Nandamuri Kalyanram, NTR Arts Epic Fantasy Thriller Bimbisara 2 Announced, An Exciting Prequel is on the way

నందమూరి కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ ఎపిక్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ బింబిసార2... ఎగ్జయిటింగ్‌ ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌!

డైనమిక్‌ హీరో - నిర్మాత నందమూరి కల్యాణ్‌రామ్‌ ఇప్పుడు కెరీర్‌లో అద్భుతమైన ఫేజ్‌లో ఉన్నారు. అత్యంత వైవిధ్యమైన స్క్రిప్టులు సెలక్ట్ చేసుకుంటూ, తనదైన శైలిలో విలక్షణంగా దూసుకుపోతున్నారు. కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా బింబిసార.

బింబిసార పార్ట్ 2 ఉంటుందని మేకర్స్, యూనిట్‌ ఎప్పుడో ప్రకటించింది. మరి అప్పుడు ప్రకటించిన ఆ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే వార్త వచ్చేసింది. బింబిసార ప్రీక్వెల్‌ని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ అనౌన్స్ మెంట్‌ వచ్చేసింది. క్రియేటివ్‌ కాన్సెప్ట్ పోస్టర్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు. 'బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్‌ని చూడడానికి సిద్ధంగా ఉండండి' అంటూ ప్రీక్వెల్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్.

బింబిసార సినిమాలో కల్యాణ్‌రామ్‌ బింబిసారగా కనిపించారు. ప్రీక్వెల్‌లో అంతకు మించిన అద్భుతమైన కథను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్టు విషయంలో ప్రతి స్టేజ్‌లోనూ ఆ ఎగ్జయిట్‌మెంట్‌ను ఆస్వాదిస్తోంది యూనిట్‌. బింబిసార2కి ప్రాణం పోయడానికి అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్క్రీన్‌ మీద ఇప్పటిదాకా ఎవరూ చూడనటువంటి స్థాయిలో త్రిగర్తలను ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
'రొమాంటిక్‌' సినిమాను తెరకెక్కించిన అనిల్‌ పాదూరి బింబిసార2కి దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. అత్యంత భారీ స్థాయిలో, అత్యంత ఉన్నతమైన సాంకేతిక పనితనంతో కనువిందు చేసే దృశ్యకావ్యంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది బింబిసార2. అతి త్వరలో సినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Nandamuri Kalyanram, NTR Arts Epic Fantasy Thriller Bimbisara 2 Announced, An Exciting Prequel is on the way

Dynamic actor-producer Nandamuri Kalyan Ram is in the top form of his career. With a penchant for selecting unique scripts regardless of their eventual outcomes, Kalyan Ram has carved a niche as an actor who thrives on exploration and experimentation. Bimbisara happens to be the biggest-ever hit in Kalyan Ram's career.

The makers and the team announced that the film would have a part 2 even before the film’s release. After a long wait, today, on the occasion of Kalyan Ram's birthday, the makers officially announced the Bimbisara prequel. Along with a creative concept poster, the makers wrote, "GET READY TO WITNESS THE VIRTUE OF A LEGEND WHO RULED TRIGARTHALA AGES BEFORE BIMBISARA." These exciting words have significantly raised expectations for this prequel.

Kalyan Ram's portrayal of Bimbisara in the first film was highly praised, and the prequel promises to delve deeper into the character's backstory, providing a rich and engaging narrative. As preparations continue, the excitement is building, and it won't be long before audiences are transported back to the world of Trigarthala to witness the rise of a legend. The journey to bring Bimbisara 2 to life is well underway, and it promises to be a cinematic experience like no other.

Bimbisara 2 will be helmed by the talented director Anil Paduri of Romantic fame. The film will be bankrolled by the NTR Arts banner, and the makers are planning to produce it on a very large scale, ensuring that it meets high technical standards and delivers a visually stunning experience. With extensive pre-production work currently underway, the makers are planning to start shooting very soon.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%