The “Kalavedika NTR Film Awards” ceremony, organized by Kalavedika and Raghavi Media, was held grandly today.

కళావేదిక, రాఘవి మీడియా - ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు గారి పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు "కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్" 2023, హైదరాబాద్ లోని హోటల్ "దసపల్లా" లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరిగింది. "కళావేదిక" (R.V.రమణ మూర్తి గారు), " రాఘవి మీడియా" ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహింపబడింది. ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దీపం వెలిగించి ఎన్టీఆర్ గారి పాటలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి మోహన రూప గారు, మురళి మోహన్ గారు, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ కే. ఎల్. దామోదర్ ప్రసాద్ గారు, కార్యదర్శి శ్రీ టి. ప్రసన్నకుమార్ గారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మాదాల రవి గారు మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మురళీమోహన్ గారు మాట్లాడుతూ : ఎన్టీఆర్ గారి పేరు పైన అవార్డ్స్ పెట్టడం చాలా ఆనందకర విషయం. ప్రజలకు సేవ చేయడం కోసం పార్టీ పెట్టి 9 నెలల్లో ఘనవిజయాన్ని అందుకున్న నాయకుడు కూడా ఎన్టీఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం అదేవిధంగా పేదలకు ఉత్తమ చికిత్స అందించడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్న ఏకైక మగాడు మన తెలుగోడు ఎన్టీఆర్ గారు. అదేవిధంగా సినీ ఇండస్ట్రీ నుంచి మేమందరం ముందుకు వస్తాము అంటే ఇందిరాగాంధీని ఎదుర్కొని నిలబడటం అంత తేలిక కాదు అని చెప్పిన ఏకైక మగాడు ఎన్టీఆర్ గారు. నాకు ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

నందమూరి మోహన కృష్ణ గారు మాట్లాడుతూ : ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చిత్రరంగమైన రాజకీయరంగమైన సంచలనానికి మారుపేరు. సినిమా రంగంలో ఆయన వేయని పాత్ర అంటూ ఏదీ లేదు. ప్రతి నాయకుడు పాత్రతో కూడా మెప్పించారు. అదేవిధంగా రాజకీయ రంగంలో పార్టీని పెట్టి తొమ్మిది నెలల్లో ఘనవిజయాన్ని సాధించారు. పేదల కోసం అదేవిధంగా ఆడవారి హక్కుల కోసం పోరాడి వారి హక్కులను వారికి అందించారు. అలాంటి మహానుభావుడికి కొడుకుగా పుట్టడం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం గా భావిస్తున్నాను. ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కళావేదిక వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత, ప్రొడ్యూసర్ గణపతి రెడ్డి గారు మాట్లాడుతూ : ఎన్టీఆర్ గారి పేరు మీద ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం, ఈ ఈవెంట్ లో నేను కూడా స్పాన్సర్ గా ఉండడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. గతంలో కళావేదిక వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కళావేదిక తో పాటు రాఘవే మీడియా మధు గారు భాగమవడం. అదేవిధంగా ఈవెంట్ ఇంత ఘనంగా జరిపించడం చాలా మంచి విషయం. కళావేదిక, రాఘవి మీడియా సంయుక్తంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని, ఎన్టీఆర్ గారి ఖ్యాతి పెంచాలని, వాటిలో నేను నేను భాగం అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

నందమూరి మోహన్ రూప గారు మాట్లాడుతూ : తెలుగు జాతి కోసం పుట్టి తెలుగువారి ఆత్మగౌరవం కోసం బ్రతికిన వ్యక్తి తెలుగువారు దేవుడిగా భావించే నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ గారు ఒక లెజెండ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ గర్వంగా తెలుగు వాళ్ళం అని చెప్పుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ గారి వల్లే. ఆయన అప్పట్లో చేసినటువంటి మల్లీశ్వరి, పాతాళ భైరవి సినిమాలతోనే ఆ రోజుల్లోనే పాన్ ఇండియా స్టార్. కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు పాత్రలు పోషించి అఖండ విజయం అందుకున్న సినిమా దానవీరశూరకర్ణ. ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు తనదైన శైలిలో నటిస్తూ ఇటీవల కాలంలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న హీరోగా నిలబడ్డారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కళావేదిక భువన గారు మరియు రాఘవ మీడియా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.

