Social News XYZ     

Revu Movie Event matter and photos, Video (nocopy rights) plz carry

"రేవు" పార్టీలో హేమా హేమీలు.
మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల "రేవు" పార్టీలో పాల్గొని సందడి చేశారు.
త్వరలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న "రేవు" మూవీ.

వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రంలో గురు తేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి నిర్మిస్తున్నారు. నవీన్ పారుపల్లి సమర్పకులు గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "రేవు" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ఫ్యాషన్ షో మరియు స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో చిత్ర బృందం తో పాటు మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల, సంపత్ నంది, ఉత్తేజ్ గెస్టులుగా పాల్గొని సందడి చేశారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ.. రేవుల దగ్గర జీవనం గడిపే మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా వడ్డీ వ్యాపారులు వారి శ్రమను దోచుకుంటారు. చేపలను వారు చెప్పిన రేటుకే కొనాలని షరతులు విధిస్తారు. మత్స్యకారుల జీవితాల్లోని ఇలాంటి ఇబ్బందులను నేపథ్యంగా ఎంచుకుని రేవు సినిమా చేయడం మంచి ప్రయత్నం. ప్రభు నాకు ఈ సినిమాను అంతా కొత్తవాళ్లు చేస్తున్నారు, బాగా చేశారని చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. ప్రభు మనకున్న ఫిలిం జర్నలిస్టుల్లో ది బెస్ట్ పర్సన్. ఆయనను ఈ సినిమాకు పర్యవేక్షకుడిగా పెట్టుకోవడం మంచి నిర్ణయం. అలాగే మరో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. స్టార్స్ ఉన్న సినిమా హిట్ అవ్వడం కంటే కొత్త వాళ్లతో చేసిన సినిమా హిట్ అయితే ఆ కిక్కే వేరు. ఆ సంతోషం పర్వతనేని రాంబాబు గారికి, ప్రభు గారికి, ప్రొడ్యూసర్ డాక్టర్ మురళీ గింజుపల్లి గారికి దక్కాలని కోరుకుంటున్నా. దర్శకుడు హరినాథ్ పులి చూడటానికి చిన్నవాడైనా సినిమా బాగా తెరకెక్కించాడు. స్టార్ సినిమాలకు ఓపెనింగ్స్ బాగా వస్తాయి కానీ చిన్న సినిమాకు బాగుందని మౌత్ టాక్ మొదలైతే హౌస్ ఫుల్స్ అవుతాయి. అలా రేవు సినిమా జరగాలని కోరుకుంటున్నా. రామ్ గోపాల్ వర్మ గారు కొత్త వాళ్లతో సినిమాలు చేసి వాటిని బాగా ప్రమోట్ చేయించి ప్రేక్షకుల్లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంటారు. ఆయనతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. రేవు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా అన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు ఆర్జీవీ మాట్లాడుతూ.. నేను విజయవాడలో ఉన్నప్పుడు మచిలీపట్నం రేవుకు వెళ్లేవాడిని. అయితే అక్కడ మత్స్యకారుల బాధలు చూసేందుకు కాదు అక్కడ చేపలు అమ్మే వారిని చూసేందుకు. రేవు సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను చూసిన ఈ సినిమా కంటెంట్ ప్రకారం రేవు నేపథ్యంగా సాగే మత్స్యకారుల జీవితాలు, వారి లైఫ్ లో జరిగే ఈవెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించారని అనుకుంటున్నాను. రేవు నేపథ్యంగా కంప్లీట్ గా ఒక సినిమా వచ్చినట్లు నాకు గుర్తులేదు. ఈ సినిమాకు సంబంధించి అదొక యూనిక్ పాయింట్ గా చెప్పొచ్చు. దర్శకుడు హరినాథ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ మూవీ టీమ్ అందరికీ నా కంగ్రాట్స్. రేవు సినిమా గ్రేట్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నా. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన మురళీ మోహన్ గారి గురించి ఓ మాట చెప్పాలి. మురళీ మోహన్ గారు మంచికి మారు పేరు అయితే నేను చెడుకు మారు పేరు. ఆయనను ఒక విషయంలో నేను బాగా ద్వేషించేవాడిని. జ్యోతి సినిమాలో నా ఫేవరేట్ హీరోయిన్ జయసుధ ఆయన ఒడిలో ఉండేది. ఆ సీన్ చూసి కోపంగా థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోయేవాడిని. అందుకే మురళీ మోహన్ గారంటే నాకు కోపం. అయితే ఆయన లాంటి నాన్ కాంట్రవర్శియల్ పర్సన్ ను నా లైఫ్ లో చూడలేదు అన్నారు.
హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. రేవు సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్ విషయాలు వింటున్నా. ఈరోజు ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో రేవు సినిమా పార్టీ చేసుకోవడం, ఈ ఈవెంట్ లో నేను పాల్గొనడం సంతోషంగా ఉంది. రేవు సినిమా ఘన విజయం సాధించాలి, ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.
సంపత్ నంది మట్లాడుతూ.. నిర్మాత డాక్టర్ మురళి గింజుపల్లి నాకు క్లాస్ మేట్. ఆయన నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది. రేవు సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నటుడు ఉత్తేజ్ మట్లాడుతూ.. ఈ సినిమాని ఆల్రెడీ నేను చూసాను. కొత్త వారైనా అందరూ చాలా బాగా చేసారు. మ్యూజిక్ బాగా కుదిరింది. ఇలాంటి కల్ట్ మూవీస్ ప్రేక్షకులు ఆదరిస్తారని నాకు నమ్మకం ఉంది. దర్శకుడు హరి కి, నిర్మాత మురళి కి, ప్రభు అన్నకు, పర్వతనేని రాంబాబు కు ఆల్ ద బెస్ట్.
నిర్మాత డాక్టర్ మురళి గింజుపల్లి మాట్లాడుతూ.. నాకు మంచి మిత్రుడైన RGV గారు, నా గురు సమానులు మురళి మోహన్ గారు ఇద్దరూ నాకు రెండు కళ్ళు లాంటి వారు. ఒకరు నా సినిమా ఇష్టానికి గురువైతే.. ఇంకొకరు నా వ్యాపార విస్తరణకు ఇన్స్పిరేషన్. RGV గారు నా ఫస్ట్ మూవీ కి గెస్ట్ గా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఉత్తేజ్ గారు గురించి ఎవరు మరిచిపోలేరు, ఆయన ఫిలిం స్కూల్ నడుపుతున్నారు. ఆయన ఈవెంట్ కి రావడం హ్యాపీ గా ఉంది. మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రెస్ అండ్ మీడియా కి థాంక్యూ.
నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. యూఎస్ నుంచి వచ్చిన తర్వాత మురళి గారికి రేవు సినిమా ఫస్ట్ కాపీ చూపించాం. మురళీ గింజుపల్లి గారు హ్యాపీగా ఫీలయ్యారు. చాలా సహజంగా రేవు సినిమా సాగుతుంది, మూవీలో ఎమోషన్ ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టుల నేచురల్ పర్ ఫార్మెన్స్ చేశారు. మురళి మోహన్ గారిని మీరు రేవు పార్టీకి రావాలి సర్ అంటే ఆయన ఖంగుతిని నేను ఈ వయసులో రేవు పార్టీలకేంటి అని మందలించారు. అప్పుడు రేవు అనే సినిమాకి సంబందించిన పార్టీ అని, సినిమా యూనిట్ కి మీ ఆశీర్వాదం కావాలని అడిగితే రావడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ ఇంత టైమ్ మాతో స్పెండ్ చేసిన ఆయన బర్త్ డే వేడుకలని మేము ముందుగానే నిర్వహించే అవకాశం కల్పించినందుకు ఆయనకి మా కృతఙ్ఞతలు. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు ఈ రేవు పార్టీ కి రావడం పట్ల సంతోషంగా ఉంది.
ఆర్టిస్టులు: వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి, తదితరులు.
సాంకేతిక నిపుణులు:
డి ఓ పి - రేవంత్ సాగర్
నేపథ్య సంగీతం- వైశాక్ మురళీధరన్
పాట- జాన్ కె జోసెఫ్
ఎడిటర్ - శివ శర్వాని
కళ- బాషా
సాహిత్యం - ఇమ్రాన్ శాస్త్రి,
నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు,
ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు,
నిర్మాతలు డా॥ మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి, రచయిత దర్శకుడు - హరినాథ్ పులి. Video Link- https://sendgb.com/20H6LgCscGJ

All Photos Link- https://we.tl/t-Z8PX7Ovkrm

 

Facebook Comments
Revu Movie Event matter and photos, Video (nocopy rights) plz carry

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.