Subject: Pindam producer Yeshwanth Daggumati’s Kalaahi Media earns a nomination in SIIMA 2024
'సైమా 2024'లో నామినేషన్ పొందిన 'పిండం' నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి
శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'పిండం' గత సంవత్సరం విడుదలై ప్రేక్షకుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది. కథాకథనాలు, సాంకేతిక నిపుణుల పనితీరు, నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, ఓటీటీ ద్వారా వివిధ భాషల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది.
దర్శకుడు సాయికిరణ్ దైదాతో పాటు, ఈ చిత్రంతో కళాహి మీడియా వ్యవస్థాపకుడు యశ్వంత్ దగ్గుమాటి నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేశారు. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, వాణిజ్య పరంగా మంచి విజయం సాధించిన 'పిండం' చిత్రం అవార్డు వేడుకలలో కూడా సత్తా చాటుతోంది. తాజాగా ప్రతిష్టాత్మక అవార్డు వేడుక 'సైమా 2024'లో ఉత్తమ తొలి చిత్ర నిర్మాత విభాగంలో నామినేషన్ పొందింది.
కమర్షియల్ చట్రానికి దూరంగా, మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించాలనే తపనతో, 'పిండం' వంటి వైవిధ్యమైన చిత్రంతో నిర్మాతగా పరిచయమయ్యారు యశ్వంత్ దగ్గుమాటి. సినిమా పట్ల ఆయనకున్న ఈ తపనే ప్రతిష్టాత్మక అవార్డు వేడుకలో నామినేషన్ పొందేలా చేసింది. ఈ వార్త చిత్ర బృందంలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఈ అవార్డును గెలుచుకుంటామని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత యశ్వంత్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సినిమా విడుదలకు ముందు బిజినెస్ ను పూర్తి చేయడమే కాకుండా, థియేటర్‌లలో ఎక్కువ కాలం చిత్ర ప్రదర్శన ఉండేలా చూసుకున్నారు.
యశ్వంత్ అమెరికాలోని కార్పొరేట్ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. అక్కడే దర్శకుడు సాయికిరణ్‌ను కలిసిన యశ్వంత్, ఆయనలోని ప్రతిభను గుర్తించి 'పిండం' సినిమాతో నిర్మాతగా మారారు. కార్పొరేట్ రంగంలో తను అలవరచుకున్న నాయకత్వ, పాలనా నైపుణ్యాలతో.. 'పిండం' చిత్రీకరణ సమయంలో ఎదురైన ఎన్నో సవాళ్లను ఎటువంటి తడబాటు లేకుండా ఎదుర్కొన్నారు. అలాగే సినిమాని ప్రేక్షకులకు విస్తృతంగా చేరువయ్యేలా ప్రణాళికను రూపొందించారు.
సైమా నామినేషన్ అనేది 'పిండం' చిత్ర బృందానికి ఖచ్చితంగా సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఈ వేడుకలో సినిమా సందడి చేయడానికి ముందే, 'పిండం' దర్శకుడు సాయికిరణ్‌తో మరో కొత్త సినిమా కోసం చేతులు కలుపుతున్నట్లు కళాహి మీడియా ప్రకటించింది. ఈ చిత్రాన్ని 2024 చివరి నాటికి సెట్స్ పైకి తీసుకెళ్ళాలని భావిస్తున్నారు. కథ ఇప్పటికే లాక్ చేయబడింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు మరియు ఇతర వివరాలకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
కళాహి మీడియా కోసం యశ్వంత్‌కు పెద్ద ప్రణాళికలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక అవార్డు నామినేషన్ యశ్వంత్ ను మరింత ఉత్తేజపరిచింది
Pindam producer Yeshwanth Daggumati’s Kalaahi Media earns a nomination in SIIMA 2024
Pindam, the horror thriller, helmed by Saikiran Daida, starring Sriram, Kushee Ravi, hit the news for the right reasons upon its release last year, earning acclaim for its top-notch execution and impressive production values. Besides putting up a good show at the box office, the film is continuing to win the love of audiences on OTT too, across languages.
Besides Saikiran Daida, the film also marked the production debut of Yeshwanth Daggumati, the founder of Kalaahi Media. Post its commercial and critical acclaim, Pindam is extending its good run at the award ceremonies too. Pindam has now deservedly earned a nomination at the prestigious awards event - SIIMA 2024, in the ‘Debutant Producer’ category.
Yeshwanth’s nomination at the awards event is a true testimony to his vision and the clary in his execution, despite Pindam being his first production. The team is naturally thrilled with the news and is hopeful of securing the award at the event. The producer braved all odds to seal Pindam’s pre-business deals before its release and ensured a long run for the film in theatres.
For the uninitiated, Yeshwanth has already made his presence felt in the corporate sector in the US, where he had met Pindam’s director Saikiran as well. The producer brought all his leadership, administrative skills (from the corporate sector) onto the set, handled many practical challenges during filming with clarity and set a plan in place for ensuring a wide reach for Pindam in theatres.
The SIIMA nomination is definitely an icing on the cake for team Pindam. Before the film gets to make a splash at the event, Kalaahi Media has confirmed that they will reunite with Pindam director Saikiran on a new project, which is expected to go on floors by the end of 2024. While the story has been locked already, an official announcement regarding the cast, crew and other details will be out soon.
Yeshwanth has big plans in place for Kalaahi and the award nomination has only energised him further.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.