మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ ఎందరో ఔత్సాహిక దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తి. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించారు.
తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి రవితేజ 75వ చిత్రాన్ని ప్రొడక్షన్ నంబర్ 28 గా నిర్మిస్తోంది. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మాస్ మహారాజా రవితేజ పేరు వినగానే గుర్తొచ్చేది మాస్, కామెడీ. తనదైన మాస్ యాటిట్యూడ్, కామెడీ టైమింగ్ తోనే ఆయన ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రవితేజ తన 75వ చిత్రంలో హాస్యంతో కూడిన మాస్ పాత్రలో కనిపించనున్నారని చిత్రబృందం వెల్లడించింది. వినోదంతో కూడిన పూర్తిస్థాయి మాస్ పాత్రలో రవితేజను చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంతో అభిమానుల కోరిక నెరవేరుతుందని చిత్ర బృందం హామీ ఇచ్చింది.
బ్లాక్ బస్టర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'కి మాటల రచయితగా, మరో బ్లాక్ బస్టర్ 'సామజవరగమన'కు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు భాను బోగవరపు. నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా తెరకెక్కుతోన్న 'NBK109'కి సంభాషణలు అందిస్తున్నారు. ఇలా రచయితగా అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసిన భాను బోగవరపు, ఇప్పుడు రవితేజ కెరీర్ లో ఓ మైలురాయి లాంటి ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. ఈ చిత్రంతో అదిరిపోయే మాస్ ఎంటర్‌టైనర్‌ను అందించడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమాలో యువ సంచలనం శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రవితేజ-శ్రీలీల జోడి గతంలో "ధమాకా"తో బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. అలాగే "ధమాకా" విజయంలో కీలకపాత్ర పోషించిన సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుడు విధు అయ్యన్న ఛాయాగ్రాహకుడిగా వ్యవరిస్తున్న ఈ చిత్రానికి, శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భాను కథ-కథనం అందించిన ఈ చిత్రానికి నందు సవిరిగాన సంభాషణలు రాస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.
జూన్ 11వ తేదీన ఉదయం 07:29 గంటలకు పూజా కార్యక్రమంతో మేకర్స్ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు షాట్ కి శ్రీలీల క్లాప్ కొట్టగా, భాను బోగవరపు దర్శకత్వం వహించారు. నేటి నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.
తారాగణం: రవితేజ, శ్రీలీల
కథ, కథనం, దర్శకత్వం: భాను బోగవరపు
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: విధు అయ్యన్న
కూర్పు: నవీన్ నూలి
సంభాషణలు: నందు సవిరిగాన
కళ: నాగేంద్ర తంగాల
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్
Sithara Entertainments' Launch Mass Maharaja Ravi Teja's Landmark Film #RT75 (Production No 28) with Pooja Ceremony
Mass Maharaja Ravi Teja has become an inspiration to many aspiring filmmakers and actors in Indian cinema, especially Telugu cinema. With numerous cult blockbusters to his name, he has delivered memorable performances across a range of films. His inimitable comic timing and unmatched on-screen energy have endeared him to masses and movie lovers alike.
Now, one of the most successful production house in Telugu cinema, Sithara Entertainments in association with Fortune Four Cinemas is producing his landmark 75th film, under the working title Production No. 28. Young writer-director Bhanu Bogavarapu is making his directorial debut with this film.
The team has revealed that Ravi Teja will be seen in a mass role with a touch of humor. His fans have eagerly anticipated his return to a full-fledged massy role and the makers have promised to deliver just that.
With Bhanu Bogavarapu known for his work as a dialogue writer for the blockbuster 'Waltair Veerayya' and as the story and screenplay writer for the blockbuster 'Samajavaragamana' and the dialogues for upcoming Nandamuri Balakrishna's NBK109, we can expect a mass entertainer from this team.
Sensational actress Sreeleela has joined the cast as the leading actress for this film. The lead pair, Ravi Teja and Sreeleela, previously delivered a box office hit with "Dhamaka." Additionally, the latest sensation in the T-Town, music director Bheems Ceciroleo, who also composed the blockbuster soundtrack for "Dhamaka," has been roped in to compose the music for this film.
Talented technician Vidhu Ayyana will handle cinematography, while Sri Nagendra Tangala will oversee production design. Nandu Savirigana is writing the dialogues for the story and screenplay penned by Bhanu. National Award-winning editor Navin Nooli will edit the film.
The makers have officially started the film with a Pooja Ceremony muhurtham at 07:29am on 11th June. Suryadevara Naga Vamsi and Sai Soujanya are producing the film under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, respectively, with Srikara Studios presenting the film. More updates will be announced by the makers soon.
clap by Sreeleela & the first Shot directed by Bhanu Bogavarapu. Regular shoot of the film will commence on 11th June.
Stay tuned for more exciting announcements!
#RT75 - #Production28
Starring: Ravi Teja, Sreeleela
Story, Screenplay & Directed by: Bhanu Bogavarapu
Producer: Suryadevara Naga Vamsi & Sai Soujanya
Music: Bheems Ceciroleo
Cinematographer: Vidhu Ayyana
Editor: Navin Nooli
Dialogue Writer: Nandu Savirigana
Art Director: Sri Nagendra Tangala
Pro: Lakshmivengopal
Production: Sithara Entertainments in Association with Fortune Four Cinemas
Presenter: Srikara Studios
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.