Rana Daggubati Proudly Presents- Nivetha Thomas, Priyadarshi, Vishwadev, Gautami, and Bhagyaraj starrer, Suresh Productions, S Originals, Waltair Productions “35-Chinna Katha Kaadu” Heartwarming Teaser Launched

Rana Daggubati Proudly Presents- Nivetha Thomas, Priyadarshi, Vishwadev, Gautami, and Bhagyaraj starrer, Suresh Productions, S Originals, Waltair Productions "35-Chinna Katha Kaadu" Heartwarming Teaser Launched

"35-Chinna Katha Kaadu" is a new-age clean entertainer starring Nivetha Thomas, Priyadarshi, Vishwadev, Gautami, and Bhagyaraj in the lead roles. Produced by Rana Daggubati, Srujan Yarabolu, and Siddharth Rallapalli on Suresh Productions, S Originals, and Waltair Productions banners, the movie is written and directed by Nanda Kishore Emani.

The makers started the promotions by unveiling the teaser. The story of the movie is set in a village backdrop. Nivetha Thomas who got married to Vishwadev when she was young has a school-going boy. The boy who is poor in his studies fails to get the pass marks (35), leading to unrest in the family.

First and foremost, Nanda Kishore Emani wins brownie points for coming up with a relatable subject with heartwarming emotions. The emotions indeed are so pure. He made sure the narrative was equally entertaining and engaging. The dialogues are impactful.

Nivetha Thomas, Priyadarshi, Vishwadev, Gautami, and Bhagyaraj have come up with realistic performances, whereas the boy was also impressive. Niketh Bommi’s camera work deserves special mention, while Vivek Sagar’s background score uplifts the emotions. As the teaser promises, the film is poised to entertain all sections of the audience with clean entertainment with school episodes being a special attraction.

Adding to the visual appeal, the production design is by Latha Naidu and seamlessly edited by T C Prasanna.

The film "35-Chinna Katha Kaadu" will be released simultaneously in Telugu, Tamil and Malayalam languages on August 15th.

Cast: Nivetha Thomas, Priyadarshi, Vishwadev, Gautami, Bhagyaraj

Technical Crew:
Writer - Director: Nanda Kishore Emani
Producers: Rana Daggubati, Srujan Yarabolu, Siddharth Rallapalli
Banner: Suresh Productions, S Originals, Waltair Productions
Music: Vivek Sagar
DOP: Niketh Bommi
Editor: T C Prasanna
Dialogues: Nanda Kishore Emani, Prashanth Vignesh Amaravadhi
Production Designer: Latha Naidu
Publicity Designer: Shakthi Graphiste, Anish Penti
Executive Producer: N Sowmithri
Creative Producer: Shivani Dobhal
Lyrics: Kittu Vissapragada, Bharadwaj Gali
Costume Designer: Princi Vaidh
Line Producer: Vincent Praveen
PRO: Vamsi-Shekar
Digital: Haashtag Media

'35-చిన్న కథ కాదు' గ్రేట్ ఫిల్మ్. ఇది మనందరి కథ. అందరూ డెఫినెట్ గా రిలేట్ అవుతారు: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ - నివేతా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ "35-చిన్న కథ కాదు" హార్ట్ వార్మింగ్ టీజర్ లాంచ్

నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్."35-చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమాని రైటర్ డైరెక్టర్.

టీజర్‌ని విడుదల చేసి మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నడుస్తుంది. యంగ్ ఏజ్ లోనే విశ్వదేవ్‌ని పెళ్లాడిన నివేదా థామస్‌కి స్కూల్‌కి వెళ్లే అబ్బాయి ఉంటాడు. తను చదువులో పూర్. పాస్ మార్కులు (35) సాధించడంలో విఫలమవడంతో ఫ్యామిలీలో నిరాశకి దారితీసింది.

దర్శకుడు నంద కిషోర్ ఈమానీ హృదయాన్ని కదిలించే భావోద్వేగాలతో అందరూ రిలేట్ చేసుకునే సబ్జెక్ట్‌తో ప్రశంసలు అందుకున్నాడు. భావోద్వేగాలు చాలా ప్యూర్ గా వున్నాయి. అతను నెరేటివ్ కి సమానంగా ఎంటర్ టైన్మెంట్ ఉండేలా చూసుకున్నాడు. డైలాగ్స్ ఇంపాక్ట్ ఫుల్ గా వున్నాయి.

నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు, చిన్న బాబు కూడా ఆకట్టుకున్నాడు. నికేత్ బొమ్మి కెమెరా పనితనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎమోషన్ ని ఎలివేట్ చేసింది. విజువల్ అప్పీల్‌ యాడ్ చేస్తూ ప్రొడక్షన్ డిజైన్‌ను లతా నాయుడు అందించారు. టి సి ప్రసన్న బ్రిలియంట్ గా ఎడిట్ చేసారు.

