Successful hero Sree Vishnu graced the “Aarambham” pre-release event; the movie is set for a grand theatrical release tomorrow.

Successful hero Sree Vishnu graced the "Aarambham" pre-release event; the movie is set for a grand theatrical release tomorrow.

"Aarambham," starring Mohan Bhagat, Supritha Satyanarayan, Bhushan Kalyan, and Ravindra Vijay in pivotal roles, is produced by Abhishek VT under the banner of AVT Entertainment and directed by Ajay Nag V. This emotional thriller is poised for a grand theatrical release tomorrow. The pre-release event, graced by successful hero Sree Vishnu, also saw the presence of hero Thiruveer, directors Naveen Medaram and Venkatesh Maha, and heroine Shivani Nagaram as guests.

On this occasion, Executive Producer Vinay Reddy Mamidi said - Our team acknowledges that I am the Karta, Karma, Kriya for this movie, but all credit goes to our producer Abhishek Viti. I merely coordinated. Like Anjaneya, the hero Mohan doesn't realize his strength. He found our director Ajay Nag akin to Sri Ram. Music director Sinjith joined our team later but garnered immense fame. I cannot comment on the film's budget, but we spared no expense in ensuring its quality. Special thanks to our producer Abhishek Vity's father for his unwavering support. Gratitude to hero Sri Vishnu, Thiruveer, and Venkatesh Maha.

Music director Sinjith Yerramilli said - I extend my gratitude to heroes Sri Vishnu and Thiruveer, directors Naveen Medaram and Venkatesh Maha for gracing our movie event today. "Aarambham" has been a blessing to me. Having watched the movie yesterday, I am confident it will resonate well with the audience.

Actor Mouli said - The "Aarambham" team exudes genuineness and passion for cinema. A commendable movie has been crafted, with music director Sinjith pouring his heart into the music. Wishing the team success.

Dialogue writer Sandeep Angadi said - You can watch "Aarambham" without any reservations; it's a delightful movie crafted by like-minded individuals. The trailer itself is a testament to its appeal.

Actor Laxman Meesala said - It's been two decades since I entered the film industry, and "Aarambham" coincides with this milestone. Hoping for a new chapter in my career's journey. Both Thiruveer and Sree Vishnu, who I've had the pleasure of working with, are now leading actors and are extending opportunities to me. May the movie's success mark a new beginning for us all.

Actor Bhushan Kalyan said - A new energy will be seen in the movie "Aarambham." This film was made by young people together, much younger than me. Working with them has changed me as a person. Ajay adapted a famous Kannada novel for this movie, which is quite challenging. However, Ajay directed "Aarambham" convincingly, and the movie turned out very well. All the best to the movie team.

Actor Abhishek Boddepalli said - People see me in the poster of "Aarambham" and ask if it's really me. Director Ajay gave me a completely different character in this film. We worked together as a team, and I encourage everyone to watch "Aarambham" in theaters on May 10.

Actress Surabhi Prabhavathi said - I portrayed the mother character in this movie. It never felt like acting during shooting; it felt natural, just like how a mother and son would talk and behave. You'll witness this spontaneity in the film.

Heroine Shivani Nagaram said - I've known the people in this team for six years, and they are passionate about movies. They have crafted a unique film with "Aarambham," a different concept that requires courage. Producer Abhishek deserves appreciation for that. The teaser and trailer are impressive, and all the actors, especially Mohan, performed remarkably. I had the opportunity to sing a song in the movie. Watch "Aarambham" in theaters tomorrow; you'll surely enjoy it.

Producer Abhishek VT said - When producing a film, friends usually question the risk, but my friends came forward to encourage and financially support me. Thanks to all my friends who understood and supported my passion. My team worked on the film with love, with some members not even taking payment yet. Everyone in our team contributed to all aspects of filmmaking, demonstrating great teamwork. My family has been very supportive. I hope this new concept movie gets a good start and is liked by the audience.

