Anand Deverakonda’s Performance in “Gam Gam Ganesha” is the major highlight – Director Uday BommiSetty

Anand Deverakonda's Performance in "Gam Gam Ganesha" is the major highlight - Director Uday BommiSetty

Anand Deverakonda's latest movie, "Gam Gam Ganesha," features Pragathi Srivastava and Nayan Sarika as heroines opposite Anand. The film is produced by Kedar Selagamsetty and Vamsi Karumanchi under the banner Hy-Life Entertainment. Uday Setty makes his directorial debut with this film, which is set for a grand theatrical release tomorrow. Director Uday Setty recently shared the highlights of the movie in an interview.

  • I used to work as a writer in Vijayendra Prasad's team. Once, during a Ganesh immersion program in Hyderabad, the story idea came to me. I sent this script synopsis to Anand Deverakonda's team through my friend, director Anudeep KV. That evening, I received a phone call asking me to come and discuss the script. After clearing their doubts, Anand agreed to do the project, and thus the journey of "Gam Gam Ganesha" began.
  • Anand Deverakonda has previously portrayed Boy Next Door characters with a soft nature. In "Gam Gam Ganesha," the hero character has shades of grey. The character is tricky, funky, and energetic, a new type for Anand, who has never played such a role before. He seemed like the perfect choice, so I approached him.

  • The story revolves around a statue of Lord Ganesha, with many characters attempting to acquire it. All the characters in the movie have shades of grey. One heroine is portrayed in a positive light, while the other behaves negatively due to circumstances, not out of inherent badness.

  • The movie starts with a Hyderabad background and then shifts to Kurnool. In the second half, Vennela Kishore's character provides a lot of humor. People who saw the preview commented that they wished Vennela Kishore's role was longer because they enjoyed it so much. The film does not have a traditional love story; instead, the two heroines play key roles as part of the story's journey. Nayan Sarika and Pragathi Srivastava performed well.

  • The screenplay of "Gam Gam Ganesha" is impressive, filled with twists and turns that maintain interest. This movie will feel fresh even if it is released years from now. Anand was very supportive during the making of "Gam Gam Ganesha," delivering excellent dialogue, timing, and reactions. His performance is a highlight of the film, embodying all the elements of a commercial hero.

  • Fear, greed, and conspiracy are universal traits, varying in intensity among individuals. "Gam Gam Ganesha" explores how these traits lead people to different situations. We shot "Gam Gam Ganesha" in parallel with the movie "Baby." The emotional content in "Baby" contrasts with the energetic, comedic character in our film. Shifting between these two films was challenging for Anand. After the success of "Baby," we are excited to release our movie. Audiences are eager to see "Gam Gam Ganesha" in theaters.

  • To celebrate Vijayendra Prasad's birthday, I narrated the story of "Gam Gam Ganesha" to him again, and he enjoyed it. His positive feedback boosted my confidence. Anand's family and friends watched "Gam Gam Ganesha" and liked it very much.

  • I am inspired by Puri Jagannath, but I love the drama in Rajamouli's movies. My next movie will be an action drama, aiming to achieve a similar impact.

"గం..గం..గణేశా"లో ఆనంద్ దేవరకొండ పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది - దర్శకుడు ఉదయ్ శెట్టి

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "గం..గం..గణేశా". ఆనంద్ సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. "గం..గం..గణేశా" రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. తాజా ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు డైరెక్టర్ ఉదయ్ శెట్టి.

  • నేను విజయేంద్రప్రసాద్ గారి టీమ్ లో రైటర్ గా వర్క్ చేసేవాడిని. ఒకసారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ టైమ్ లో ఈ స్టోరీ లైన్ ఫ్లాష్ అయ్యింది. నా ఫ్రెండ్, దర్శకుడు అనుదీప్ కేవీ ద్వారా ఆనంద్ దేవరకొండ టీమ్ కు ఈ స్క్రిప్ట్ సినాప్సిస్ పంపించాను. ఆ సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది. వచ్చి ఒకసారి కలవండి అని. నేను వెళ్లి స్క్రిప్ట్ గురించి వాళ్లకున్న డౌట్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఆనంద్ చెప్పారు. అలా "గం..గం..గణేశా" జర్నీ బిగిన్ అయ్యింది.
  • ఆనంద్ దేవరకొండ ఇప్పటిదాకా బాయ్ నెక్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు. సాఫ్ట్ నేచర్ రోల్స్ లో కనిపించాడు. "గం..గం..గణేశా"లో హీరో క్యారెక్టర్ గ్రే షేడ్స్ లో ఉంటుంది. చాలా ట్రిక్కీ క్యారెక్టర్ హీరోది. ఫంకీగా ఉంటాడు ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. ఇలాంటి క్యారెక్టర్ ఆనంద్ కు కొత్తగా ఉంటుంది. ఎందుకంటే అతను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా చేయలేదు. అతనే కరెక్ట్ ఆప్షన్ అనిపించింది. అలా ఆనంద్ ను అప్రోచ్ అయ్యాను.

  • వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ విగ్రహం సంపాదించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక హీరోయిన్ ని మాత్రం మంచి క్యారెక్టర్ లో చూపిస్తున్నాం. మరో హీరోయిన్ నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంది. అయితే తను బ్యాడ్ కాదు పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాల్సివస్తుంది.

  • హైదరాబాద్ నేపథ్యంగా మొదలయ్యే ఈ సినిమా ఆ తర్వాత కర్నూల్ కు షిప్ట్ అవుతుంది. ఈ జర్నీలో సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ హిలేరియస్ గా వచ్చింది. ఇటీవల మా మూవీ ప్రివ్యూ చూసిన వాళ్లు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నారు. వాళ్లకు అంతగా నచ్చింది. ఇందులో స్పెషల్ గా లవ్ స్టోరి అంటూ ఉండదు. కథ జర్నీలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ వస్తారు. వాళ్లకు కీ రోల్స్ ఉన్నాయి. బాగా నయన్ సారిక, ప్రగతి శ్రీ వాస్తవ బాగా పర్ ఫార్మ్ చేశారు.

  • "గం..గం..గణేశా" సినిమాలో స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కథలో నేను నమ్మిన ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ను అలాగే హోల్డ్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది. ఈ సినిమా మరో రెండేళ్లకు తెరపైకి తీసుకొచ్చినా కొత్తగా ఉంటుంది. అలాంటి స్క్రీన్ ప్లే కుదిరింది. "గం..గం..గణేశా" మేకింగ్ టైమ్ లో ఆనంద్ చాలా సపోర్ట్ చేశాడు. నేను అనుకున్న క్యారెక్టర్ లో బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఎడిట్ టేబుల్ మీద ఆనంద్ పర్ ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. డైలాగ్ డెలివరీ, టైమింగ్, రియాక్షన్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు ఆయన పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆయన క్యారెక్టర్ లో కనిపిస్తాయి.

  • భయం, అత్యాశ, కుట్ర అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే కొందరిలో కొంత మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయి అనేది "గం..గం..గణేశా"లో ఆసక్తికరంగా తెరకెక్కించాం. నేను ఈ ప్రాజెక్ట్ కోసం వెళ్లేప్పటికే బేబి సినిమా షూట్ కు అయ్యి ఉంది. ఆ తర్వాత సమాంతరంగా "గం..గం..గణేశా" బేబి షూటింగ్ చేశాం. బేబిలో ఎమోషనల్ కంటెంట్, మా మూవీలో ఎనర్జిటిక్, కామెడీ క్యారెక్టర్ ఆనంద్ చేయాలి. ఈ రెండు సినిమాల మధ్య షిప్టింగ్ ఆనంద్ కు ఛాలెంజింగ్ గా ఉండేది. బేబి సినిమా సక్సెస్ తర్వాత మా మూవీ రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. ఆనంద్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారు. "గం..గం..గణేశా" సినిమాను కూడా త్వరగా థియేటర్స్ లో చూడాలి అనే క్యూరియాసిటీ వారిలో ఏర్పడుతోంది.

  • విజయేంద్రప్రసాద్ గారి పుట్టినరోజు విష్ చేసేందుకు వెల్తే "గం..గం..గణేశా" కథను మరోసారి చెప్పించుకుని విని బాగా ఎంజాయ్ చేశారు. ఈ సినిమాతో హిట్ కొడుతున్నావ్ అని బ్లెస్ చేశారు. ఆయనకు మా కథ నచ్చడం నాలోని కాన్ఫిడెన్స్ పెంచింది. ఆనంద్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా "గం..గం..గణేశా" సినిమా చూశారు. వాళ్లకు మూవీ బాగా నచ్చింది.

  • నేను పూరి జగన్నాథ గారిని చూసి ఇన్స్ పైర్ అయ్యాను. అయితే రాజమౌళి గారి సినిమాల్లోని డ్రామా చాలా ఇష్టం. మనకు సినిమా చూసేప్పుడు డ్రామా మన మనసులకు రీచ్ అవుతుంది. అలాంటి యాక్షన్ డ్రామా మూవీస్ చేయాలని ఉంది. నా నెక్ట్ మూవీ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%