Social News XYZ     

I believe Operation Raavan will bring me closer to the audience: Rakshit Atluri

Rakshit Atluri, acclaimed for his roles in films like Palasa and Narakasura, is set impress in the upcoming movie "Operation Raavan," where Radhika Sarath Kumar will play a pivotal role. Produced by Dhyan Atluri, this new-age suspense thriller is directed by Venkata Sathya in Telugu and Tamil. Sangeerthana Vipin is the heroine. "Operation Raavan" is scheduled for a grand worldwide theatrical release on the 26th of this month. In a recent interview with Rakshit Atluri shared interesting things about the film:

  • "The concept of 'Operation Raavan' originated during the Covid-19 period. Following 'Palasa,' discussions at Sudhas Media centered around what kind of film would appeal to the young generation, leading to the decision to produce a thriller.

  • "I've always known my father's passion for cinema; he has been involved in story discussions since 'Palasa.' With confidence in his vision, we embarked on 'Operation Raavan.' While shooting 'Narakasura' and 'Sasivadana,' we meticulously developed the script until it was perfect before going into production.

     

  • "During filming, Radhika Sarath Kumar and Charan Raj appreciated my father's direction. It's not easy to satisfy everyone on set, which speaks volumes about his talent as a director. Radhika garu has been incredibly supportive throughout. Working under my father's direction has been a unique experience; not many get such an opportunity, and I'm grateful for it.

  • "To broaden the reach of 'Operation Raavan,' we've announced a special initiative where viewers who identify the character 'Psycho' in the film and message us on WhatsApp will receive a silver coin. I'll personally present these coins in cities like Vijayawada and Vizag. This isn't just a promise; we've minted a thousand silver coins for this purpose.

  • "The film 'Operation Raavan' doesn't intend to deliver a message; rather, it delves into the transformation of its central character, Psycho, due to circumstances rather than inherent traits. We've also explored the clash of ideologies on screen, a narrative seldom depicted. I'm confident audiences will be captivated, especially during the scene where Psycho visualizes his thoughts, which left me spellbound upon revisiting."

  • They say that after doing Palasa and Narakasura, I'm taking on all serious roles. I have that fear too. But I can confidently say that movies like "Operation Raavan" and "Sasivadane" will reinvent me. I believe these films will bring me closer to the audience.

  • In the movie "Operation Raavan," we've given the psycho character a mask. After referencing many designs, we selected the best one, which is painted to resemble wild animals like tigers and lions. This mask gives a distinctive appearance to the psycho character.

  • In "Operation Raavan," I portray the character of Anand Sriram, a TV reporter. I've always wanted to play a dual hero-villain role like this on screen, and you'll have to see if that's achieved in this movie. I sustained an injury during an action scene where I jumped onto a container in a bike sequence. I performed all the stunts myself.

  • The thrill of watching a movie like "Operation Raavan" can only be experienced in a theater. The immersive sound enhances the experience, making it clear that this film is crafted for the theatrical environment. While I won't claim I worked excessively hard on my acting in this movie, the action sequences demanded rigorous preparation. Additionally, "Operation Raavan" features a unique love story.

  • Acting alongside Radhika was an unforgettable experience. She effortlessly completed scenes in a single take; if unable to do so, she'd feel disappointed. Her commitment to acting discipline has been consistent since her earlier days in cinema. Her insights, though not advice per se, were inspiring. Radhika is known for her brevity in speech.

  • The movie includes a devotional song that imbues us with courage for our endeavors. I still aim to leverage the success of Palasa positively. Unfortunately, Covid struck two years after Palasa, and I remained committed to the fixed appearance required for Narakasura, limiting my ability to work on other films. However, we've meticulously crafted "Operation Raavan" and the upcoming "Sasivadane," hoping for favorable outcomes.

  • The background music (BGM) plays a crucial role in "Operation Raavan," provided by Vasanth. Watching our movie in a premium Atmos theater enhances the viewer's connection. Work on Palasa 2 is ongoing, and audiences can anticipate its release.

“ఆపరేషన్ రావణ్” సినిమా నన్ను హీరోగా ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తుంది - యంగ్ హీరో రక్షిత్ అట్లూరి

పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్ తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు హీరో రక్షిత్ అట్లూరి

  • కోవిడ్ టైమ్ లో “ఆపరేషన్ రావణ్” మూవీ ఆలోచన మొదలైంది. "పలాస" సినిమా తర్వాత మా సుధాస్ మీడియాలో ఎలాంటి సినిమా చేయాలనే చర్చ మొదలైనప్పుడు ఇప్పుడు యంగ్ జనరేషన్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా థ్రిల్లర్ మూవీ నిర్మిస్తే బాగుంటుందని అనిపించింది.

