Social News XYZ     

Operation Raavan will impresse audience as a brand new suspense thriller: Director Venkata Satya

"Operation Raavan," directed by Venkata Satya, is making waves as a brand new suspense thriller. The film stars Rakshit Atluri and Radhika Sarathkumar in the lead role and is produced by Dhyan Atluri, marking a contemporary take on suspense in both Telugu and Tamil languages. Co-starring Sangeerthana Vipin, "Operation Raavan" is set for a grand theatrical release worldwide on the 26th of this month. Director Venkata Satya shared insights about the film in a recent interview:

  • "Mythology suggests that our thoughts themselves can be our enemies, and achieving salvation lies in understanding them. Practices like yoga and meditation aim to control our thoughts. In movies, villains typically engage in wrongful acts like land grabbing and drug trafficking, driven by their thoughts. I wanted to explore these underlying ideas through 'Operation Raavan.'"

  • "Drawing inspiration from the epic Ramayana, which is itself a thriller, our film incorporates references to characters like Garudman, Ravana, and Guhu. In 'Operation Raavan,' Ravana's disguise involves a mask, hence the title. We delve into the psychological aspects of characters, exploring why certain individuals exhibit extreme behaviors in relationships."

     

  • In today's world, we witness varied reactions from both boys and girls when faced with challenges. For instance, if a boy professes his love to a girl and she doesn't reciprocate, he might be labeled as "psycho". Similarly, if a girl interacts with another boy after accepting someone's love, she might face similar judgment. In our movie, we delve into the reasons behind such extreme behaviors and look forward to seeing how our concept resonates with the audience on screen. Success in the film industry requires both talent and divine intervention. Given the crowded release schedule on August 2nd, we have opted to move our release date to the 26th of this month.

  • The fact that directing my son Rakshit doesn't greatly affect me. He was a bit apprehensive during the fight scenes, and I worried about potential injuries. During action sequences involving ropes, it's crucial to ensure proper support. The fight master reassured me to step aside and let them handle it. Rakshit delivered a commendable performance. Recently, we released a single-shot poem by Karuna Sri from our movie, which Rakshit performed admirably. NTR's performances in mythological roles are remembered to this day for their effectiveness on screen. Saravana Vasudevan composed excellent music for our film.

  • Radhika played a pivotal role in our film, and approaching her with the story was challenging. However, once on set, she followed my directions. She adjusted her hand movements promptly according to my instructions. Radhika considers herself a director's actress and values the director's satisfaction with the shot. Among all her films, she believes "Operation Raavan" will be the most memorable. Her character spans three different time frames, with Charan Raj's role also being crucial to the storyline.

  • Running a business is predictable; if the tea is brewed well, the customer will likely enjoy it. However, cinema is an art form where a painting admired by one might appear unimpressive to another. In business, there are guides and supporters, but such a safety net is absent in the film industry. Support in this industry often comes with strings attached, leading to complexities even after completing the film.

  • Directors like SS Rajamouli took bold steps with high-budget films like Baahubali and RRR, elevating Telugu cinema to international level and even winning Oscars. While some films are made with hundreds of crores, we managed to craft "Operation Raavan" with a modest budget of four to five crore rupees, ensuring high technical standards across all aspects.

  • We've announced a unique initiative: giving a silver coin to each of the thousand audience members who correctly identify the "psycho" character within an hour of our movie's start.

  • I completed "Operation Raavan" within the planned budget and schedule, aiming for completion within 30 to 40 days. Insights gleaned from books proved invaluable in my directorial journey, driven by a deep passion for the film industry. Directors like KV Reddy, Aadurthi Subbarao, Rajamouli, and Hollywood's Steven Spielberg inspire me greatly. Post-"Operation Raavan," I'll plan my next project, alongside continuing with projects like "Palasa 2". Our production aims to release one film annually.

సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ గా “ఆపరేషన్ రావణ్” సినిమా ఆకట్టుకుంటుంది - డైరెక్టర్ వెంకట సత్య

రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర విశేషాలను తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు వెంకట సత్య

  • మన ఆలోచనలే మన శత్రువులు అనేది పురాణాల్లోనే ఉంది. మన ఆలోచన మనం తెలుసుకోవడమే మోక్షమని చెబుతుంటారు. యోగా, ధ్యానం చేసేది మన ఆలోచనలని నియంత్రించుకోవడానికే. మనం సాధారణంగా సినిమాల్లో మన విలన్స్ భూ ఆక్రమణలు, డ్రగ్స్ అమ్మకం వంటి తప్పుడు పనులు, దౌర్జన్యం చేస్తుంటారు. ఇవన్నీ ఆ విలన్స్ యొక్క యాక్టివిటీస్. కానీ మేము ఆ పనులకు కారణమైన ఆలోచనలను విజువల్ గా చూపిస్తున్నాం. ఒక మనిషి తప్పు చేసిన ఒప్పు చేసినా దానికి ఆ ఆలోచనే కారణం. మనం ఏ పనిచేసినా ఆ పనికి ముందు ఆలోచనల్లో సంఘర్షణ జరుగుతుంది చేద్దామా వద్దా అనేది. అలాంటి ఆలోచనలకు తెరరూపమివ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా రూపొందించాను.

  • మన ఇతిహాసాల్లో రామాయణం ఒక థ్రిల్లర్. శ్రీరాముడు తనకు పట్టాభిషేకం జరుగుతుంది అనగా అడవులకు వెళ్లాల్సివస్తుంది. అక్కడి నుంచి రావణుడు సీతను అపహరిస్తాడు. ఎవరు అపహరించారో తెలియదు. ఆమెను వెతుక్కుంటూ శ్రీరాముడు వెళ్తాడు. ఇలా రామాయణం థ్రిల్లర్ లా అనిపిస్తుంది. “ఆపరేషన్ రావణ్”లోనూ రామాయణం రిఫరెన్స్ తీసుకున్నాం. గరుడ్మంతుడు, రావణుడు, గుహుడు ఇలాంటి పాత్రల ఇన్సిపిరేషన్ ఉంటుంది. రామాయణంలో రావణుడు మారువేషం వేసుకుని వచ్చాడు మా మూవీలో మాస్క్ పెట్టుకుని వచ్చాడు. అందుకే టైటిల్ కు “ఆపరేషన్ రావణ్” అని పెట్టాం.

  • ఇవాళ సమస్య వస్తే అబ్బాయిలు, అమ్మాయిలు ఎలా రియాక్ట్ అవుతున్నారనేది చూస్తున్నాం. ప్రేమించానని అబ్బాయి అమ్మాయికి చెబితే ఆమె ఒప్పుకోకుంటే సైకో అవుతున్నాడు, లవ్ యాక్సెప్ట్ చేశాక ఆ అమ్మాయి మరో అబ్బాయితో మాట్లాడితే సైకో అవుతున్నాడు. అసలు ఒక మనిషి సైకోగా ఎందుకు మారతాడు అనేది మా మూవీలో చూపిస్తున్నాం. స్క్రీన్ మీద మా ఐడియా ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అనేది చూసేందుకు వెయిట్ చేస్తున్నాం. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే దైవానుగ్రహం కావాలి. ఆగస్టు 2న ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఆ డేట్ నుంచి ఈ నెల 26వ తేదీకి రిలీజ్ మార్చుకున్నాం.

  • మా అబ్బాయి రక్షిత్ ను డైరెక్ట్ చేస్తున్నా అనే విషయం నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు. రక్షిత్ ఫైట్ సీన్స్ చేసేప్పుడు మాత్రం కొంచెం భయంవేసింది. ఎక్కడైనా గాయాలు అవుతాయేమో అని భయపడ్డాను. రోప్స్ మీద నుంచి యాక్షన్ సీక్వెన్సులు చేసినప్పుడు సపోర్టింగ్ రోప్స్ పెట్టమని దగ్గరుండి జాగ్రత్తలు చెప్పా. ఫైట్ మాస్టర్ నన్ను అక్కడినుంచి పంపించి మీరు వెళ్లండి సారు మేము చూసుకుంటాం అనేవారు. రక్షిత్ బాగా నటించాడు. రీసెంట్ గా మా మూవీ నుంచి కరుణ శ్రీ గారి ఒక పద్యం రిలీజ్ చేశాం. ఆ సాంగ్ సింగిల్ షాట్ గా రూపొందించాం. ఈ పాటలో రక్షిత్ బాగా పర్ ఫార్మ్ చేశాడు. మనం ఏదైనా ఓన్ చేసుకుని నటిస్తే స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వస్తుంది. ఎన్టీఆర్ గారు ఎన్నో పౌరాణికాల్లో పద్యాలు పాడుతూ చేశారు. ఆయన ఎంతో ఓన్ చేసుకుని నటించాడు కాబట్టే ఆ పాటలన్నీ ఇప్పటికీ గుర్తుండిపోయాయి. శరవణ వాసుదేవన్ మా మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు.

