హీరో నిఖిల్ రిలీజ్ చేసిన రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్.. జూలై 12న రానున్న చిత్రం
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి చలపతిరావు గారి దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. ఈ సినిమాను జూలై 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేయించారు.
‘కులం అంటే రక్తం కాదు.. పుట్టుకతో రావడానికి.. మనం చేసే పనే కులం’.., ‘మందు, సిగరెట్, పేకాట, బెట్టింగ్‌లకంటే పెద్ద వ్యసనం ఫెయిల్యూర్.. అది మనకు తెలియకుండానే మనం రాజీ పడి బతికేలా చేస్తుంది.. నువ్వింతే.. ఇంతకు మించి ఏం చేయలేవని చెప్పి బాస్ అయి కూర్చుంటుంది’.. ‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం.. కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠాలు చెబుతుంది’ అనే డైలాగ్స్ సినిమాలోని కథ, పాత్రల లోతుని చూపిస్తున్నాయి. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే ఫ్యామిలీ ఎమోషన్స్, మిడిల్ క్లాస్ కష్టాలను చూపించినట్టుగా అనిపిస్తోంది.
ఈ ట్రైలర్‌లో రాజా రవీంద్ర నటనను చూస్తే అందరినీ కదిలించేలా ఉంది. ఓ మిడిల్ క్లాస్ ఫాదర్, గొప్ప ఉపాధ్యాయుడిగా కనిపించినట్టు అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే పాటలు, ఆర్ఆర్ చక్కగా ఉన్నాయి. వినయ్ కొట్టి రాసిన డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. జూలై 12న ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.
నటీనటులు
రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ మొహమద్ ,మోహిత్ పేడాడ, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు ,విజయమ్మ , హర్షవర్ధన్, తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ - సాయిజా క్రియేషన్స్, నిర్మాతలు - ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి, దర్శకత్వం - పద్మారావు అబ్బిశెట్టి (పండు), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అరుణాచల మహేష్, మాటలు - వినయ్ కొట్టి, ఎడిటర్ - రాకేష్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ - ఎం. ఎబెనెజర్ పాల్, సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ స్వయంభు, పాటలు - రాంబాబు గోశాల, కడలి సత్యనారాయణ , అడిషనల్ రైటర్ - రఘు రామ్ తేజ్.కె, పి.ఆర్.ఒ - కడలి రాంబాబు, తుమ్మల మోహన్, చంద్ర వట్టికూటి
...................................
Hero Nikhil Launches Raja Raveendar Starrer 'Saarangadariya' Trailer Which Offers An Emotional Rollercoaster Ride... Movie Releasing On July 12
Raja Raveendar Starrer 'Sarangadariya' is being made on the Saija Creations banner with the blessings of Challapalli Chalapathi Rao garu, Produced by Umadevi, Sarath Chandra. Padmarao Abbisetti (Alias Pandu) is making his debut as a director. The film is getting released on July 12 in a grand manner. So far released Teaser, two songs garnered superb response from all quarters. One of them is the inspirational song 'Andukovaa..' crooned by legendary singer Chithra. The other two songs are 'Naa Kannule...', 'Ee Jeevithamante...' also ruling playlists. Today, hero Nikhil unveiled the Trailer of the film.
'Caste is not depends on blood.. which comes by birth... Caste depends on what we do in our life.', ' The biggest addiction in life is not alcohol, cigarettes, and betting. Biggest addiction is a failure. Without our knowledge it makes us compromise with what we have in our life. Failure dictates us that we are unfit for anything and controls us like a boss...', 'Here examinations are about the lessons we teach. But, life tests us first and then teaches us.'.. Dialogues like these depicts the depth in the story and characterisations of 'Sarangadariya'. Trailer showcases family emotions, and impressively captures the middle class family problems.
Raja Raveendar has unveiled another dimension as an actor and his performance will surely impress everyone going by the trailer. He played a weighted role which has shades of a middle class father and a great teacher. Background songs and recording enhances the emotional depth in the trailer. Vinay Kotti's dialogues are thought provoking. 'Sarangadariya' is getting released in theatres on 12th July.
Cast:
Raja Ravindra, Sreekanth Iyengar, Siva Chandu, Yashaswini, Moin, Mohith, Neela Priya, Kadambari Kiran, Manikandan Reddy, Anantha Babu, Vijayamma, Harshawardhan and others.
Technicians:
Banner - Saija Creations, Producers - Umadevi, Sarath Chandra Challapalli, Direction - Padmarao Abbisetty (Pandu), Executive Producer - Arunachala Mahesh, Dialogues - Vinay Kotti, Editor - Rakesh Reddy, Music Director - M Ebenezer Paul, Cinematography - Siddharth Swayambhu, Songs - Rambabu Gosala, Kadali Satyanarayana, Additional Writer - Raghu Ram Tej. K, P.R.O - Kadali Rambabu, Thummala Mohan, Chandra Vattikuti .
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.