లగ్గం చిత్రీకరణ పూర్తి / టాకీపార్ట్ పూర్తిచేసుకున్న లగ్గం
"ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు" అన్నారు పెద్దలు "ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి" అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో లగ్గం మూవీని మొదలుపెట్టి శరవేగంగా నిన్నటితో లగ్గం టాకీ పార్ట్ పూర్తి అయ్యింది.
“మన తెలుగు కల్చర్ తో జరిగే పెళ్ళిలలో ఉండే మజా, మర్యాదలు, ఆట, పాటలు ప్రతి ఒక్కరికీ వాళ్ళ లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలాచేస్తుందని” ప్రొడ్యూసర్ వేణుగోపాల్ రెడ్డి గారు అన్నారు. "లగ్గం చిత్రంలో అంతర్లీనంగా మనసుకు హత్తుకునే భావోద్వేగాలు నిండి ఉన్నాయని, ఇది చక్కటి ప్రేమ కథ చిత్రమని" రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. ఎల్.బి. శ్రీరామ్,రోహిణి, రఘు బాబు గార్ల నటన సినిమా చూసే ప్రేక్షకులని కట్టి పడేస్తుందని తన స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్ ప్లే ప్రజంటేషన్ ఇందులో చూడబోతున్నారని దర్శకుడు రమేశ్ చెప్పాల కాన్ఫిడెంట్గా చెప్పారు.
పెళ్ళి, షాదీ, లగ్గం, వివాహం ఎలా పిలిచినా జంట ఒకటవ్వడమే!!! ఒక్కో ప్రాంతంలో ఒక్కోక్క ఆచారం... ఈ లగ్గం సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది. తెలుగు సాంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను చిత్రీకరించారు. చరణ్ అర్జున్ ఈ సినిమా కోసం అద్భుతమైన బాణీలను సమకూర్చారు, బేబీ సినిమా కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి లగ్గం సినిమాకు అదనపు ఆకర్షణ కానుంది.
నటీనటులు:
సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్బి.శ్రీరామ్,రఘుబాబు, కృష్ణుడు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, లక్ష్మణ్ మీసాల, సంధ్య గంధం, టి. సుగుణ ,ప్రభావతి. కంచరపాలెం రాజు, వివా రెడ్డి,ప్రభాస్ శ్రీను, సదన్న, రవి వర్మ, కిరీటి, రవి ప్రకాష్, బాషా, విజయ లక్ష్మి, తదితరులు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: సుభిషి ఎంటర్టైన్మెంట్స్
కథ - మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: రమేశ్ చెప్పాల
నిర్మాత: వేణుగోపాల్ రెడ్డి
కెమెరామెన్: బాల్ రెడ్డి.
సంగీతం:చరణ్ అర్జున్.
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి.
ఆర్ట్: కృష్ణ.
సాహిత్యం: కాసర్ల శ్యామ్, సంజయ్ మహేశ్ వర్మ
కొరియోగ్రఫీ: బాను,అజయ్ శివశంకర్.
The filming of "Laggam" is now wrapped up!
As the elders say, "Get married and build a home," Director Ramesh Cheppala has a different take—he suggests we can build a home through EMI, so let's prioritize the wedding. Produced by Subhishi Entertainments, this movie, which commenced shooting in January, completed its dubbing yesterday.
Producer Venugopal Reddy expressed that "Laggam" encompasses all the grandeur, joy, customs, and games akin to a typical wedding celebration. Rajendra Prasad described "Laggam" as an emotional rollercoaster ride. With confidence, Ramesh Cheppala claimed to have captured every emotion with his unique filmmaking style, promising a pleasant screenplay. Audiences are expected to be stunned by the performances of LB Sriram, Rohini, and Raghu Babu.
Whether you call it "Pelli," "Shaadi," "Laagam," or "Vivaham," the essence remains the same—to unite a couple! Reflecting various cultural nuances, "Laggam" is set to appeal to fans of all genres. Ramesh Cheppala has directed this film, highlighting the uniqueness and splendor of Telugu customs. Charan Arjun has composed beautiful tracks for the movie, while Bal Reddy, known for his work in "Baby," serves as the cinematographer, ensuring the visuals will cast a spell on audiences.
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
This website uses cookies.