Social News XYZ     

Love, Mouli’ is not about lust, it is about love: Director Avaneendra

New-age film 'Love, Mouli' to hit the screens on June 7

‘Love, Mouli’ is a new-age youthful drama featuring Navdeep in a brand-new get-up. Avaneendra is the director of this novel and diverse film, which is produced by Nyra Creations and Srikara Studios under the banner CSpace. Every update from this film has been innovative and impresses everyone. The film is releasing on June 7 in theatres.

Director Avaneendra has interacted with the media to talk about the major highlights in the movie:

 

The other day, the film was screened for a select group of audience in Vizag. How was the response? "The response was tremendous. Kanchi garu, who is related to MM Keeravani garu, is always frank with sharing his feedback. He liked our movie. Everyone who watched the movie loved it," the director says.

Avaneendra says that the film has something for everyone. "You will find all sorts of elements. Some will find the locations fascinating. Some will love the heroine's characterization. So on and so forth. I am sure that the female audience will connect with the film more than men," he adds.

When Avaneendra conceived 'Love, Mouli', he was working as an associate writer on 'RRR'. "I wanted to debut with a fresh subject. I zeroed in on the core idea of 'Love, Mouli' and worked on it," the director reveals.

The writer-director penned the story of the film in a novel-like format because he didn't know which lead actors he must imagine. "This is such a kind of story. I later thought about a lot of young heroes in Tollywood for this story. Although Navdeep was not actively doing films at that time, I wanted to give it a shot and approached him," he informs.

The film boasts bold dialogues and lip-lock moments. "None of them are there just for the sake of it. They are there because the story needed them. The CBFC told us we will have to go for 20 cuts if we need a U/A certificate. We were not ready as that would have compromised the story. So, we went in for the 'A' certificate. Govind Vasanth's music carries the flavour of the story forward the way it did in the case of his Tamil movie '96'," Avaneendra adds.

The word 'Mouli' in the title has a context. "The very name 'Mouli' has a serene, calm connotation pertaining to Lord Shiva. You will understand the context of the title once you watch the movie. This is the kind of a story that won't need any changes even 20 years later," he says.

What is up next? "I will next try doing an 'RRR'-type movie. There is scope to do a sequel to that movie. It is up to Rajamouli garu whether he wants to do its sequel. During the making of 'RRR', Rajamouli garu sought the opinion of team members about what kind of a movie he should do with Mahesh Babu garu. We suggested an adventure film," Avaneendra reveals.

Cast:

Navdeep, Pankhuri Gidwani, Bhavana Sagi, Mirchi Hemanth, Mirchi Kiran and others.

Crew:

Producers: CSpace, Nyra Creations, Srikara Studios; Director: Avaneendra; Music Director: Govind Vasanth; Background Score: Crishna; Lyricist: Anantha Sriram; Art Director: Kiran Mamidi; Choreographer: Ajay Sivasanker; Costume Designer: Aanshi Gupta; DI: Poetic Studios (Kochi); VFX: Nagu; Sound Design: Dhwani Studios.

లస్ట్ కోసం కాదు.. లవ్ కోసం చేసిన సినిమా ‘లవ్,మౌళి’: దర్శకుడు అవ‌నీంద్ర*

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ సరికొత్త అవతార్‌లో న‌వ‌దీప్ 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం ‘లవ్,మౌళి’. ఈ విభిన్న‌మైన, వైవిధ్య‌మైన చిత్రానికి ఎస్.ఎస్. రాజమౌళి శిష్యుడు అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచార చిత్రాలు, ప్రమోషన్‌ కంటెంట్‌ సినిమాపై ఆసక్తిని పెంచగా... నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌తో క‌లిసి టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్‌కి అడ్డాగా మారిన సి స్పేస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవల సింగిల్‌ కట్‌ లేకుండా సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెన్సార్ నుండి ‘ఏ’ సర్టిఫికెట్‌ను సొంతం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్‌ 7న గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అవనీంద్ర మీడియాతో పంచుకున్నారు.

వైజాగ్‌లో ల‌వ్‌, మౌళి ప్రీమియ‌ర్స్‌కు ఎలాంటి స్పంద‌న వ‌చ్చింది?
- ఇటీవల వైజాగ్‌లో ‘లవ్,మౌళి’ ప్రత్యేక షో వేయడం జరిగింది. ఈ షోకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా వాళ్లకు షో వేస్తే.. అందరూ బాగుందనే అంటారు. బాలేదని ఎవరూ చెప్పలేదు. అందుకే కొంతమంది చెప్పేదే నేను నమ్ముతాను. కీరవాణిగారి బ్రదర్ కాంచీగారు ఏమున్నా ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు. అలాంటి వారి ఓపెనియన్‌ని నేను బాగా నమ్ముతాను.