  • మా చిత్రంలో రాధిక గారు కీలక పాత్ర పోషించారు. ఆమెను అప్రోచ్ అయి కథ చెప్పడమే కష్టమైంది. కానీ సెట్స్ లోకి వచ్చాక డైరెక్టర్ గా నేను చెప్పినట్లు నటించారు. హ్యాండ్ మూవ్ మెంట్స్ ఆమె ఒకలా చేసేవారు నేను మరోలా చెబితే వెంటనే చేశారు. రష్ చూసి ఎలా ఉంది మేడమ్ అని అడిగితే నేను డైరెక్టర్స్ నటిని, మీకు షాట్ నచ్చితే చాలు అనేవారు. ఆమె చేసిన అన్ని సినిమాల్లో గుర్తుండిపోయే మూవీ “ఆపరేషన్ రావణ్” అవుతుంది. రిఫరెన్స్ గా ఆమె చేసిన కొన్ని సీన్స్ చెప్పుకుంటారు. మూడు టైమ్ ఫ్రేమ్స్ లో ఆమె క్యారెక్టర్ సాగుతుంది. చరణ్ రాజ్ క్యారెక్టర్ కూడా కీలకంగా ఉంటుంది.

  • నాకు బిజినెస్ ఉంది. దాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలం. టీ బాగా పెడితే అది తాగేవాళ్లకు నచ్చుతుంది. కానీ సినిమా ఆర్ట్ ఫామ్. మనకు బాగా నచ్చిన ఓ పెయింటింగ్ మరొకరికి చెత్త అనిపించవచ్చు. వ్యాపారరంగంలో ఏది ఎలా చేయాలో చెప్పేవాళ్లు, సపోర్ట్ చేసేవాళ్లు ఉంటారు. కానీ సినిమా రంగంలో అలాంటి సపోర్ట్ ఉండదు. ఒకవేళ ఎవరైనా సపోర్ట్ చేసినా వాళ్లు చివరకి ఎక్కడికి తీసుకెళ్తారో మీకు తెలుసు. సినిమా తీయడం కంటే దాన్ని రిలీజ్ చేయడమే పెద్ద టాస్క్ గా మారింది.

  • రాజమౌళి గారి లాంటి దర్శకులు డేర్ స్టెప్ వేసి భారీ బడ్జెట్ తో బాహుబలి , ఆర్ఆర్ఆర్ లాంటి మూవీస్ చేయకుంటే ఈ రోజు తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లి ఆస్కార్ అందుకునేది కాదు. వందల కోట్లతో సినిమా చేసేవారున్నారు. మేము నాలుగైదు కోట్ల రూపాయలతో మూవీ చేశాం. టెక్నికల్ గా అన్ని క్రాఫ్టులు బాగా వచ్చేలా చూసుకున్నాం.

  • మా సినిమా ప్రారంభమైన గంటలోపు సైకో ఎవరన్నది కనిపెడితే ఆ ప్రేక్షకుడికి సిల్వర్ కాయిన్ ఇస్తామని ప్రకటించాం. అలా వెయ్యిమందికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం.

  • నేను “ఆపరేషన్ రావణ్” సినిమాను అనుకున్న బడ్జెట్ లో అనుకున్న డేట్స్ లోపే రూపొందించాను. 30 నుంచి 40 రోజుల్లో తీయాలనుకున్నాను తీశాను. కొన్ని బుక్స్ నుంచి నేర్చుకున్న విషయాలు దర్శకుడిగా ఉపయోగపడ్డాయి. సినీ రంగం మీద ఇష్టంతోనే దర్శకుడిగా మారాను. కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, రాజమౌళి, హాలీవుడ్ లో స్టీవెల్ స్పీల్ బర్గ్ ..వీళ్లు నా ఫేవరేట్ డైరెక్టర్స్. ఈ సినిమా ఫలితం తర్వాత నెక్ట్ మూవీ ప్లాన్ చేస్తాను. పలాస 2తో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాం. ఏడాదికి మా సంస్థ నుంచి ఒక సినిమా తప్పకుండా వస్తుంది.

Operation Raavan will impresse audience as a brand new suspense thriller: Director Venkata Satya

Facebook Comments
Operation Raavan will impresse audience as a brand new suspense thriller: Director Venkata Satya

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.