Social News XYZ     

Mass Maharaj RaviTeja’s Nephew “Mr. Idiot” teaser out now

Mass Maharaj RaviTeja's Nephew "Mr. Idiot" teaser out now

The movie "Mr. Idiot," starring Maadhav, Mass Maharaj RaviTeja's nephew, features Simran Sharma as the heroine. Produced by JJR Ravichand under the banner of JJR Entertainments and Ms. Yalamanchi Rani, the film is directed by Gauri Ronanki, who achieved commercial success with "Pelli Sanda D." Today, RaviTeja released the teaser of "Mr. Idiot" on social media.

The teaser introduces Satya (played by Simran Sharma), a top student at Dhruva Fashion Designing College, known for her unbeatable design skills. During this time, Hero (Maadhav) enters the college and playfully teases Satya, calling her a "multiple." The teaser intriguingly showcases how their tumultuous friendship evolves into love. Maadhav channels the energetic essence of RaviTeja and impresses with both his stylish appearance and performance.

 

"Mr. Idiot," which has completed all production stages, is set for a grand theatrical release soon. The release date will be announced by the makers.

Actors: Madhav, Simran Sharma, etc.

Technical team:
- Music: Anup Rubens
- Cinematography: Ram
- Art: Kiran Kumar Manne
- Editing: Viplav
- PRO: GSK Media (Suresh - Sreenivas)
- Producer: JJR Ravichand
- Writer and Director: Gauri Ronanki

మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా టీజర్ రిలీజ్

మాస్ మహరాజ్ రవితేజ వారసుడు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా "మిస్టర్ ఇడియ‌ట్‌". ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమాను నిర్మిస్తున్నారు. "పెళ్లి సందడి" చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ రోజు "మిస్టర్ ఇడియ‌ట్‌" టీజర్ ను రవితేజ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

"మిస్టర్ ఇడియ‌ట్‌" టీజర్ ఎలా ఉందో చూస్తే - ధృవ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ లో చదివే సత్య (హీరోయిన్ సిమ్రాన్ శర్మ) కాలేజ్ టాపర్. ఆమె డిజైన్ గీస్తే ది బెస్ట్ గా నిలవాల్సిందే. కాలేజ్ లో సత్య మెరిట్ ను బీట్ చేయడం ఎవరి వల్లా కాదు. అలాంటి టైమ్ లో కాలేజ్ లో అడుగుపెడతాడు హీరో (మాధ‌వ్). సత్యను న గుణింతంతో పిలుస్తూ సరదాగా టీజ్ చేస్తుంటాడు. హీరోయిన్ ను హీరో న గుణింతంతో ఎందుకు పిలుస్తున్నాడు? అల్లరిగా సాగే వీరి స్నేహం ప్రేమగా ఎలా మారింది ? అనేది టీజర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. మాధవ్ రవితేజలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. స్టైలిష్ లుక్స్ తో పాటు పర్ ఫార్మెన్స్ లోనూ ఆకట్టుకున్నాడు.

ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "మిస్టర్ ఇడియ‌ట్‌" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు - మాధ‌వ్‌, సిమ్రాన్ శ‌ర్మ‌, తదితరులు

టెక్నికల్ టీమ్

సంగీతం అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ - రామ్
ఆర్ట్ - కిరణ్ కుమార్ మన్నె
ఎడిటింగ్ - విప్లవ్
పీఆర్వో - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
నిర్మాత - జేజేఆర్ రవిచంద్
రచన, దర్శకత్వం - గౌరి రోణంకి

Mass Maharaj RaviTeja's Nephew "Mr. Idiot" teaser out now

Facebook Comments
Mass Maharaj RaviTeja's Nephew "Mr. Idiot" teaser out now

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.