Sony LIV drops the teaser of the upcoming crime-thriller series starring Trisha Krishnan releasing on 2nd August

త్రిష టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘బృంద’ క్రైమ్‌ థ్రిల్లర్‌ సీరీస్‌ టీజర్‌ విడుదల చేసిన సోనీ లివ్‌

Link: https://www.instagram.com/reel/C9Kmp70Sh5d

అంతా ముగిసిపోయిందనుకున్న సమయంలో, వెలుగు రేఖలా కనిపించింది ఆమె ఉనికి. అదెలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే, చెడు మీద మంచి సాధించిన విజయాన్ని ఆస్వాదించాలంటే మీరు సిద్ధం కావాల్సిందే. సోనీ లివ్‌లో ఆగస్టు 2న బృంద వెబ్‌సీరీస్‌ విడుదల కానుంది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో ఈ సీరీస్‌ విడుదల కానుంది.

సీరీస్‌ రచయిత, దర్శకుడు సూర్య మనోజ్‌ వంగాల మాట్లాడుతూ ‘సోనీ లివ్‌’ ద్వారా ప్యాన్‌ ఇండియా ఆడియన్స్‌ని బృంద సీరీస్‌తో పలకరించడానికి నాకు థ్రిల్‌గా ఉంది. బృంద ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతుంది. అనూహ్యమైన మలుపులు ఉత్కంఠ రేకెత్తిస్తాయి. బృంద సీరీస్‌ చూస్తున్నంత సేపు ఆసక్తిగా, ఉత్కంఠ రేకెత్తించేలా ఉండటమే కాదు, తాము అప్పటిదాకా నమ్ముతున్న నమ్మకాల మీద కూడా ఫోకస్‌ పెరుగుతుంది. అత్యద్భుతమైన, శక్తిమంతమైన, ఫీమేల్‌ లీడ్‌ నెరేటివ్‌ స్టోరీతో తెరకెక్కింది బృంద. ఈ సీరీస్‌ని డైరక్ట్ చేయడం ఆనందదాయకం. కథానుగుణంగా బృంద పాత్రలో అత్యద్భుతమైన లేయర్స్ ని జనాలు విట్‌నెస్‌ చేస్తారు. త్రిషగారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఇప్పటిదాకా ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలకు సరికొత్త నిర్వచనం చెప్పేలా ఉంటుంది" అని అన్నారు.

సూర్య మనోజ్‌ వంగాలా గ్రిప్పింగ్‌గా రాసి, అద్భుతంగా డైరక్ట్ చేసిన సీరీస్‌ బృంద. టాలెంటెడ్‌ సౌత్‌ క్వీన్‌ త్రిష కృష్ణన్‌ ఈ సీరీస్‌తోనే ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు. సూర్య మనోజ్‌ వంగాలా, పద్మావతి మల్లాది కలిసి రూపొందించిన స్క్రీన్‌ప్లే ఈ సీరీస్‌కి హైలైట్‌ కానుంది. శక్తికాంత్‌ కార్తిక్‌ సంగీతం అందించారు. అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైన్‌ చేశారు. దినేష్‌ కె బాబు సినిమాటోగ్రఫీ ఈ సీరీస్‌కి హైలైట్‌ కానుంది. అన్వర్‌ అలీ ఎడిటింగ్‌ గురించి తప్పకుండా సీరీస్‌ చూసిన అందరూ ప్రస్తావిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది టీమ్‌.

ఇంద్రజిత్‌ సుకుమారన్‌, జయప్రకాష్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌ సామి, రాకేందు మౌళితో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సీరీస్‌లో కీలక పాత్రల్లో నటించారు. డ్రామా, క్రైమ్‌, మిస్టరీ అంశాలతో... చూసినంత సేపూ ఒళ్లు గగుర్పొడిచేలా సాగుతుంది బృంద సీరీస్‌.

  • ప్రతి సెకనూ ఉత్కంఠ రేపే ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ని చూడటానికి ఆగస్టు 2 వరకు ఆగాల్సిందే. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీలో సోనీ లివ్‌లో అందుబాటులో ఉంటుంది ‘బృంద’ సీరీస్‌.
Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.