Director Ajay Nag V said - If we pursue what we love in life, success is inevitable, as proven by Sree Vishnu and Thiruveer Anna. I believed in the same philosophy and made "Aarambham." We are all newcomers, and we hope the audience receives this movie well. Filmmaking can be challenging, but with a good team, it's enjoyable. We haven't yet focused on monetization; Caraf Kancherapalem is a great example of how a small movie with a new concept can succeed. Thanks to Venkatesh Maha for that. I believe the questions about "Aarambham" have been answered with the trailer.

Director Naveen Medaram said - My friend handles the overseas distribution of "Aarambham." If he says the movie is good, I go and watch it. I can confidently say that a movie like this hasn't come out in Telugu before. "Aarambham" is impressive with its good music, cinematography, shooting, and DI. A delightful movie has been crafted in a small village. I anticipate that it will achieve sky-high success. Watch this movie in theaters and enjoy.

Hero Mohan Bhagat said - Thanks to Sree Vishnu, Thiruveer, Venkatesh Maha, and Naveen Medaram for coming to support us. I am as happy now as I was five years ago when I made "C/o Kancherapalem," equally happy now that I have acted in "Aarambham." I have been in the industry for 14 years, and it's rare to find a team with such passion for filmmaking. There's no tension when working with such a good team. Both Venkatesh Maha and I know how difficult it is to successfully bring a film to the audience. Recently, my mother passed away, and I feel she is the driving force behind me. Our producer, Abhishek Ramanaidu, aspires to become a big producer. I'm confident that everyone will like the movie "Aarambham."

Hero Thiruveer said - Mohan, Laxman Telugu University, and Ravindra Bharati, we are happy to be on the stage of this star hotel. When I was doing films with Mohan, it was tough. I mean, we had to play certain characters, but Mohan used to say firmly that we too would become heroes. Mohan was the first person who believed that we would be heroes. After "C/o Kancherapalem," many people asked how to contact this hero. One day, he suddenly came and showed the trailer of "Aarambam." The producer and director are from Karnataka, but they have made a good Telugu movie. Like "Middle Class Melodies," "C/o Kancherapalem," Vivek Athreya's movies, sometimes a good movie comes in Telugu. We eagerly wait for any Malayalam movie streaming on OTT. These directors and producers have given us such good Telugu movies. Watch "Aarambham" in theaters; you all will like it.

Director Venkatesh Maha said - I would like to thank Dheeraj Mogilineni for helping with the distribution of "Aarambam." I did "C/o Kancherapalem" with Mohan. This team is reminiscent of the curiosity we had for films back then. Many people asked about Mohan after "C/o Kancherapalem." With "Aarambam," Mohan is back on the screens. He wants this to mark the beginning of his long career. Our Telugu cinema is gaining popularity worldwide, and our directors are making movies with that in mind. I wish "Aarambam" a big success.

Hero Shri Vishnu said - My friend Swaroop asked me to launch a song about "Aarambam." Then a team of ten people came to me. Whoever thought of it, I saw the song and loved it wholeheartedly. They showed me the teaser. I don't easily get along with new people. When they left, they told Swaroop that the song and the teaser were very good. Movies with good content often face struggles to get released, and I have experienced it. My friend Dhiraj Mogalineni is distributing this film, and he distributes good movies. "Aarambham" also needs a good reception. The team that worked on this movie is amazing, very good. I believe many stars will emerge from this team in four or five years. If a good story comes along, I think I will do a film with this team. I wish the team of "Aarambham" all the best.

Actors - Mohan Bhagat, Supritha Satyanarayana, Bhushan Kalyan, Ravindra Vijay, Laxman Meesala, Bodepally Abhishek, Surabhi Prabhavathi etc.

