Popular Music Director Sai Karthic Turns Producer, First Look Of The Movie ‘100 Crores’ Catches Attention

ఘనంగా ‘100 క్రోర్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్

యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ‘100 క్రోర్స్’ అనే చిత్రాన్ని నిర్మించారు. దివిజా కార్తీక్, సాయి కార్తీక్ నిర్మాతలుగా ఎస్.ఎస్.స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించిన ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి రచయిత, దర్శకుడు. ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి.జి సహ నిర్మాతగా.. వెంకట్ సుధాకర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రంలో రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సోమవారం నాడు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో దర్శకులు వీర శంకర్, మల్లిక్ రామ్, నిర్మాత హర్షిత్ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక 100 క్రోర్స్ అనే టైటిల్‌తోనే సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా కొత్తగా ఉంది.

దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘100 క్రోర్స్ అనే టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. సాయి కార్తీక్ రెండు, మూడేళ్ల క్రితం సినిమా తీస్తున్నానని చెప్పాడు. కొత్త దర్శకుడికి ఆల్ ది బెస్ట్. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ తెలిపారు.

హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘డీమానిటైజేషన్‌లో వంద కోట్ల చుట్టూ తిరిగే కథ అని, ఫస్ట్ టైం సినిమాను నిర్మిస్తున్నానని సాయి కార్తీక్ గారు చెప్పారు. ఆయన సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. కన్నడ పరిశ్రమ నుంచి తెలుగులోకి వస్తున్న చేతన్‌కు స్వాగతం. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

వీర శంకర్ మాట్లాడుతూ.. ‘డీమానిటైజేషన్ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. విరాట్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. సాయి కార్తీక్ ఈ చిత్రంతో మంచి లాభాలను రాబట్టుకోవాలి. కన్నడ నటుడు చేతన్‌ను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించాలి. టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

మల్లిక్ రామ్ మాట్లాడుతూ.. ‘సాయి కార్తీక్ గారంటే నాకు చాలా ఇష్టం. అర్దరాత్రి ఫోన్ చేసి అడిగినా ట్యూన్స్ ఇస్తుంటారు. కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తున్నారు. చేతన్‌కు తెలుగులో ఇది మొదటి సినిమా. ఈ చిత్రయూనిట్‌ను తెలుగు ప్రేక్షకులు ప్రోత్సహించాలి. పెద్ద విజయాన్ని అందించాలి’ అని అన్నారు.

సాయి కార్తీక్ మాట్లాడుతూ.. ‘2016లో జరిగిన యథార్థ కథ. కరోనా తరువాత ఈ పాయింట్‌ను అనుకుని ప్రాజెక్ట్ చేశాం. ఈ మూవీ చాలా బాగా వచ్చింది. చూసిన వాళ్లంతా బాగుందని అన్నారు. ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు.

హీరో చేతన్ మాట్లాడుతూ.. ‘తెలుగు పరిశ్రమలోకి హీరోగా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సాయి కార్తీక్ గారితో నాకు పదిహేనేళ్ల నుంచి బంధం ఉంది. ఆయన ఈ మూవీని నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని, మా సినిమాను పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు.

ఈ మూవీకి చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా వ్యవహరించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. ఎస్.బీ.ఉద్దవ్ ఎడిటర్‌గా, వింగ్ చున్ అంజి ఫైట్ మాస్టర్‌గా పని చేశారు.

నటీనటులు : రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ తదితరులు

సాంకేతిక బృందం
బ్యానర్ : ఎస్.ఎస్.స్టూడియోస్
నిర్మాత : దివిజా కార్తీక్, సాయి కార్తీక్
సహ నిర్మాత : కళ్యాణ్ చక్రవర్తి.జి
దర్శకుడు : విరాట్ చక్రవర్తి
సంగీత దర్శకుడు : సాయి కార్తీక్
ఎడిటర్ : ఎస్.బీ.ఉద్దవ్
కెమెరామెన్ : చరణ్ మాధవనేని
పీఆర్వో : ఎస్ఆర్ ప్రమోషన్స్ (సాయి సతీష్)

Popular Music Director Sai Karthic Turns Producer, First Look Of The Movie ‘100 Crores’ Catches Attention

There is special attention to films based on real incidents. Meanwhile, a movie called '100 Crores' which is inspired by real events in 2016 is getting ready to enthrall the audience. Popular music director Sai Karthic is venturing into production with the movie being made entertainingly. Alongside Sai Karthic, Divija Karthik is producing the movie under the banner of SS Studios. The film is written and directed by Virat Chakravarthy. Kalyan Chakravarthi. G is the co-producer of this movie, while Venkat Sudhakar is the executive producer.

Rahul, Chetan, Yami, Sakshi Chaudhary, Lahari, Annapoornamma, Aishwarya, Bhadram, Inturi Vasu, and Sameer played key roles in this film. Freshly, the first look poster of this film was released in an event organized on Monday. Directors Veera Shankar, Mallik Ram, producer Harshith Reddy, and producer Damodara Prasad attended it as chief guests and also released the first look poster. Later, they extended best wishes to the entire team.

The grey color pattern, the grand set-up, and the heavy truck in the first look poster generate a different atmosphere altogether. While the title ‘100 Crores’ alone created curiosity, the first look poster further increased the excitement.

While speaking at the event, producer Damodara Prasad said, “The title ‘100 Crores’ sounds very interesting. Two or three years ago, Sai Karthic told me that he was making a film. All the best to the debut director. All the best to the film’s unit.”

Harshith Reddy said, “Sai Karthic said that the story revolves around 100 crores during de-monetization time and he is producing a film for the first time. I love his music. Welcome to Chetan who is coming from the Kannada industry to Telugu. All the best to the film’s team.”

Veera Shankar said, “This movie coming with the concept set around demonetization will impress everyone. I have known Virat for a long time. Sai Karthic should make good profits with this film. Telugu audiences should encourage Kannada actor Chetan. I hope this movie will become a big success. All the best to the team.”

Mallik Ram said, “I like Sai Karthic a lot. Even if you call him in the middle of the night, he has no hesitation to give tunes. He encourages new talent. This is Chetan's first film in Telugu. Telugu audiences should encourage this film’s unit. I hope it will turn out to be a big hit.”

Sai Karthic said, “It’s based on a true story that happened in 2016. We locked the script, after the Corona phase. This movie has come out well. Everyone who saw it appreciated the content. I am confident that this movie will be a big success.”

Hero Chetan said, “I am very happy to be entering the Telugu industry as a hero. Thanks to the director and producers for giving me such a good opportunity. I have a good bond with Sai Karthic for fifteen years. I am happy that he is producing this movie. I hope the Telugu audience will support me and make our movie a big hit.”

The film has music by Sai Karthic himself. Charan Madhavaneni is the cinematographer. Editing is by SB Uddhav and Wing Chun Anji is the fight master.

Cast: Rahul, Chetan, Yami, Sakshi Chaudhary, Lahari, Annapurnamma, Aishwarya, Bhadram, Inturi Vasu, Sameer etc.

Technical Crew:
Banner: SS Studios
Producers: Divija Karthik, Sai Karthic
Co-producer: Kalyan Chakravarthi.G
Director: Virat Chakravarthy
Music Director: Sai Karthic
Editor: SB Uddhav
Cameraman: Charan Madhavaneni
PRO: SR Promotions (Sai Satish)

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%