  • నాన్నగారికి సినిమాల మీద ఉన్న ప్యాషన్ నాకు తెలుసు. పలాస టైమ్ నుంచి ఆయన కథా చర్చల్లో పాల్గొనేవారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఈ మూవీ చేయాలనుకున్నాం. కథ అనుకున్న తర్వాత సెట్స్ మీదకు వెళ్లేందుకు కావాల్సినంత టైమ్ దొరికింది. అప్పుడు నేను నరకాసుర, శశివదనే రెండు సినిమాలు చేస్తున్నా. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసేప్పటికి “ఆపరేషన్ రావణ్” కథను బాగా డెవలప్ చేసేంత టైమ్ దొరికింది. పర్పెక్ట్ స్క్రిప్ట్ అయ్యాక సెట్స్ మీదకు వెళ్లాం.

  • షూటింగ్ టైమ్ లో నాన్నగారి డైరెక్షన్ పట్ల నాతో పాటు రాధిక, చరణ్ రాజ్ లాంటి వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారు. వాళ్లందరినీ సంతృప్తిపరచడం అంత సులువు కాదు. దర్శకుడిగా ప్రతిభ చూపిస్తేనే అది సాధ్యమవుతుంది. రాధిక గారు కూడా మా మూవీకి బాగా సపోర్ట్ చేశారు. సినిమా షూటింగ్ టైమ్ లో నాన్న గారే నన్ను గైడ్ చేసేవారు. నేను ఆయనకు చెప్పేంత అవకాశం ఉండదు. ఆయన అన్నీ తెలుసుకునే దర్శకత్వంలోకి వచ్చారు. తండ్రి దర్శకత్వంలో నటించే అవకాశం ఎంతమంది పిల్లలకు వస్తుందో తెలియదు. ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారని అనుకుంటా. మా ఫాదర్ డైరెక్షన్ లో నటించడం సంతోషంగా ఉంది.

  • మా “ఆపరేషన్ రావణ్” సినిమాను ఎక్కువ మంది ఆడియెన్స్ కు రీచ్ చేసేందుకు సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇస్తున్నామని ప్రకటించాం. సినిమా చూసి ఫస్టాఫ్ లోగా సైకో ఎవరన్నది కనిపెట్టి మేము ఇచ్చిన నెంబర్ కు వాట్సాప్ పంపిస్తే వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం. విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లో నా చేతుల మీదుగా ఈ కాయిన్ ఇస్తాను. కొందరు చెప్పినట్లు ఊరికే చెప్పడం కాదు. వెయ్యి సిల్వర్ కాయిన్స్ చేయించి పెట్టాం.

  • “ఆపరేషన్ రావణ్” సినిమాలో సందేశం ఏమీ ఉండదు. ఈ సినిమాలో సైకో చిన్నప్పటినుంచి అలా ఉండడు. కొన్ని పరిస్థితుల వల్ల అలా అవుతాడు. మనలో ఆలోచనల అంతర్యుద్ధాన్ని ఇప్పటిదాకా ఎవరూ స్క్రీన్ మీద చూపించలేదు. మా సినిమాలో అలాంటి ప్రయత్నం చేశాం. ఆ సీన్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది. నిన్ననే మళ్లీ సినిమా చూశాను. సైకో తన ఆలోచనలను విజువలైజ్ చేసే సీన్ చూస్తూ ఆడియెన్స్ ట్రాన్స్ లోకి వెళ్తారు.

  • పలాస, నరకాసుర చేసిన తర్వాత అన్నీ సీరియస్ రోల్స్ చేస్తున్నాననే అంటున్నారు. నాకూ ఆ భయం ఉంది. అయితే “ఆపరేషన్ రావణ్”, శశివదనే సినిమాలు నన్ను కొత్తగా చూపిస్తాయని చెప్పగలను. నన్ను ఆడియెన్స్ కు మరింత దగ్గర చేసే సినిమా అవుతుందని నమ్ముతున్నా.