Technical team
Editor - Aditya Tiwari, Pritam Gayatri
Cinematography - Devdeep Gandhi Kundu
Music - Sinjith Yerramilli
Dialogues - Sandeep Angidi
Sound - Manika Prabhu
Executive Producer - Vinay Reddy Mango
CEO - Ujwal BM
PRO - GSK Media (Suresh - Sreenivas)
Banner - AVT Entertainment
Producer - Abhishek VT
Directed by - Ajay Nag V

సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు అతిథిగా ఘనంగా "ఆరంభం" ప్రీ రిలీజ్ ఈవెంట్, రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం" సినిమా రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ ఫుల్ హీరో శ్రీ విష్ణు అతిథిగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో తిరువీర్, డైరెక్టర్స్ నవీన్ మేడారం, వెంకటేష్ మహా, హీరోయిన్ శివానీ నాగరం గెస్ట్ లు గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినయ్ రెడ్డి మామిడి మాట్లాడుతూ - ఈ సినిమాకు నేను కర్త, కర్మ, క్రియ అని మా టీమ్ వాళ్లు అంటున్నారు కానీ ఈ సినిమాకు అవన్నీ మా ప్రొడ్యూసర్ అభిషేక్ వీటీనే. నేను కో ఆర్డినేట్ చేశాను అంతే. ఆంజనేయుడిలాగా హీరో మోహన్ కు తన బలం తనకు తెలియదు. అతనికి శ్రీరాముడిలా మా డైరెక్టర్ అజయ్ నాగ్ దొరికాడు. మా టీమ్ లోకి లేట్ గా వచ్చి ఎక్కువ పేరు తెచ్చుకుంది మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్. ఈ సినిమాకు బడ్జెట్ ఎక్కువైందో తక్కువైందో తెలియదు గానీ సినిమాకు ఖర్చు పెట్టాల్సినంత పెట్టాం. మా ప్రొడ్యూసర్ అభిషేక్ వాళ్ల ఫాదర్ కు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయన మాకు ఎంతో సపోర్ట్ గా ఉన్నారు. హీరో శ్రీ విష్ణు, తిరువీర్, వెంకటేష్ మహాకు కు కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి మాట్లాడుతూ - ఇవాళ మా మూవీ ఈవెంట్ కు వచ్చిన హీరోలు శ్రీ విష్ణు, తిరువీర్, డైరెక్టర్స్ నవీన్ మేడారం, వెంకటేష్ మహాకు థ్యాంక్స్ చెబుతున్నా. ఆరంభం సినిమా నాకు ఒక బ్లెస్సింగ్ లా వచ్చింది. సినిమా నిన్ననే చూశాం. చాలా బాగా వచ్చింది. మీ అందరినీ మా మూవీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అన్నారు.

యాక్టర్ మౌళి మాట్లాడుతూ - ఆరంభం టీమ్ చాలా జెన్యూన్ టీమ్. సినిమా మీద ప్యాషన్ తో ఉంటారు. ఒక మంచి మూవీ చేశారని చెప్పగలను. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ టీమ్ కు సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైలాగ్ రైటర్ సందీప్ అంగడి మాట్లాడుతూ - ఆరంభం సినిమాను మీరంతా ఎలాంటి టెన్షన్ లేకుండా చూడొచ్చు. అలాంటి ప్లెజెంట్ మూవీ ఇది. ఒకే తరహా ఆలోచనలు ఉన్న కొందరు పర్సన్స్ కలిసి చేసిన ప్రాజెక్ట్ ఇది. మా సినిమా ట్రైలర్ మీకు నచ్చినట్లే సినిమా కూడా నచ్చుతుంది. అన్నారు.

