారు. ఈ మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. వాళ్లు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను. ఈ మూవీలోని క్వాలిటీ, కంటెంట్ మనకు తప్పకుండా సక్సెస్ ఇస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి గారు తన బీజీఎంతో మా మూవీని మరింత ఎఫెక్టివ్ గా మార్చారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ లో మీ మ్యూజిక్ విని సర్ ప్రైజ్ అయ్యాను. మనం ఫ్యూచర్ లోనూ కలిసి మూవీస్ చేయాలి. త్వరలో ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేస్తాం. అది మూవీపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే. హైదరాబాద్ తో, తెలుగు ఆడియెన్స్ తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. "తుఫాన్" సినిమాతో మీకు మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నా. అన్నారు.
యాక్టర్ సత్యరాజ్ మాట్లాడుతూ - "తుఫాన్" సినిమా తమిళ ట్రైలర్ లాంఛ్ లో నా స్పీచ్ కు చాలా మీమ్స్ వచ్చాయి. ఈ మూవీలో లాస్ట్ మినిట్ నేను జాయిన్ అయ్యాను. నా క్యారెక్టర్ ను దర్శకుడు విజయ్ మిల్టన్ చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. నా లుక్, మేకోవర్ అంతా కొత్త ఉంటుంది. ప్రొడ్యూసర్ ధనుంజయన్ చిన్న పిల్లాడి ఫేస్ తో ఉంటారు. ఆయన అడిగితే ఏదీ కాదని చెప్పాలనిపించదు. విజయ్ ఆంటోనీ కి పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ను ఎలా వేర్వేరుగా చూసుకోవాలో తెలుసు. ఆయన ఒక ఫిలాసపర్. ఆయన జీవితంలో ఎలాంటి ఘటనలైనా ఎదుర్కొంటారు. నాకు నచ్చిన థ్రిల్లర్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఆగస్టు 2న థియేటర్స్ లో చూసి మీ రెస్పాన్స్ తెలియజేయాలని కోరుతున్నా. అన్నారు.
నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్స్ - షిమోనా స్టాలిన్
డిజైనర్ - తండోరా చంద్రు
యాక్షన్ కొరియోగ్రాఫర్ - సుప్రీమ్ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ - అరుముగస్వామి
ఎడిటింగ్ - ప్రవీణ్ కేఎల్
మ్యూజిక్ - అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ
డైలాగ్ రైటర్ - భాష్య శ్రీ
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
నిర్మాతలు - కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా
రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ - విజయ్ మిల్టన్
Photos Link - https://we.tl/t-LBKTTVV35F
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.