విడుద‌ల‌కు మూడు రోజుల ముందే ప్రివ్యూ వేయడం రిస్క్ అనిపించ‌లేదా?
- వైజాగ్‌లో ప్రివ్యూ వేయడానికి కూడా ముందు ఆలోచించాం. టాక్ బయటికి వెళ్లిపోతుందేమో అని అనుకుని కూడా.. టెస్ట్ చేద్దామని అనుకున్నాం. అలా అనుకుని బుకింగ్ ఓపెన్ చేయడానికి.. వెంటనే అయిపోయాయి. అప్పుడర్థమైంది జనాలు కూడా సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్నారని. సినిమా చూసిన వారంతా ఎంజాయ్ చేశారు. నేను ఊహించని చోట కూడా వారు ఎంగేజ్ అయి ఎంజాయ్ చేయడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ క‌థ‌లో న‌చ్చే ఎలిమెంట్స్ ఏమిటి?
- ఈ కథలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంతమంది లొకేషన్స్, కొంతమంది హీరోయిన్ క్యారెక్టరైజేషన్.. ఇలా ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.

ఇంత బోల్డ్ క‌థ‌తోనే మీరు ద‌ర్శ‌కుడికి ప‌రిచయం కావ‌డానికి కార‌ణం ఏమిటి?
- ఈ కథ అనుకున్నప్పుడు నేను ‘ఆర్ఆర్ఆర్’ రైటింగ్‌లో ఉన్నాను. నేను ఆ సినిమాకు అసోసియేట్ రైటర్‌ని. అప్పుడే మా టీమ్ అంతా నువ్వు డైరెక్ట్ చేసే సమయం ఆసన్నమైందంటూ ప్రోత్సహించారు. అయితే నేను కమర్షియల్ కథలు ఎన్నో అప్పటికే రాసేశాను. ఏ కథ రాస్తే బాగుంటుందా? అని ఆలోచిస్తూ కొత్తగా ఏదైనా ప్రేక్షకులకు రిఫ్రెష్ అనిపించేలా ఉండాలని అనుకున్నాను. ఒకవైపు ఆర్ఆర్ఆర్ రాస్తున్నప్పుడే పేరలల్‌గా ఈ పాయింట్ అనుకున్నాను. ఆర్ఆర్ఆర్‌తో అప్పటికే ఓకే చేసిన కథలన్నీ పూర్తి చేసి ఈ కథపై కూర్చున్నా.

హీరో న‌వ‌దీప్ కోస‌మే ఈ క‌థ త‌యారు చేశారా?

కథ రాస్తున్నప్పుడు మనం ఎవరినో ఒకరిని ఊహించుకుంటూ రాయాలి. ఈ కథకి అలా ఊహించుకోవడం చాలా కష్టం. ఈ ఒక్క కథకి ఎవరినీ ఊహించుకోకుండా ఒక నవలలా కథ రాసేశా. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలందరినీ ఈ కథకి ఊహించుకుంటూ వచ్చా. అయితే ఆ ఫొటోలలో అప్పుడు నవదీప్ ఫొటో లేదు. అప్పుడు నవదీప్ కూడా అంత యాక్టివ్‌గా సినిమాలు చేయడం లేదు. అప్పుడు నాకెందుకో నవదీప్ అయితే అనే ఆలోచన వచ్చింది. నా ఆలోచనలన్నీ అతనిపై పెట్టి.. ఆ తర్వాత వెళ్లి కథ చెప్పా. కథ వినగానే ఎగిరి గంతేశాడు. ఇలాంటి కథ కోసం ఎప్పటి నుండో చూస్తున్నా అని చెప్పాడు. నేను అనుకున్న లుక్‌కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు.
మార్కెట్ ఈక్వేష‌న్స్ ప‌ట్టించుకోలేదా?
అయితే మార్కెట్ అవి ఇవీ ప్రాబ్లమ్స్ ఉంటాయని అంతా అన్నారు కానీ.. ఫస్ట్ సినిమా, ఈ ఒక్క కథని నిజాయితీగా చేద్దాం అని ఫిక్సయ్యా. రిజల్ట్ తో సంబంధం లేదు.. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా.. ఫస్ట్ సినిమా నిజాయితీగా చేశానని చెప్పుకోవడానికి ఉంటుందని అనుకున్నా.

