Social News XYZ     

Filmmaker Sanjeev Reddy Directs Anti-Drugs Ad Created by the Telangana Government

The Telangana government is taking more robust measures for a drug-free society. In this effort, Telangana has prepared an anti-drug ad for the Anti-Narcotics Bureau. The ad, starring Megastar Chiranjeevi, is directed by young director Sanjeev Reddy. This ad was recently released by Chief Minister Revanth Reddy and executed by Tamada Media. Megastar Chiranjeevi tweeted about the ad and expressed his happiness to be a part of the anti-drug campaign. This ad will be shown in every theater in Telangana starting next week.

In the ad, Sanjeev Reddy impressively portrays how youth are ruining their promising futures due to drug addiction. He effectively showcases the support provided by the Telangana Anti-Narcotics Bureau to those addicted to drugs while also highlighting the actions taken against drug sellers and buyers.

Director Sanjeev Reddy responded: "I am a part of Telangana government's anti-drug theatrical ad, partnered with Padma Vibhushan Megastar Chiranjeevi, whose films I grew up watching and which inspired my desire to enter the film industry," he said.

 

Sanjeev Reddy, known for directing the film "ABCD" starring Allu Sirish and the web series "Aha Naa Pellanta" with Raj Tarun, is currently working on the movie "Santana Praptirastu" featuring Vikrant and Chandini Chowdary.

తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన యాంటీ డ్రగ్స్ యాడ్ కు దర్శకత్వం వహించిన సంజీవ్ రెడ్డి

డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో కోసం యాంటీ డ్రగ్ యాడ్ ను తయారుచేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ యాడ్ కు దర్శకత్వం వహించారు యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. ఈ యాడ్ ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిలీజైంది. ఈ యాడ్ ను టామాడ మీడియా ఎగ్జిక్యూట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ గురించి ట్వీట్ చేస్తూ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం నుంచి ఈ యాడ్ ను తెలంగాణలోని ప్రతి థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు.

డ్రగ్స్ కు బానిస కావడం వల్ల యువత తమ బంగారు భవిష్యత్తు ఎలా పాడుచేసుకుంటున్నారో ఈ యాడ్ లో ఆకట్టుకునేలా తెరకెక్కించారు సంజీవ్ రెడ్డి. డ్రగ్స్ అమ్మేవారు, కొనేవారిపై చర్యలు తీసుకుంటూనే డ్రగ్స్ కు బానిసైన వారికి చేయూత అందించి, వారిని మళ్లీ మంచి మార్గంలో పెట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎలాంటి సపోర్ట్ అందిస్తుందో ఈ యాడ్ లో ఎఫెక్టివ్ గా చూపించారు సంజీవ్ రెడ్డి.

ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి స్పందిస్తూ - ఎవరి సినిమాలు చూస్తూ పెరిగి సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నానో ఆ పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు భాగస్వామి అయిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్ థియేట్రికల్ యాడ్ లో నేనూ ఒక భాగమైనందుకు, ఇక చాలు ఈ జన్మ కి అనిపిస్తుంది. కానీ, మళ్ళీ ఈ కోరికలకు అంతే ఉండదు. అని అన్నారు.

అల్లు శిరీష్ హీరోగా "ఏబీసీడీ" సినిమా, రాజ్ తరుణ్ తో "అహ నా పెళ్లంట" అనే వెబ్ సిరీస్ రూపొందించిన సంజీవ్ రెడ్డి...ప్రస్తుతం విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా "సంతాన ప్రాప్తిరస్తు" అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Facebook Comments
Filmmaker Sanjeev Reddy Directs Anti-Drugs Ad Created by the Telangana Government

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.