నటుడు లక్ష్మణ్ మీసాల మాట్లాడుతూ - నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఇరవై ఏళ్లు పూర్తయింది. సరిగ్గా అదే సమయానికి ఆరంభం విడుదల అవుతోంది. ఇది నా కెరీర్ కు కొత్త ఆరంభంగా మారుతుందని ఆశిస్తున్నా. తిరువీర్, శ్రీ విష్ణుతో కలిసి పనిచేశాను. వాళ్లు ఇప్పుడు హీరోలుగా మారి నాకు అవకాశాలు ఇస్తున్నారు. వీళ్లిద్దరు మరింత మంచి స్థాయికి వెళ్లాలి. ఆరంభం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు భూషణ్ కల్యాణ్ మాట్లాడుతూ - ఆరంభం సినిమాలో కొత్త ఎనర్జీ కనిపిస్తుంటుంది. యువకులు కలిసి చేసిన సినిమా ఇది. వయసులో వాళ్లు నా కంటే చాలా చిన్నవాళ్లు. వాళ్లతో పనిచేసి నేనూ కుర్రాడిలా మారిపోయా. కన్నడలో ఫేమస్ నవలను ఈ సినిమాగా రూపొందించాడు అజయ్. బుక్ ను సినిమాగా చేయడం చాలా కష్టం. కానీ చాలా కన్విన్సింగ్ గా అజయ్ ఆరంభం మూవీని తెరకెక్కించాడు. సినిమా చాలా బాగుంటుంది. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటుడు అభిషేక్ బొడ్డెపల్లి మాట్లాడుతూ - ఆరంభం సినిమా పోస్టర్ లో నన్ను చూసి ఇది నువ్వేనా అని అడుగుతున్నారు. ఈ సినిమాలో నాకు అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు దర్శకుడు అజయ్. ఈ టీమ్ అంతా నాకు బాగా తెలుసు. టీమ్ వర్క్ లా కలిసి పనిచేశాం. మే 10న థియేటర్స్ లో ఆరంభం చూడండి. అన్నారు.

నటి సురభి ప్రభావతి మాట్లాడుతూ - ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ చేశాను. మేము షూటింగ్ టైమ్ లో నటిస్తున్నట్లు ఎప్పుడూ అనిపించలేదు. సహజంగా తల్లి, కొడుకు ఎలా మాట్లాడుకుంటారో, ఎలా ఉంటారో అలాగే అనిపించింది. ఈ సహజత్వం సినిమాలో మీరు చూస్తారు. అన్నారు.

హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ - ఈ టీమ్ లోని వాళ్లతో నాకు ఆరేడేళ్లుగా పరిచయం ఉంది. వీళ్లకు సినిమా అంటే చాలా ఇష్టం. ఆరంభంతో ఒక కొత్త తరహా సినిమాను చేశారని చెప్పగలను. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ఇది. ఇలాంటి సినిమా చేయడానికి ధైర్యం కావాలి. అందుకు ప్రొడ్యూసర్ అభిషేక్ ను అప్రిషియేట్ చేయాలి. టీజర్, ట్రైలర్ చాలా బాగున్నాయి. హీరో మోహన్ అండ్ మిగతా ఆర్టిస్టులంతా ఆకట్టుకునేలా పర్ ఫార్మ్ చేశారు. ఇందులో నేనొక పాట పాడే అవకాశం లభించింది. రేపు థియేటర్స్ లో ఆరంభం చూడండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

నిర్మాత అభిషేక్ వీటీ మాట్లాడుతూ - సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నామంటే సాధారణంగా ఫ్రెండ్స్ ఎందుకు రిస్క్ అని అంటారు కానీ నా ఫ్రెండ్స్ మాత్రం నన్ను ఎంకరేజ్ చేసి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని ముందుకు వచ్చారు. నా ప్యాషన్ అర్థం చేసుకుని సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్. నా టీమ్ మెంబర్స్ కేవలం సినిమా మీద ప్రేమతో పనిచేశారు. ఇప్పటికీ కొందరు డబ్బులు తీసుకోలేదు. ముందు సినిమా రిలీజ్ కానివ్వు తర్వాత డబ్బులు అని అంటుంటారు. ఈ సినిమాకు మా టీమ్ లోని వాళ్లంతా డైరెక్టర్స్ అని చెప్పాలి. అందరూ అన్ని క్రాఫ్టుల్లో పనిచేసి టీమ్ వర్క్ చేశారు. నా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది. ఒక మంచి మూవీ ఆరంభం, ఇలాంటి న్యూ కాన్సెప్ట్ సినిమాకు మీ ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ అజయ్ నాగ్ వి మాట్లాడుతూ - జీవితంలో మనకు నచ్చిన పని చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. దీన్ని శ్రీవిష్ణు గారు, తిరువీరు అన్న ప్రూవ్ చేశారు. నేను కూడా ఇదే నమ్మి ఆరంభం సినిమాను రూపొందించాను. మేమంతా కొత్త వాళ్లం. ఈ సినిమాతో ప్రేక్షకుల ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నాం. ఫిలిం మేకింగ్ కష్టం అని అంతా అనుకుంటారు కానీ మంచి టీమ్ దొరికితే చాలా ఫన్ ఉంటుంది. డబ్బు సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదన మాకు ఇంకా ఎక్సీపిరియన్స్ లోకి రాలేదు. బడ్జెట్ మూవీ కథ చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ అడిగే మాట లైట్ ఉంటుందా, కెమెరా వర్క్ ఎలా చేస్తారు అని. కొత్త కాన్సెప్ట్ తో చిన్న సినిమా ఎలా ఉంటుంది అంటే నేను కేరాఫ్ కంచెరపాలెంను ఉదాహారణగా చెబుతాను. అందుకు వెంకటేష్ మహాకు థ్యాంక్స్. ఆరంభం ఎలా ఉంటుందనే ప్రశ్నలకు ట్రైలర్ తో సమాధానం దొరికిందని భావిస్తున్నా. అన్నారు.