హీరో బ్రాలో మందు తాగ‌డం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది?
లో దుస్తులని పబ్లిగ్గా ఆరేయడానికి సంకోచించే మైండ్ మనది. నాకున్న స్క్రీన్‌ప్లే టైమ్‌ని దృష్టిలో పెట్టుకుని.. హీరో క్యారెక్టర్‌ ఇదని చెప్పడం కోసమే.. హీరో ఇన్నర్ దుస్తుల్లో మందు తాగడం చూపించడం జరిగింది. ఇందులో హీరోకి ఎటువంటి సెన్సిబిలిటీస్ ఉండవు. నిజంగా అలాంటి సీన్ డిస్టర్బ్‌గా అనిపిస్తే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు. వైజాగ్‌లో షో‌కి 50 శాతం అమ్మాయిలే వచ్చారు. ఎవరూ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. పోస్టర్‌లో అలా అనిపిస్తుంది కానీ.. సినిమా చూశాక అందరికీ ఆ సీన్ అర్థమవుతుంది.

-

సెన్సారు వాళ్లు ఈ సినిమాకు ఏ స‌ర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారు?
సెన్సార్ వాళ్లు యుబైఏ సర్టిఫికెట్ ఇస్తా అన్నారు కానీ 20 కట్స్ చెప్పారు. కానీ ఆ కట్స్ వల్ల కథ ఫ్లో పోతుంది. కథ కథగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే.. అయితే ‘ఏ’ ఇస్తాం అన్నారు. నేను ముందుగానే ‘ఏ’కి ప్రిపేరై ఉన్నా. ‘ఏ’ కావాలని మాత్రం అడగలేదు.. ప్రిపేర్ అయి ఉన్నా. 18ప్లస్‌కి అవసరమైన కథ ఇది.

ఈ సినిమా బ‌డ్జెట్ లిమిట్ దాటిందా?
లాక్‌డౌన్ టైమ్‌లో షూటింగ్ నిమిత్తం చాలా ఇబ్బందులు పడిన మాట వాస్తవమే కానీ.. దాని వల్ల బడ్జెట్ పెరగడం అంటూ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ని కూడా నేనే. ముందుగానే అన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నా.

హీరోయిన్స్‌గా కొత్త‌వాళ్ల‌ను తీసుకున్నారు?
ఇది ఫాంటసీ బేస్ స్టోరీ.. ఒక ఆర్టిస్ట్ తన కాన్వాస్ మీద ఊహా చిత్రం వేస్తే.. అందులో నుంచి ఆ అమ్మాయి బయటికి వచ్చేస్తుంది. అందుకే కొత్త హీరోయిన్లని తీసుకోవడం జరిగింది. ఆడియన్స్ కూడా నిజంగానే వచ్చేసిందనే ఫీల్ పొందాలి. ఒకవేళ తెలిసిన హీరోయిన్ అయితే.. ఆడియన్ ఆ ఫీల్ పొందలేరు. అందుకే కొత్తవాళ్లని తీసుకున్నాం.

ప్రేమ‌క‌థ‌ల్లో ఇది సరికొత్త‌గా వుంటుందా?
- ఫాంటసీ బేస్ తర్వాత వచ్చే స్టోరీ రియల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆ పాత్రని ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారు. యథార్థ సంఘటనల నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రమిది. రిలేషన్‌లో ఒక జంట రెండు సంవత్సరాలు హ్యాపీగా ఉన్న తర్వాత.. వారిద్దరి మధ్య ఎందుకు అంత ప్రేమ ఉండటం లేదు. ఎందుకు ఆ రిలేషన్ బ్రేక్ అవుతుంది అన్నప్పుడు నాకో ఆలోచన వచ్చింది. ఈ పాయింట్ అందరికీ నచ్చుతుందని లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాను. ఇంకా చెప్పాలంటే లస్ట్ కోసం కోసం చే
సిన సినిమా కాదు లవ్ కోసం చేసిన సినిమా ఇది.

