I made a new attempt in my career with "Satyabhama" - Queen of Masses Kajal Aggarwal in press meet
'Queen of Masses' Kajal Aggarwal plays the lead role in the movie "Satyabhama," with Naveen Chandra playing the pivotal role of Amarender. This film is produced by Bobby Tikka and Srinivasa Rao Takkalapalli under the banner of Aurum Arts. "Major" film director Sashi Kiran Tikka served as the presenter and screenplay writer. "Satyabhama" is a crime thriller directed by Suman Chikkala and is set for a grand theatrical release on June 7. The press meet for this movie was held today in Hyderabad.
Movie presenter and screenplay writer Sashi Kiran Tikka said - Along with the script of my new movie, I have also been writing the script of "Satyabhama." Suman Chikkala seemed to be a good director for this project, so we entrusted him with the responsibility. My friend Ramesh Prashant told me this story during the time of "Goodachari." After listening to this story, the audience felt it was one that needed to be told. After completing "Major," we began improving the script for "Satyabhama." I have several exciting stories; some I direct myself, and others are handled by my team members. There is no reason why "Satyabhama" should not be adapted into other languages. This movie is entirely based in our Hyderabad, a local story with our nativity. That's why we decided to perfect it in Telugu first before considering other languages.
Producer Bobby Tikka said - Our movie "Satyabhama," with its crime thriller storyline, has been made to appeal to all sections of the audience. We are bringing it to theaters on June 7 and hope you will support our movie.
Director Suman Chikkala said - The story of "Satyabhama" includes both action and emotion. A police officer is not just about wearing a uniform and doing action; there is emotion in Kajal's character. In dealing with a case, she takes it personally and investigates it. We chose Kajal because she can handle both action and emotion. Every police officer's journey includes a special case they handle. Kajal's character takes a case personally in this film, and it becomes emotional. Whether justice is served or not is the story of "Satyabhama."
Queen of Masses Kajal Aggarwal said - I made a new attempt in my career with the movie "Satyabhama." This is the first time I am doing such a character and movie. When I heard the story, I liked it and felt it was new, so I decided to do the movie. I didn't have a specific type of story or character in mind. I will do any genre if the content is good. Before "Satyabhama," I had many offers for female-oriented movies, but I wanted to take them on only when I was confident enough. I feel a sense of responsibility rather than pressure when doing lady-oriented movies. This film has many new emotions. For the first time in my career, I did action and performed huge stunts, working hard for them. "Satyabhama" is not my second innings, but one can think my career will go in another new direction. Acting is my passion, and that's why I returned to movies after focusing on my personal life. In this film, my character balances both personal and professional life. During the making of this film, we met a senior police officer who explained how criminals today are committing crimes using technology such as gaming and virtual reality. We found his insights very interesting and incorporated them into the story. I've always wanted to do a full-length action movie, and I feel that desire has been fulfilled with "Satyabhama."
Music director Sricharan Pakala said - As a music director, I don't want to be typecast as someone who only does certain types of films. However, most of the films I have done are thrillers, such as action thrillers, spy thrillers, and psychological thrillers. "Satyabhama" is a cop thriller, and it was great working with Sashi kiran again. Kajal is the heroine, and I have been very meticulous with the music for this film. I also got the chance to sing a song with MM Keeravaani garu for this movie. There are many good singers, so I don't usually sing songs in my films.
Cast:
- Kajal Aggarwal
- Prakash Raj
- Naveen Chandra
- Others
Technical Team:
- Banner: Aurum Arts
- Screenplay and Presenter: Sashi Kiran Tikka
- Producers: Bobby Tikka, Srinivasa Rao Takkalapelli
- Co-Producer: Balaji
- Cinematography: B. Vishnu
- CEO: Kumar Sreeramaneni
- Music: Sricharan Pakala
- PRO: GSK Media (Suresh - Sreenivas)
- Directed by: Suman Chikkala
"సత్యభామ"తో నా కెరీర్ లో కొత్త ప్రయత్నం చేశా - ప్రెస్ మీట్ లో క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్
'క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
మూవీ ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క మాట్లాడుతూ - నా కొత్త సినిమా స్క్రిప్ట్ తో పాటు "సత్యభామ" స్క్రిప్ట్ కూడా రాస్తూ వచ్చాను. ఈ ప్రాజెక్ట్ కు డైరెక్టర్ గా సుమన్ చిక్కాల బాగుంటాడు అనిపించింది. అందుకే అతనికి బాధ్యతలు అప్పగించాము. గూఢచారి సినిమా చేస్తున్న టైమ్ లో నా ఫ్రెండ్ రమేష్ ప్రశాంత్ ఈ కథను చెప్పారు. ఈ కథ వినగానే ప్రేక్షకులు చెప్పాల్సిన స్టోరి అనిపించింది. ఆ తర్వాత నేను మేజర్ సినిమా కోసం ఎంగేజ్ అయ్యాను. అది పూర్తయ్యాక "సత్యభామ" సినిమా స్క్రిప్ట్ బెటర్ మెంట్ చేస్తూ వచ్చాం. ఇలా ఎగ్జైట్ చేసే కథలు నా దగ్గర ఉన్నాయి. వాటిలో కొన్ని నేను డైరెక్ట్ చేస్తాను మరికొన్ని నా టీమ్ లోని వాళ్లు చేస్తారు. "సత్యభామ" సినిమాను వేరే భాషల్లోకి తీసుకువెళ్లకూడదు అని ఏం లేదు. ఈ సినిమా పూర్తిగా మన హైదరాబాద్ బేస్డ్ గా జరుగుతుంది. లోకల్ కథ. మన నేటివిటీ ఉంటుంది. అందుకే ముందు తెలుగులో పర్పెక్ట్ గా తీసుకొచ్చి ఆ తర్వాత మిగతా భాషల గురించి ఆలోచించాలని అనుకున్నాం. అన్నారు.