కళావేదిక మరియు రాఘవి మీడియా అధినేతలు మాట్లాడుతూ : ఈవెంట్ కి పిలవగానే విచ్చేసిన మురళీమోహన్ గారికి, నందమూరి మోహన్ కృష్ణ గారికి, మోహన్ రూపా గారికి మరియు ఇతర ప్రముఖులకి ధన్యవాదాలు. అదేవిధంగా ఈవెంట్ ఎంత బాగా జరగడానికి మాకు సహకరించిన మా స్పాన్సర్స్ వేగ జువెలర్స్ నవీన్ గారు, మణిదీప్ గారు, కళ్యాణ్ గారు, అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్ గణపతి రెడ్డి గారు, క్యాపిటల్ 45 గోల్డెన్ క్రెస్ట్ శోభన్ బాబు గారు, శ్రీని ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీను గారు, పవన్ ఈవెంట్స్ పవన్ గారు, లీడ్ స్పేస్ మరియు డి ఆర్ నెట్ వారికి సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.

ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ గెలుచుకున్న విజేతలు - ఎన్టీఆర్ ఫిలిం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గెలుచుకున్నారు మురళీమోహన్ గారు మరియు నందమూరి మోహన్ కృష్ణ గారు, ఉత్తమ కథానాయకుడిగా బేబీ చిత్రానికి ఆనంద్ దేవరకొండ, ఉత్తమ దర్శకుడిగా బేబీ చిత్రానికి సాయి రాజేష్, ఉత్తమ నిర్మాతగా భగవంతు కేసరి చిత్రానికి సాహు గారపాటి, ఉత్తమ విలన్ గా యక్షిని వెబ్ సిరీస్ నుంచి అజయ్, ఉత్తమ నూతన దర్శకుడిగా డాక్టర్ దసరా చిత్రానికి శ్రీకాంత్ ఓదెల, ఉత్తమ నూతన నటుడిగా తిరువీర్ కి ఎన్టీఆర్ ఫిలిం పురస్కారాలను గెలుచుకున్నారు. అవార్డులు గెలుచుకున్న వారికి శ్రీ మురళీమోహన్ గారు మరియు నందమూరి మోహన్ కృష్ణ గారి చేతుల మీదగా అందజేయడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ లిరిక్ రైటర్ గా కాసర్ల శ్యామ్ గారు, బెస్ట్ రైటర్ గా కళ్యాణ్ చక్రవర్తి గారు, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా రఘుకుంచె గారు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ ఫిమేల్ గా శరణ్య ప్రదీప్ గారు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా హర్షవర్ధన్ గారు, బెస్ట్ మేల్ సింగర్ గా రాహుల్ సిప్లిగంజ్ గారు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా దాశరధి శివేంద్ర గారు, బెస్ట్ ఆర్ డైరెక్టర్ గా నాగేంద్ర గారు, బెస్ట్ కమెడియన్ గా రచ్చ రవి గారు, బెస్ట్ ఎడిటర్ గా చోటా కే ప్రసాద్ గారు, బెస్ట్ ఫిమేల్ సింగర్ గా మంగ్లీ గారు, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా విజయ్ పొలాకి గారు, బెస్ట్ డెబ్యు మ్యూజిక్ డైరెక్టర్ గా ధ్రువన్ గారు, బెస్ట్ డెబ్యు సపోర్టింగ్ యాక్టర్ గా లక్ష్మణ్ మీసాల గారు, బెస్ట్ నెగటివ్ సపోర్టింగ్ రోల్ లో సాహితీ దాసరి గారు, స్పెషల్ జ్యూరీ ప్రొడ్యూసర్ గా గౌరీ కృష్ణ గారు, బెస్ట్ డెప్ యు రైటర్ గా అజ్జు మహకాళి గారు, బెస్ట్ రివ్యూ కమిటీ అనగా లక్ష్మణ్ టేకుమూడి గారు, స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ గా త్రినాథ్ గారు ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ ని అందుకోవడం జరిగింది.

The "Kalavedika NTR Film Awards" ceremony, organized by Kalavedika and Raghavi Media, was held grandly today.

