Indrani’ is a movie like Mass Marvel. Sure to entertain everyone: Director Stephen Pallam

'ఇంద్రాణి' మాస్ మార్వెల్ లాంటి సినిమా. ఖచ్చితంగా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది: డైరెక్టర్ స్టీఫెన్ పల్లం

శ్రేయ్ మోషన్ పిక్చర్స్, స్టీఫెన్ పల్లం విజువల్స్ వండర్ 'ఇంద్రాణి' ట్రైలర్ గ్రాండ్ గా లాంచ్

యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఇండియన్ సూపర్ విమన్ మూవీ ఇంద్రాణి - ఎపిక్ 1: ధరమ్ vs కరమ్. శ్రేయ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్ సహా నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. జూన్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు.

'ఇండియన్ సూపర్ ఫోర్స్' గురించి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్, అద్భుతమైన విజువల్స్ తో ప్రజెంట్ చేస్తూ మొదలైన ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా సాగింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'ఇంద్రాణి' ఓ విజువల్ వండర్. దర్శకుడు స్టీఫెన్ పల్లం ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ మెస్మరైజింగా వుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆకట్టుకున్నాయి. యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్ ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ సూపర్ పవర్స్ తో అలరించాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ .. ఇవన్నీ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ..'ఇంద్రాణి' ఒక ఎపిక్ లాంటి సినిమా. చాలా అద్భుతమైన కంటెంట్ వుంది ఇందులో. టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షులని అలరిస్తుంది. ఇందులో లీడ్ రోల్ తో పాటు ఒక రోబోని కూడా క్రియేట్ చేశాం. ఆ ఇద్దరి జర్నీ చాలా అద్భుతంగా వుంటుంది. ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా వుంది. వందేళ్ళ తర్వాత ఎలాంటి టెక్నాలజీ వుండబోతుందో ఇందులో చూపించడం జరిగింది. వందేళ్ళ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇందులో సరికొత్తగా చూపించడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. యానీయా ఇండియన్ సూపర్ విమన్ గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెతో ప్రేమలో పడిపోతారు. ఇంద్రాణి మాస్ మర్వెల్. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కంప్లీట్ ఎంటర్ టైనర్' అన్నారు

కబీర్ సింగ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ స్టీఫెన్ కి హ్యాట్సప్ చెప్పాలి. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీర్చిదిద్దారు. ఇండియాలో చాలా సూపర్ హీరో సినిమాలు వచ్చాయి. కానీ ఇంద్రాణి ఫస్ట్ ఇండియన్ సూపర్ విమన్ సినిమా. ఇందులో సూపర్ విలన్ గా చేశాను. ఫ్యామిలీతో కలసి హాయిగా చూసే సినిమా ఇది. చాలా యూనిక్ ఫిల్మ్ లో ఇది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ మాట్లాడుతూ.. ఇంద్రాణి ఓ విజువల్ వండర్. నెక్స్ట్ లెవల్ విజువల్స్ వుంటాయి. సిజీ వర్క్ అద్భుతంగా వుంది. సాంగ్స్ చాలా డిఫరెంట్ గా చేశాం. ఫస్ట్ ఇండియన్ సూపర్ విమన్ సినిమాగా వస్తున్న ఇంద్రాణి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.

కో ప్రొడ్యూసర్ జే సేన్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్స్. దర్శకుడు స్టీఫెన్ ఈ సినిమాని చాలా ఫ్యూచరిస్టిక్ గా తీశాడు. ఇలాంటి సూపర్ విమన్ క్యారెక్టర్, విజువైలైజేషన్ ఇండియమ్ స్క్రీన్ కి కొత్తగా ఉంటుందని భావిస్తున్నాను. తప్పకుండా సినిమాని బిగ్ స్క్రీన్ లో చూడండి చాలా ఎంజాయ్ చేశారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్టాన్లీ మాట్లాడుతూ.. అందరికీ థాంక్స్. దర్శకుడు స్టీఫెన్ ఈ సినిమాని చాలా పాషన్ తో చేశాడు. దాదాపు ఏడాదిన్నర వీఎఫ్ఎక్స్ చేశారు. ఈ సినిమా కోసం స్టీఫెన్ క్రియేట్ చేసిన వరల్డ్ అద్భుతంగా వుంటుంది. ఈ సినిమాలో భాగమైన అందరికీ పేరుపేరునా థాంక్స్. చాలా పెద్ద స్కేల్ లో చేసిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సినిమా వర్డ్ అఫ్ మౌత్ తోనే అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను'' అన్నారు.

సంజయ్ మాట్లాడుతూ.. 'ఇంద్రాణి' లార్జర్ దెన్ లైఫ్ ఎంటర్ టైనర్. చాలా పెద్ద సినిమా. ఈ సినిమాలో వర్క్ చేయడం ఆనందంగా వుంది. తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి' అన్నారు.

నటీనటులు : యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్, షతాఫ్ ఫిగర్, సప్తగిరి, ఫ్రనైటా, గరిమా, సునైనా

టెక్నికల్ టీం:
రచన, దర్శకత్వం, నిర్మాణం & VFX పర్యవేక్షణ: స్టీఫెన్ పల్లం
సహ నిర్మాతలు: కేకే రెడ్డి, సుధీర్ వేల్పుల, జే సేన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: స్టాన్లీ పల్లం
సంగీతం: సాయికార్తీక్
ఎడిటర్: రవితేజ కూర్మనా
కొరియోగ్రాఫర్: అనీష్ మాస్టర్
డీవోపీ : చరణ్ మాధవనేని
ఆర్ట్ డైరెక్టర్: రవికుమార్ గుర్రం
యాక్షన్: ప్రేమ్సన్
సౌండ్ ఎఫెక్ట్స్: పురుషోత్తం రాజు
పీఆర్వో: తేజస్వి సజ్జా

https://youtu.be/4KlyI-Ztn8w

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.