మీరు ఈ సినిమా ద్వారా ఏమి చెప్పాల‌నుకున్నారు?
- నా దృష్టిలో ప్రేమంటే నాకు నచ్చినట్టు ఉండమనడం కాదు.. నాకు నచ్చకపోయినా.. నిన్ను నీలా ఉండనీయడం ప్రేమ. అదే ఇందులో చెప్పదలచుకున్నాను

-ఈ సినిమా నేప‌థ్యం సంగీతం గురించి?
తమిళ్‌లో ‘96’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా ఇద్దరి మధ్యే ఉంటుంది. కానీ ఎమోషన్స్ మొత్తం మ్యూజిక్ క్యారీ చేస్తుంది. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. అలాగే ఈ సినిమా కూడా అలాంటి మ్యూజిక్ అవసరం. అందుకే గోవింద్ వసంత్‌ తీసుకోవడం జరిగింది. టెర్రిఫిక్‌గా మ్యూజిక్ ఇచ్చారు. మా ఇద్దరి మధ్య బ్యూటీఫుల్ జర్నీ జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత పాటలు ఎక్కువగా పాడుకుంటారు.

ఈ సినిమా తీస్తున్నాన‌ని రాజ‌మౌళికి చెప్పారా?
- విజయేంద్ర ప్రసాద్‌గారికి ఈ కథ చెప్పినప్పుడు బూతులు తిట్టారు. ఎందుకురా నీకు ఇది. కమర్షియల్‌గా వెళ్లక అని అన్నారు. మా ఇద్దరి మధ్య తండ్రీ కొడుకుల అనుబంధం ఉంటుంది. నన్ను ఆయనకి దత్తపుత్రుడు అనే వారు. అంత చనువు ఉంది ఆయన దగ్గర. కాంచీ అన్న కూడా సేమ్ రెస్పాన్స్. నా దృష్టిలో ఇది కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమాలు రాసిన అలవాటుతో ఈ కథ రాశాను. షూటింగ్ అయిన తర్వాత ఒక వీడియో ప్రసాద్‌గారికి చూపించాను. కీరవాణిగారికి చూపించాను.. ఆశ్చర్యపోయారు.

ఈ చిత్రంలో 42 లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్స్‌, డైలాగ్స్ వున్నాయ‌ని అంటున్నారు ఇవ‌న్నీ క‌థ‌కు అవ‌స‌ర‌మా?

ఇందులో బోల్డ్ డైలాగ్స్, లిప్ లాక్స్ బోలెడన్నీ ఉంటాయి. అవన్నీ కావాలని పెట్టినవి కాదు. కథకు అవసరమై పెట్టినవే. కమర్షియల్ మీటర్ తెలిసిన వాడిని కాబట్టి.. కథ రాసుకుంటున్నప్పుడు ఈ కథతో ఆడియన్స్‌ని రంజింపచేయడానికి అవసరమైన వన్నీ చేర్చడం జరిగింది. కరోనా తర్వాత జనాలు ప్రపంచ సినిమాను చూస్తున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీ ఇంకా ఐటమ్ సాంగ్స్ దగ్గరే ఉంది. ఈ కథకి అన్ని అలా కుదిరాయ్.
ల‌వ్‌, మౌళి టైటిల్ జ‌స్టిఫికెష‌న్ ఏమిటి?
- ప్రేమతో ప్రశాంతంగా లవ్ మూడ్ కూర్చున్న శివుడిని మౌళి అంటారు. ఈ సినిమాకు ఆ పేరు పెట్టడానికి కూడా ఓ కారణం ఉంది. అది సినిమా చూసిన తర్వాత అందరికీ తెలుస్తుంది. ఈ స్టోరీకి చాలా ప్రత్యేకత ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టోరీని మార్చడానికి ఏం ఉండదు.
మీ త‌దుప‌రి చిత్రాలు?

- నెక్ట్స్ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేయడానికి ప్రయత్నిస్తా. ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ చేసే స్కోప్ ఉంది. కథకి అయితే స్కోప్ ఉంది. చేస్తారా? చేయరా? అనేది రాజమౌళిగారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ చేసేటప్పుడే తర్వాత సినిమా మహేష్ బాబుతో అని తెలుసు. మహేష్ బాబు కోసం ఎటువంటి సినిమా చేయాలా? అని అందరినీ అడిగారు. అడ్వంచర్ సినిమా చేయాలని టీమ్ అంతా అనుకున్నాక.. స్టోరీ ప్రారంభమైంది. అంత వరకే చెప్పగలను.

Love, Mouli’ is not about lust, it is about love: Director Avaneendra

Facebook Comments
Love, Mouli’ is not about lust, it is about love: Director Avaneendra

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.