The event took place at the Daspalla Hotel in Hyderabad, honoring distinguished personalities from various sectors of the film industry in the name of the legendary actor Padma Shri Dr. Nandamuri Taraka Rama Rao.
The event began with a prayer to Lord Ganesha, followed by the lighting of the ceremonial lamp and NTR's songs. Notable guests included Nandamuri Mohan Krishna, Nandamuri Mohan Roopa, Murali Mohan, K.L. Damodar Prasad (President of the Telugu Film Producers Council), T. Prasanna Kumar (Secretary), MAA Vice President Madala Ravi, and several other prominent figures.

Murali Mohan, speaking on the occasion : Expressed his joy at the awards being named after NTR. He reminisced about his close relationship with NTR, recalling how NTR gave him the opportunity to play his brother in the film "Annadammula Anubandham," which led to people recognizing him as NTR’s brother. Murali Mohan praised NTR’s political achievements, including founding a party and achieving great success within nine months, introducing welfare schemes like selling rice at two rupees per kilogram, and providing excellent medical care to the poor. He emphasized NTR's bravery in standing up to Indira Gandhi and expressed his gratitude for receiving the NTR Lifetime Achievement Award.

Nandamuri Mohan Krishna said : The three letters "NTR" as synonymous with sensational achievements in both cinema and politics. He praised NTR’s versatile roles in films and his swift success in politics, fighting for the rights of the poor and women. Mohan Krishna expressed his pride in being NTR’s son and congratulated Kalavedika for organizing the event.

Arunasree Entertainments head and producer Ganapathi Reddy said: I am very happy and proud to give film awards in the name of NTR and to be a sponsor in this event. In the past, Kalavedika has done many good programs. Now along with Kalavedika Raghave Media Madhu garu is joining. Similarly, it is a good thing that the event is held in such a grand manner. He wish that Kalavedika and Raghavi Media should jointly do many more programs and increase the fame of NTR and he also want to be a part of the programs.

Nandamuri Mohan Roopa said : She highlighted NTR's legacy as a revered figure who lived for the pride of Telugu people. She acknowledged NTR’s global impact, his roles in iconic films, and his status as a legendary actor. She also praised Nandamuri Balakrishna, NTR’s successor, for his recent successes and congratulated Kalavedika and Raghavi Media for the grand event.

Heads of Kalavedika and Raghavi Media said: Thanks to Murali Mohan garu, Nandamuri Mohan Krishna garu, Nandamuri Mohan Rupa garu and other dignitaries who attended the event. Similarly, we would like to thank our sponsors Vega Jewelers Naveen Garu, Manideep Garu, Kalyan Garu, Aruna Sri Entertainments Ganapathy Reddy garu, Capital 45 and Golden Crest Shobhan Babu garu, Srini Infra Developers Srinu garu, Pawan Events Pawan garu, Lead Space and D R Net for their support.

  • NTR Film Lifetime Achievement Award: Murali Mohan, Nandamuri Mohan Krishna
  • Best Actor: Anand Deverakonda for "Baby"
  • Best Director: Sai Rajesh for "Baby"
  • Best Producer: Sahu Garapati for "Bhagavanth Kesari"
  • Best Villain: Ajay for the web series "Yakshini"
  • Best New Director: Srikanth Odela for "Dasara"
  • Best New Actor: Thiruveer
  • Best Lyricist: Kasarla Shyam
  • Best Writer: Kalyan Chakravarthy
  • Best Music Director: Raghu Kunche
  • Best Supporting Actress: Sharanya Pradeep
  • Best Supporting Actor: Harshavardhan
  • Best Male Singer: Rahul Sipligunj
  • Best Cinematographer: Dasharathi Sivendra
  • Best Art Director: Nagendra
  • Best Comedian: Racha Ravi
  • Best Editor: Chota K. Prasad
  • Best Female Singer: Mangli
  • Best Choreographer: Vijay Polaki
  • Best Debut Music Director: Dhruvan
  • Best Debut Supporting Actor: Laxman Meesala
  • Best Negative Supporting Role: Sahithi Dasari
  • Special Jury Producer: Gauri Krishna
  • Best Debut Writer: Ajju Mahakali
  • Best Review Committee: Laxman Tekumudi
  • Special Jury Director: Trinath

Each award was presented by Murali Mohan and Nandamuri Mohan Krishna, with congratulations extended to all the organizers for the successful event.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%