‘Bak’ content gives the audience a visual wonder experience. Tamanna and Raashi Khanna will surprise. There are many goosebumps moments: Sundar C

‘బాక్’ కంటెంట్ ఆడియన్స్ కు విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. తమన్నా, రాశిఖన్నా సర్ ప్రైజ్ చేస్తారు. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వున్నాయి: హీరో, డైరెక్టర్ సుందర్ సి

అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ 'అరణ్మనై' నుంచి సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా నటించిన 'అరణ్మనై 4' థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో బాక్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్‌లు Avni Cinemax P Ltd పతాకంపై నిర్మించారు. ఇప్పటికే విడుదలై ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరో, దర్శకుడు సుందర్ సి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

బాక్ సినిమా ఎలా ఉండబోతోంది ?
-అరణ్మనై సిరిస్ లో నాలుగో చిత్రమిది. మొదటి మూడు సినిమాలు తెలుగు, తమిళ్ లో చాలా పెద్ద విజయాన్ని సాధించాయి. ‘బాక్’ విషయానికి వస్తే ఈ కథ కోసం రీసెర్చ్ చేసే క్రమంలో చరిత్రతో ముడిపడిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలిసింది. అస్సామీ జానపదంలో బాక్ అనే ఘోస్ట్ వుండేదని అక్కడి ప్రజల నమ్మకం. తమ ప్రాంతానంతా చేతబడి చేశారనేది వారి విశ్వాసం. ఇది నన్ను చాలా సర్ ప్రైజ్ చేసింది. అదే ఈ బాక్ కథకు బీజం వేసింది. అస్సామీ, బ్రహ్మపుత్ర ప్రాంతంలో వుండే బాక్ అనే దెయ్యం..సౌత్ కి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆలోచనతో అరణ్మనై 4' కథ రాయడం జరిగింది. ప్రేక్షకులని థ్రిల్, సర్ ప్రైజ్ చేసే సినిమా ఇది.

అరణ్మనై3 కి 4 కి ఎలాంటి తేడా వుంటుంది ?
-అరణ్మనై సిరిస్ లో వచ్చిన సినిమాలన్నీ వ్యక్తిగత పగ, ప్రతీకారం కేంద్ర బిందువుగా వుంటాయి. అరణ్మనై 4 ఇందుకు భిన్నంగా వుంటుంది. ఒక ఎక్స్ ట్రనల్ ఎలిమెంట్ కథలో భాగం అవుతుంది. అది చాలా కొత్తగా వుంటుంది. విజువల్స్, మ్యూజిక్, లొకేషన్స్ అన్నీ డిఫరెంట్ గా వుంటాయి.

తమన్నా, రాశిఖన్నా లని ఎంపిక చేసుకోవడానికి కారణం?
-అరణ్మనై సిరిస్ లో వచ్చే అన్ని సినిమాలో స్త్రీ పాత్రలు బలంగా వుంటాయి. గత చిత్రాలలో త్రిష, హన్సిక ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి వస్తే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కావాలి. ఎమోషన్స్ ని చక్కగా పలికించాలి. ఈ పాత్రల కోసం తమన్నా, రాశిఖన్నాలు యాప్ట్ ఛాయిస్. ఇందులో కొత్త తమన్నాని చూస్తారు. రాశిఖాన్నా పాత్ర కూడా అదిరిపోతుంది. వారి నటన చూసి చాలా సర్ ప్రైజ్ అయ్యాను.

ఈ సినిమా ప్రయాణంలో మీకు సవాల్ గా అనిపించిన అంశం?
-ఈ సినిమా సిజీ ఛాలెంజ్ గా అనిపించింది. ఏడాదిన్నర పాటు సిజీ వర్క్ చేశాం. క్లైమాక్స్ షూటింగ్ చాలా సవాల్ గా అనిపించింది. అది మీరు తెరపైనే చూడాలి. ఇందులో సిజీ వర్క్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నాం. మూడు వారాల తర్వాత హిందీ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.

నటుడిగా, దర్శకుడి కొనసాగడం ఛాలెంజ్ గా అనిపించడం లేదా ?
నటుడిగా ఇది నా ఇరవై ఒకటో చిత్రం. దర్శకుడన్నప్పుడు బోలెడు భాద్యతలు వుంటాయి. నటుడికి కూడా చాలా బాధ్యతలు. నటుడిగా దర్శకుడిగా కొనసాగడం కష్టమైనపనే. అయితే నాకున్న ఇష్టం, నా టీం సపోర్ట్, ప్రేక్షకుల ఆదరణతో రెండిని చేస్తున్నా. కానీ మొదట పాషన్ మాత్రం దర్శకత్వమే.

ఖుష్బూ గారితో కథలని పంచుకుంటారా?
స్టొరీ ఐడియాని డెవలప్ చేయకముందు.. ఐడియా ఎలా వుందని అడుగుతాను. తనకి నచ్చకా ఇంక కథని డెవలప్ చేస్తాను. మళ్ళీ కథ చెప్పడం వుండదు. ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాను.

హిప్‌హాప్ తమిళ మ్యూజిక్ గురించి ?
తను సెన్సేషనల్ కంపోజర్. ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలు చేశారు. క్లైమాక్స్ సాంగ్ అదిరిపోతుంది. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

సురేష్ ప్రొడక్షన్, ఏసియన్ పిక్చర్స్ మీ సినిమాని విడుదల చేయడం ఎలా అనిపించింది ?
-సురేష్ ప్రొడక్షన్, ఏసియన్ పిక్చర్స్ లాంటి ప్రముఖ సంస్థలు మా సినిమాని విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను. తెలుగులో చాలా గ్రాండ్ గా విడుదల చేయడం ఆనందాన్ని ఇస్తోంది. మా గత చిత్రాలకు ప్రేక్షకులు అందించిన ఆదరణే ఈ సినిమాకి అందిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులని గొప్పగా అలరిస్తుంది.

'అరణ్మనై 'నుంచి ఇంకా ఎన్ని సినిమాలు ఆశించవచ్చు ?
-అది ఇప్పుడే చెప్పలేను. 'అరణ్మనై' విజయం రెండో భాగం తీయడానికి బలాన్ని ఇచ్చింది అలాగే 'అరణ్మనై 4' విజయం ఇందులో మరో సినిమా చేయడానికి ఎనర్జీ ఇస్తుందని భావిస్తున్నాను.

దర్శకుడిగా మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా?
సంఘమిత్ర అనే పెద్ద ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాం. కొన్ని కారణాల వలన అది ఆగింది. అది మళ్ళీ మొదలుపెట్టె ప్లాన్స్ జరుగుతున్నాయి. అది దేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది.

నేరుగా తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు?
తెలుగ పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటినుంచో నేరుగా తెలుగు సినిమా చేయాలని వుంది. అది తొందరలోనే జరుగుతుందని భావిస్తున్నాను.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యు

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%