ప్రొడ్యూసర్ బాబీ తిక్క మాట్లాడుతూ - క్రైమ్ థ్రిల్లర్ కథతో మా "సత్యభామ" సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందింది. జూన్ 7న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మా మూవీకి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
దర్శకుడు సుమన్ చిక్కాల మాట్లాడుతూ - "సత్యభామ" కథలో యాక్షన్ తో పాటు ఎమోషన్ ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ అంటే కేవలం ఒక యూనిఫామ్ వేసుకుని యాక్షన్ చేయడం కాదు కాజల్ క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంటుంది. ఒక కేసు విషయంలో తను పర్సనల్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. యాక్షన్, ఎమోషన్ రెండు చేయగలదు కాబట్టే కాజల్ ను ఎంచుకున్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ జర్నీలో ఒక స్పెషల్ కేసు ఉంటుంది వాళ్లు హ్యాండిల్ చేసింది. ఈ సినిమాలో కాజల్ కూడా ఒక కేసును పర్సనల్ గా తీసుకుంటుంది. ఆ కేసు విషయంలో ఎమోషనల్ అవుతుంది. ఆ కేసులో జస్టిస్ చేయగలిగిందా లేదా అనేది "సత్యభామ" కథ. అన్నారు.
క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ - "సత్యభామ" సినిమాతో నా కెరీర్ లో కొత్త ప్రయత్నం చేశా. ఇలాంటి క్యారెక్టర్, మూవీ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథ వినగానే నచ్చింది కొత్తగా అనిపించింది అందుకే సినిమా చేసేందుకు ముందుకొచ్చా. నేను ఇలాంటి కథల్లో, క్యారెక్టర్స్ లో నటించాలి అనేది మైండ్ లో పెట్టుకోలేదు. మంచి కంటెంట్ ఉంటే ఏ జానర్ అయినా చేస్తాను. "సత్యభామ" కంటే ముందు ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కోసం ఆఫర్స్ చాలా వచ్చాయి. అయితే నేను ఆ మూవీస్ చేసేంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడే ఒప్పుకోవాలని అనుకున్నా. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్నప్పుడు నా మీద ప్రెజర్ ఉంది అనుకోవడం కంటే రెస్పాన్సిబిలిటీ ఉందని అనుకుంటా. ఈ సినిమాలో చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైమ్ నా కెరీర్ లో యాక్షన్, భారీ స్టంట్స్ చేశాను. వాటి కోసం చాలా కష్టపడ్డాను. "సత్యభామ" నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు నా కెరీర్ మరో కొత్త దిశలో వెళ్తుందని అనుకోవచ్చు. యాక్టింగ్ నా ప్యాషన్ అందుకే నా పర్సనల్ లైఫ్ లోకి వెళ్లిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ ను కలిసినప్పుడు ఆయన నేడు క్రిమినల్స్ గేమింగ్, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీ ద్వారా క్రైమ్స్ ఎలా చేస్తున్నారో వివరించారు. ఆయన చెప్పిన అంశాలు మాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. వాటిని కథలో పార్ట్ చేశాం. నేను ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. "సత్యభామ" తో ఆ కోరిక తీరిందని అనుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ - సంగీత దర్శకుడిగా నేను ఈ తరహా చిత్రాలే చేస్తానని టైప్ కాస్ట్ అవడం ఇష్టం లేదు. అయితే నేను చేసిన సినిమాల్లో ఎక్కువ థ్రిల్లర్స్ ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్స్, స్పై థ్రిల్లర్స్, సైకలాజికల్ థ్రిల్లర్స్ వంటి మూవీస్ చేశాను. "సత్యభామ" ఒక కాప్ థ్రిల్లర్. శశికిరణ్ తో మరోసారి వర్క్ చేస్తున్నా. కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు చాలా జాగ్రత్తగా మ్యూజిక్ చేశాను. కీరవాణి గారితో పాట పాడించే అవకాశం ఈ సినిమాతో నాకు దక్కింది. మంచి సింగర్స్ చాలా మంది ఉన్నారు అందుకే నా సినిమాల్లో పాటలు నేను పాడటం లేదు. అన్నారు.
నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్: అవురమ్ ఆర్ట్స్
స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క
నిర్మాతలు : బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
కో ప్రొడ్యూసర్ - బాలాజీ
సినిమాటోగ్రఫీ - బి విష్ణు
సీఈవో - కుమార్ శ్రీరామనేని
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
దర్శకత్వం: సుమన్ చిక్కాల
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.