టీజర్ ప్రామిస్ చేసినట్లుగా, స్కూల్ ఎపిసోడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ చిత్రం సిద్ధమైంది. "35-చిన్న కథ కాదు" చిత్రం ఆగస్టు 15న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. స్కూల్ లో వున్నప్పుడు 35 అనేది నాకు పెద్ద పర్వతం లాంటింది (నవ్వుతూ). నందు ఈ కథ చెప్పినపుడు నాకు నేను గుర్తుకు వచ్చాను, మా అమ్మ గుర్తుకొచ్చింది. నా కోసం మా అమ్మపడిన కష్టం గుర్తుకు వచ్చింది. ఈ కథ వెళ్లి మా అమ్మకు చెప్పాను. ఇది మన అందరి కథ. చాలా మంది లైఫ్ ఇలా వుంటుంది. ఈ కథని అందరూ రిలేట్ చేసుకుంటారు. చాలా కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి. కానీ ఇలాంటి ప్యూర్ హార్ట్ వార్మింగ్ స్టొరీలు రావడం చాలా అరుదు. ఇలాంటి మంచి కథలు సురేష్ ప్రొడక్షన్ లో చేయాలనేది మా ఉద్దేశం. విశ్వ పరేషాన్ సినిమాతో వచ్చారు. సినిమాల పట్ల తనకి చాల పాషన్ వుంది. నివేదా కి కథ నచ్చేతే ఆ కథతోనే వుంటుంది. ప్రోడక్ట్ అద్భుతంగా రావడానికి చాలా సపోర్ట్ చేస్తుంది. తను ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా అనందంగా వుంది. దర్శి ఫెంటాస్టిక్ యాక్టర్. ఇందులో తన లుక్ చూసిన వెంటనే మా మ్యాథ్స్ టీజర్ గుర్తుకొచ్చారు. నందు వెరీ వెరీ ప్యూర్ సోల్. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు తను ఇంకెన్నో చేస్తాడు. కిడ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. సృజన్ చాలా కాన్ఫిడెంట్ గా వుంటారు. చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్. ఆగస్ట్ 15న ఈ సినిమా రావడం చాలా అనందంగా వుంది. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. థియేటర్స్ లో సినిమా చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.

హీరోయిన్ నివేదా థామస్ మాట్లాడుతూ..నా కెరీర్ లో బెస్ట్ అంతా రామానాయుడు స్టూడియోస్ లోనే జరిగింది. బ్రోచే సినిమా కూడా ఇక్కడే జరిగింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు మొదట పరిచయమైయింది రానా గారు. ఆయన ప్రతి సినిమాకి, యాక్టర్, టెక్నిషియన్ కి అద్భుతంగా సపోర్ట్ చేస్తారు. 35-చిన్న కథ కాదు నా కెరీర్ లో చాలా స్పెషల్ ఫిల్మ్. ఇందులో మదర్ రోల్ లో కనిపిస్తా. ఇప్పటివరకూ నేను చేసిన క్యారెక్టర్స్ లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ఇది. ఈ టీజర్ తో సినిమా వరల్డ్ ని పరిచయం చేశాం. సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్. ఇలాంటి మంచి కథలు రావడం చాలా అనందంగా వుంది' అన్నారు.

యాక్టర్ విశ్వదేవ్ మాట్లాడుతూ.. ముందుగా రానా గారికి థాంక్ యూ. ఆయన సపోర్ట్ ఇలానే వుండాలని కోరుకుంటున్నాను. 35 మనసుని కదిలించే సినిమా. చాలా కాలం గుర్తుండిపోయే సినిమా. నివేదా థామస్ లాంటి యాక్టర్ తో పని చేయడం గ్రేట్ ఎక్స్ పీరియన్స్. సృజన్ , సిద్ధార్థ్ గారికి థాంక్ యూ' అన్నారు.

డైరెక్టర్ నంద కిషోర్ ఈమాని మాట్లాడుతూ.. 35-చిన్న కథ కాదు లాంగ్ జర్నీ, రానా గారికి, టీం అందరికీ థాంక్ యూ. ఇది పెద్ద సినిమా. మున్ముందు ఈవెంట్స్ లో సినిమా గురించి చాలా మాట్లాడదాం. ఈవెంట్ కి వచ్చిన అందరికీ థాంక్ యూ' అన్నారు.

నిర్మాత సృజన్ యరబోలు మాట్లాడుతూ.. టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. రానా గారు , సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళతాయి. ఆ మైల్ స్టోన్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. ఇది చిన్న సినిమ కాదు చాలా పెద్ద సినిమా. సినిమా చూస్తే మీకు అర్ధమౌతుంది. గొప్ప అనుభూతిని ఇస్తుంది. చాలా ప్రౌడ్ గా ఫీలయ్యే కథ. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఇది మాకు మైల్ స్టోన్ మూవీ గా నిలిచిపోతుంది.' అన్నారు. చిత్ర యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది.

నటీనటులు : నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: నంద కిషోర్ ఈమాని
నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి
బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్
సంగీతం: వివేక్ సాగర్
డీవోపీ: నికేత్ బొమ్మి
ఎడిటర్: టి సి ప్రసన్న
డైలాగ్స్: నంద కిషోర్ ఈమాని, ప్రశాంత్ విఘ్నేష్ అమరావతి
ప్రొడక్షన్ డిజైనర్: లతా నాయుడు
పబ్లిసిటీ డిజైనర్: శక్తి గ్రాఫిస్ట్, అనీష్ పెంటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్ సౌమిత్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శివాని దోభాల్
లిరిక్స్: కిట్టు విస్సాప్రగడ, భరద్వాజ్ గాలి
కాస్ట్యూమ్ డిజైనర్: ప్రిన్సి వైద్
లైన్ ప్రొడ్యూసర్: విన్సెంట్ ప్రవీణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.