Darshini Movie Trailer Launched

దర్శిని చిత్రం ట్రైలర్ విడుదల

వి 4 సినీ క్రియేషన్స్ పతాకం పై వికాస్ మరియు శాంతి హీరో హీరోయిన్ గా డాక్టర్ ప్రదీప్ అల్లు దర్శకత్వం లో డాక్టర్ ఎల్ వి సూర్యం నిర్మించిన సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం "దర్శిని". ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ "రెండున్నర సంవత్సరాల క్రితం ఈ దర్శిని టీం వాళ్ళు ఫిలిం ఛాంబర్ దగ్గర నన్ను కలిశారు. ఉన్నత చదువులు చదివి డాక్టరేట్ పొంది ప్రొఫెస్సర్స్ గా రాణించి ఇప్పుడు దర్శిని అనే ఒక సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్ చిత్రం తో చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. నన్ను మొదటి పోస్టర్ ను విడుదల చేయమన్నారు. వైజాగ్ లో ఒక ఈవెంట్ లో దర్శిని చిత్ర మొదటి పోస్టర్ ను విడుదల చేశాను. తర్వాత వీళ్ళ ప్యాషన్ నచ్చి సినిమా చూసాను, కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తక్కువ బడ్జెట్ లో చాలా మంచి సినిమా తీశారు. త్వరలో విడుదల కాబోతుంది, విజయం సాధించాలి" అని కోరుకున్నారు.

నిర్మాత డాక్టర్ ఎల్ వి సూర్యం మాట్లాడుతూ "మాకు ఈ సినిమా ఫీల్డ్ కొత్త, కానీ సినిమా మీద ఉన్న ప్యాషన్ తో దర్శిని చిత్రాన్ని నిర్మించాం. ఈ ప్రయాణంలో మాకు బాగా సపోర్ట్ గా నిలిచిన మొదటి వ్యక్తి కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు. మాకు సపోర్ట్ గా నిలిచిన దామోదర్ ప్రసాద్ గారికి ధన్యవాదాలు. మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పని చేసాడు. మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. ఈ దర్శిని చిత్రంలో మూడు ముఖ్య పాత్రలు, జీవితం మీద అసంతృప్తిగా ఉన్న ముగ్గురు కి ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేదే మా చిత్ర కథ. సినిమా చాలా బాగా వచ్చింది. మంచి కామెడీ, ఎమోషన్, లవ్ అని అంశాలు మా చిత్రాల్లో ఉన్నాయి. మే నెలలో విడుదల చేస్తాం" అని తెలిపారు.

దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు మాట్లాడుతూ "కె ఎల్ దామోదర్ ప్రసాద్ గారు మా గాడ్ ఫాథర్. మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. మా నిర్మాత, మా కో డైరెక్టర్, మా హీరో, హీరోయిన్ మేము అందరం ఇప్పుడు ఒక ఫామిలీ. అందరం సొంత సినిమా గా పని చేసాం. సినిమా చాలా బాగా వచ్చింది, మే నెలలో విడుదల అవుతుంది. అందరికి నచ్చుతుంది" అని కోరుకున్నారు.

హీరో వికాస్ మాట్లాడుతూ "మా చిత్రానికి పునాది మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. ఈ జర్నీ లో చాలా కష్టాలు చూసాము కానీ సినిమా మీద ప్యాషన్ తో కష్టపడి పని చేసాము. సినిమా చాలా బాగా వచ్చింది, త్వరలో విడుదల అవుతుంది" అని తెలిపారు.

శబరి నిర్మాత మహేంద్ర గారు మాట్లాడుతూ "కాకినాడ జె ఎన్ టి యు యూనివర్సిటీ లో చదువుకున్న ఇద్దరు ప్రొఫెసర్లు సినిమా మీద ప్రేమ తో ఈ దర్శిని చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఘనవిజయం కావాలి" అని కోరుకున్నారు.

కో డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ "ఈ చిత్రం ప్రారంభం కావడానికి కారణం మా దర్శకుడు డాక్టర్ ప్రదీప్ అల్లు. చాలా కష్టాలు పడి సినిమాను నిర్మించాము, మే నెలలో విడుదల అవుతుంది. సినిమా బాగా వచ్చింది, అందరికి నచ్చుతుంది" అని తెలిపారు.

నటుడు సత్య ప్రసాద్ మాట్లాడుతూ "ఈ సినిమా లో పనిచేసిన అందరం ఒక ఫ్యామిలీ గా ఉన్నాము. మొదట షార్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళం కరోనా టైం లో సినిమా చేద్దాం అని ప్లాన్ చేసాం, సినిమా రెడీ అయింది. ఈ నెల మే లో విడుదల అవుతుంది" అమీ తెలిపారు.

జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ "టీజర్ మరియు ట్రైలర్ నాకు బాగా నచ్చింది. యంగ్ టాలెంట్ కి సపోర్ట్ చేయాలి అని ఈ ప్రెస్ మీట్ కి వచ్చాను. మొన్న సుమన్ టీవీ లో ఇంటర్వ్యూ కూడా చేశాను. చాలా టాలెంట్ ఉన్న మనుషులు. డిఫరెంట్ కథ కథనం తో వస్తున్నారు. త్వరలో విడుదల అవుతుంది. సినిమా మంచి విజయం సాధించాలి" అని కోరుకున్నారు.

బ్యానర్ : వి 4 సినీ క్రియేషన్స్

చిత్రం పేరు : దర్శిని

నటీనటులు : వికాస్, శాంతి, సత్య ప్రసాద్, తదితరులు

కెమెరా మాన్ : రవి మిల్కీ

ఎడిటర్ : ప్రవీణ్ జైరాజ్, చందు చలమల

సంగీతం : నిజాని అంజన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శివ ప్రసాద్

డి ఐ : బి 2 హెచ్ స్టూడియోస్

కలరిస్ట్ : వెంకట్

డబ్బింగ్ : సిద్ధూ పట్నాన, రాజు గరుడే

సౌండ్ ఇంజనీర్ : దామోదర్ రావు

వి ఎఫ్ ఎక్స్ : ప్రవీణ్ జైరాజ్

డిజైన్స్ : ఎమ్ కె ఎస్ మనోజ్

పి ఆర్ ఓ : పాల్ పవన్

డిజిటల్ మార్కెటింగ్ : ఎస్ 3 డిజిటల్ మీడియా వర్క్

లైన్ ప్రొడ్యూసర్ మరియు కో డైరెక్టర్ : కె సంతోష్ కుమార్

దర్శకుడు : డాక్టర్ ప్రదీప్ అల్లు

ప్రొడ్యూసర్ : డాక్టర్ ఎల్ వి సూర్యం

Trailer for 'Darshini' unveiled

Sci-fi film to be released in May

'Darshini' is a science-fiction thriller film produced by Dr. LV Suryam under the direction of Dr. Pradeep Allu. The upcoming release stars Vikas and Shanti in lead roles. V4 Cine Creations is readying the film for a theatrical release soon. The film's riveting trailer was today unveiled by senior producer KL Damodar Prasad.

Speaking on the occasion, Damodar Prasad said, "Two and a half years ago, Team Darshini met me near the Film Chamber building in Hyderabad. They are well-read and earned their doctorates and are working as professors. They are entering the film industry with this sci-fi thriller. They asked me to release the first poster at an event in Vizag. I released the first poster of the movie I liked the movie a lot and its concept is intriguing. I wish this team a successful journey."

Producer Dr. LV Suryam said, "This field is new to us. However, we made Darshini with a passion for cinema. The first person who supported us in this journey was KL Damodar Prasad garu. We thank him on this occasion. Our director Dr. Pradeep Allu has poured his life into this project whose story revolves around three main characters who are unhappy with their lives. The film has good comedy, strong emotions and romance. We are planning to release it in May."

Director Dr. Pradeep Allu said, "KL Damodar Prasad is our Godfather. He supported us very well. Our producer, our co-director, our hero and heroine are now like a family. We regard 'Darshini' as our own project, which has shaped up really well. It will be released in the month of May and we hope everyone is going to love it."

Hero Vikas said, "The backbone of our film is our director Dr. Pradeep Allu. We have seen a lot of hardships in this journey but we have worked hard on the film with passion. The film has turned out very well and will be released soon."

Mahendra, the producer of 'Sabari', said, "Two professors who studied at Kakinada JNTU University have produced this film with a love for cinema. This film should be a huge success."

Co-director Santhosh said, "The reason this film started is because of our director Dr. Pradeep Allu. We made the film despite facing hiccups. It will be released in the month of May. The film has done well and everyone will like it."

Actor Satya Prasad said, "All of us who have worked on this film are like a family. We had planned to make this film during the pandemic. It is now finally ready to be released."

Journalist Prabhu said, "I liked the teaser and the trailer very much. I am here today to support young talents. I also did an interview on Suman TV with the team. They are coming out with a unique story. I wish the team all the success."

Banner: V4 Cine Creations
Actors: Vikas, Shanti, Satya Prasad and others.
Cinematography: Ravi Milky
Editors: Praveen Jairaj, Chandu Chalamala
Music Director: Nijani Anjan
Background Score: Siva Prasad
DI: B2H Studios
Colorist : Venkat
Dubbing: Sidhu Patnana, Raju Garude
Sound Engineer: Damodar Rao
VFX Supervisor: Praveen Jairaj
Designs: MKS Manoj
PRO: Paul Pavan
Digital Marketing: S3 Digital Media Work
Line Producer and Co-Director: K Santhosh Kumar
Director: Dr. Pradeep Allu
Producer: Dr. LV Suryam

Darshini Theatrical Trailer - https://www.youtube.com/watch?v=DHkaDc1hBvg

Darshini Movie Trailer Launch and Pre Release Event Press Meet Video - https://we.tl/t-SRxKdp6MSD (No Copyright Issues)

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%