  • “ఆపరేషన్ రావణ్” సినిమాలో సైకోకు ఒక మాస్క్ పెట్టాం. చాలా మాస్కులు రిఫరెన్సులు తీసుకుని ది బెస్ట్ సెలెక్ట్ చేశాం. మాస్క్ లో పులి, సింహం లాంటి క్రూర జంతువులను పోలినట్లు పెయింటింగ్ వేయించాం. సైకో క్యారెక్టర్ కు ఈ మాస్క్ యూనిక్ అప్పీయరెన్స్ ఇస్తుంది.

  • “ఆపరేషన్ రావణ్” చిత్రంలో నేను ఆనంద్ శ్రీరామ్ అనే టీవీ రిపోర్టర్ క్యారెక్టర్ చేస్తున్నాను. నాకు హీరో విలన్ ఇలా డ్యూయల్ రోల్ చేయాలని ఉంటుంది అయిత అది ఈ సినిమాతో తీరిందా లేదా అనేది స్క్రీన్ మీదే చూడండి. బైక్ సీక్వెన్స్ లో కంటెయినర్ మీదకు దూకే యాక్షన్ సీన్ లో గాయాలు అయ్యాయి. స్టంట్స్ నేనే స్వయంగా చేశాను.

  • “ఆపరేషన్ రావణ్” లాంటి థ్రిల్లర్ సినిమాను థియేటర్ లో చూస్తేనే ఆ ఫీల్ కలుగుతుంది. మంచి సౌండ్ ను ఎంజాయ్ చేయగలరు. ఈ సినిమా థియేటర్ ఎక్సీపిరియన్స్ కోసం చేసిందే. ఈ సినిమాలో నటించేందుకు బాగా కష్టపడ్డానని చెప్పలేను గానీ యాక్షన్ సీక్వెన్సులకు మాత్రం శ్రమించాల్సి వచ్చింది. “ఆపరేషన్ రావణ్” లో ఒక యూనిక్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది.

  • రాధిక గారితో నటించడం మర్చిపోలేని ఎక్సీపిరియన్స్. ఆమె సింగిల్ షాట్ లో ఏ సీనైనా చేసేవారు. అలా చేయలేకపోయినప్పుడు తనే బాధపడేవారు. అప్పుడు ఫిల్మ్ ఉన్నప్పటి నుంచి నటించిన డిసిప్లిన్ ఆమెలో ఇప్పటికీ ఉంది. సింగిల్ టేక్ లో చేయలేకపోతే బాధపడేవారు. ధనుష్ చాలా మంచి మూవీస్ చేస్తున్నాడని నాతో చెప్పేవారు. సలహాలు, టిప్స్ ఇవ్వడం కాదు గానీ ఆమెతో మాట్లాడటమే ఇన్స్ పైరింగ్ గా ఉండేది. చాలా తక్కువ మాట్లాడుతుంటారు రాధిక గారు.

  • ఈ మూవీలో ఓ భక్తి సాంగ్ ఉంటుంది. మనం చేయబోయే పనికి కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తుంది అనే కోణంలో ఆ పాటను పెట్టాం. పలాసతో వచ్చిన సక్సెస్ ను నేను ఇంకా బ్రైట్ గా యూజ్ చేసుకోవాల్సింది. అయితే పలాస తర్వాత రెండేళ్లు కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత నరకాసుర సినిమాకు ఒక ఫిక్స్డ్ గెటప్ లో ఉండిపోయి వేరే సినిమాలు చేయలేకపోయాను. లేకుంటే నా కెరీర్ ఇంకా బాగుండేది. అయితే ఇప్పుడు “ఆపరేషన్ రావణ్”, నెక్ట్స్ వస్తున్న శశివదనే సినిమాలు జాగ్రత్తగా చేశాం. అవి మంచి రిజల్ట్ ఇస్తాయని ఆశిస్తున్నా

  • “ఆపరేషన్ రావణ్” సినిమాకు బీజీఎం చాలా ఇంపార్టెంట్. వసంత్ గారు బీజీఎం ఇచ్చారు. మంచి అట్మాస్ థియేటర్ లో మా మూవీ చూస్తే బాగా కనెక్ట్ అవుతారు. పలాస 2 వర్క్ జరుగుతోంది. తప్పకుండా పలాస 2 ఉంటుంది.

I believe Operation Raavan will bring me closer to the audience: Rakshit Atluri

Facebook Comments
I believe Operation Raavan will bring me closer to the audience: Rakshit Atluri

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.