“Prasanna Vadanam’ is a real commercial movie with a unique concept. It will be a thousand percent blockbuster: Hero Suhas

'ప్రసన్న వదనం'యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ సినిమా. థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది: ప్రెస్ మీట్ లో హీరో సుహాస్

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

ప్రెస్ మీట్ లో హీరో సుహాస్ మాట్లాడుతూ..ప్రసన్న వదనం మే3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిన్ననే ఫస్ట్ కాపీ చూశాం. సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి. ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు' అన్నారు.

దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. ఇది దర్శకుడిగా నా మొదటి చిత్రం. సినిమా చాలా బావొచ్చింది. ఫస్ట్ కాపీ చూశాం. థియేటర్స్ లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇది యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్ రోమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. సుహాస్ అద్భుతంగా చేశారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. అందరూ వచ్చి థియేటర్స్ లో చూడాలి' అని కోరారు.

రాశి సింగ్ మాట్లాడుతూ.. సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా వైరల్ అయ్యింది. ఇందులో నా పాత్ర కొత్తగా వుంటుంది. సుహాస్ గారు చాలా నేచురల్ యాక్టర్. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే3న తప్పకుండా సినిమా చూడండి. మీ అందరినీ అలరిస్తుంది' అన్నారు

పాయల్ రాధాకృ మాట్లాడుతూ.. ప్రసన్న వదనం యూనిక్ కాన్సెప్ట్ తో అందరినీ అలరించే చిత్రం. సుహాస్ గారితో వర్క్ చేయడం చాలా మంచి అనుభవం. ఇందులో పక్కంటి అమ్మాయిలా కనిపించే పాత్ర చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది' అన్నారు

నిర్మాత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. టీజర్ ట్రైలర్ సాంగ్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. మే3న సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.

నిర్మాత జెఎస్ మణికంఠ మాట్లాడుతూ.. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడండి. వందకి వంద శాతం అలరిస్తుంది. అందరూ థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం' అన్నారు.

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%