సౌత్ క్వీన్ త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతోన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘బృంద’ ట్రైలర్ విడుదల... ఆగస్ట్ 2 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్
Trailer Link:
https://www.instagram.com/reel/C9rDmIhx9Z-
అమ్మాయిలు పురుషాధిక్య ప్రపంచంలో రాణించటం కష్టం. అయితే కొందరు మాత్రం అలాంటి కష్ట నష్టాలకోర్చి తమదైన ముద్రను వేస్తుంటారు. అలాంటి అరుదైన అమ్మాయే బృంద. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎస్సైగా చేరిన బృంద సమస్యలను చేదించటానికి ప్రయత్నిస్తుంది. అయితే అవి గిట్టని పైఅధికారులు ఆమెను సూటి పోటీ మాటలతో బాధ పెడుతుంటారు. అనుకోకుండా ఓ కేసు విషయంలో ఆమెను సస్పెండ్ కూడా చేస్తారు. అసలు బృందను డ్యూటీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు.. ఆమెకు ఎదరైన సవాలేంటి? అనే విషయం తెలియాలంటే ‘బృంద’ అనే తెలుగు వెబ్ సిరీస్ చూడాల్సిందే.
సౌత్ క్వీన్‌గా అందరూ అభిమానంతో పిలుచుకునే స్టార్ హీరోయిన్ త్రిష మొట్ట మొదటిసారి ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టారు. అది కూడా తెలుగు వెబ్ సిరీస్ కావటం విశేషం. సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో రూపొందిన ఈ సిరీస్ తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లోనూ ఆకట్టుకోనుంది. ఈ సందర్భంగా ఆదివారం ‘బృంద’ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే...
‘‘
తొమ్మిదేళ్ల నుంచి ఏమైయ్యారు మీరంతా.. నేను లేకుండా ఈ కేసుని మీరు సాల్వ్ చేస్తామనుకుంటున్నారా! చెయ్యండి.. చెయ్యండి చూద్దాం...అని బృంద తన తోటి అధికారితో కోపంగా అంటుంది. దీంతో ప్రారంభమైన బృంద ట్రైలర్‌లో ఆమె పనిచేసే చోట ఎదుర్కొనే అవమానాలను, సూటిపోటి మాటలను సన్నివేశాల రూపంలో చక్కగా చూపించారు.
మరో కోణంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చీకటి పడిన తర్వాత జరిగే నర బలలు గురించి కూడా చూపించారు. మరో సన్నివేశంలో యాబై మందికి పైగా చనిపోయారని పోలీస్ అధికారులు మాట్లాడుకుంటూ తమ డిపార్ట్‌మెంట్‌కే అది బ్లాక్ మార్క్ అయ్యిందని అంటుంటారు.
ఇదే ట్రైలర్లో ఓ వ్యక్తిని అనుమానాస్పదంగా చూపించారు. బృంద హంతకుడిని వెతుకుటుంది. ఇంతకీ ఎవరా హంతకుడు.. పోలీస్ డిపార్ట్మెంట్‌కే షాకిచ్చిన ఘటన ఏది.. బృంద కేసుని ఎలా స్వాల్వ్ చేసింది’’ అనే తెలుసుకోవాలంటే ‘బృంద’ వెబ్ సిరీస్ చూడాల్సిందేనంటున్నారు రైటర్, డైరెక్టర్ సూర్య మనోజ్ వంగాల.
డైరెక్టర్ సూర్య మనోజ్ వంగాలతో కలిసి పద్మావతి మల్లాది దీనికి స్క్రీన్ ప్లేను సమకూర్చారు. శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్ని సకూరుస్తోన్నఈ సిరీస్‌కు అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, దినేష్ కె బాబు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇంకా ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సీరీస్‌లో కీలక పాత్రల్లో నటించారు.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.