డైరెక్టర్ నవీన్ మేడారం మాట్లాడుతూ - ఆరంభం సినిమాను నా స్నేహితుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. అతను సినిమా బాగుంది అని చెబితే వెళ్లి చూశాను. ఇలాంటి సినిమా తెలుగులో రాలేదని చెప్పగలను. మంచి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, టేకింగ్, డీఐతో సినిమా ఆకట్టుకుంది. చిన్న విలేజ్ లో ప్లెజంట్ మూవీ చేశారు. ఆరంభం ఆకాశమంత విజయాన్ని సాధించాలి. ఈ సినిమాను థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

హీరో మోహన్ భగత్ మాట్లాడుతూ - మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు వచ్చి శ్రీ విష్ణు, తిరువీర్, వెంకటేష్ మహా, నవీన్ మేడారంకు థ్యాంక్స్ చెబుతున్నా. ఐదేళ్ల క్రితం కేరాఫ్ కంచెరపాలెం సినిమా చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో ఇప్పుడు ఆరంభం లో నటించినందుకు కూడా అంతే సంతోషంగా ఉన్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లవుతోంది. సినిమా మీద ప్యాషన్ తో ఉన్న టీమ్ దొరకడం అరుదుగా జరుగుతుంటుంది. అలా ఆరంభం సినిమాకు కుదిరింది. మంచి టీమ్ తో పనిచేసినప్పుడు ఎలాంటి టెన్షన్ ఉండదు. ఒక సినిమాను సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఎంత కష్టమో నాకూ, వెంకటేష్ మహాకు తెలుసు. మా అమ్మ ఇటీవలే మాకు దూరమైంది. ఆమే నన్ను ఒక శక్తిలా నన్ను ముందుకు నడిపిస్తుందని భావిస్తున్నా. మా ప్రొడ్యూసర్ అభిషేక్ రామానాయుడు గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ కావాలని కోరుకుంటున్నా. ఆరంభం సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. అన్నారు.

హీరో తిరువీర్ మాట్లాడుతూ - నేను, మోహన్, లక్ష్మణ్ తెలుగు యూనివర్సిటీ, రవీంద్రభారతి వేదికల మీద నుంచి ఈ స్టార్ హోటల్ వేదిక మీదకు రావడం సంతోషంగా ఉంది. నేను మోహన్ కలిసి సినిమాలు చేస్తున్నప్పుడు కష్టం బ్రో మనం ఇలాగే ఏదో క్యారెక్టర్స్ చేసుకోవాల్సిందే అని నేను అంటే..లేదు మనం కూడా హీరోలం అవుతాం అని మోహన్ గట్టిగా చెప్పేవాడు. మేము హీరోలం అవుతాం అని నమ్మిన మొదటి వ్యక్తి మోహన్. కేరాఫ్ కంచెరపాలెం తర్వాత చాలామంది ఈ హీరోను ఎలా కాంటాక్ట్ చేయాలని అడిగేవారు. ఒకరోజు సడెన్ గా వచ్చి ఆరంభం ట్రైలర్ చూపించాడు. ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ కర్ణాటక వాళ్లు. అయినా మంచి తెలుగు సినిమా చేశారు. మిడిల్ క్లాస్ మెలొడీస్, కేరాఫ్ కంచెరపాలెం, వివేక్ ఆత్రేయ మూవీస్ లా ఎప్పుడో ఒక మంచి సినిమా తెలుగులో వస్తుంటుంది. మనం ఓటీటీలో ఏదైనా మలయాళ సినిమా స్ట్రీమింగ్ కు వస్తుంటే వెయిట్ చేస్తాం. అలాంటి మనకు ఒక మంచి తెలుగు సినిమాను అందించారు ఈ దర్శక నిర్మాతలు. ఆరంభం సినిమా థియేటర్ లో చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ - ఆరంభం సినిమాను డిస్ట్రిబ్యూషన్ కు హెల్ప్ చేసిన ధీరజ్ మొగిలినేనికి థ్యాంక్స్ చెబుతున్నా. నేను మోహన్ కేరాఫ్ కంచెరపాలెం చేశాం. ఆ టైమ్ లో మేము సినిమా పట్ల ఎంత క్యూరియస్ గా ఉన్నామో ఈ టీమ్ అలా ఉంది. కేరాఫ్ కంచెరపాలెం తర్వాత మోహన్ గురించి చాలా మంది అడిగారు. ఆరంభంతో మోహన్ మళ్లీ స్క్రీన్స్ మీదకు వస్తున్నాడు. ఇది అతని సుదీర్ఘమైన కెరీర్ కు ఆరంభం కావాలని కోరుకుంటున్నా. మన తెలుగు సినిమా వరల్డ్ వైడ్ గా పాపులర్ అవుతోంది. ఆ దిశగా మన దర్శకులు మూవీస్ చేస్తున్నారు. ఆరంభం పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - నా ఫ్రెండ్ స్వరూప్ ఆరంభం గురించి చెప్పి ఒక సాంగ్ లాంఛ్ చేయాలని అడిగాడు. అప్పుడు ఓ పది మంది టీమ్ లా నా దగ్గరకు వచ్చారు. ఎవరు వీరంతా అనుకున్నా. సాంగ్ చూశాను. మనస్ఫూర్తిగా ఆ పాటను ఇష్టపడ్డా. టీజర్ చూపించారు. నేను కొత్తవాళ్లతో త్వరగా కలిసిపోలేను. వాళ్లు వెళ్లాక స్వరూప్ కు చెప్పా పాట, టీజర్ చాలా బాగుందని. కంటెంట్ బాగున్న సినిమాలు రిలీజ్ కు రావడానికి కొంత స్ట్రగుల్ తప్పదు. నేను అది ఫేస్ చేశాను. నా ఫ్రెండ్ ధీరజ్ మొగలినేని ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అతను మంచి మంచి మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఆరంభం కూడా వర్కవుట్ కావాలి. ఈ సినిమాకు పనిచేసిన టీమ్ ను చూస్తే ముచ్చటేస్తుంది. చాలా బాగున్నారు. నాలుగైదేళ్ల తర్వాత ఈ టీమ్ నుంచి చాలా మంది స్టార్స్ వస్తారు. మంచి కథ కుదిరితే ఇదే టీమ్ తో నేను సినిమా చేయాలని అనిపిస్తోంది. ఆరంభం టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.

నటీనటులు - మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు

టెక్నికల్ టీమ్
ఎడిటర్ - ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ - దేవ్ దీప్ గాంధీ కుందు
మ్యూజిక్ - సింజిత్ యెర్రమిల్లి
డైలాగ్స్ - సందీప్ అంగిడి
సౌండ్ - మాణిక ప్రభు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వినయ్ రెడ్డి మామిడి
సీఈవో - ఉజ్వల్ బీఎం
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
బ్యానర్ - ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ - అభిషేక్ వీటీ
దర్శకత్వం - అజయ్ నాగ్ వీ

DSC_8860.jpg
DSC_8872.jpg
DSC_8889.jpg

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

    Share

    This website uses cookies.