‘Aa Okti Adakku’ is a good family entertainer that entertains everyone. Connects emotionally while entertaining the audience: Director Malli Ankam

'ఆ ఒక్కటీ అడక్కు' అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ప్రేక్షకులని ఎంటర్ టైన్ చేస్తూనే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ మల్లి అంకం

కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు మల్లి అంకం విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

'ఆ ఒక్కటీ అడక్కు' క్లాసిక్ టైటిల్ కదా.. ఈ సినిమాకి పెట్టాలన్నపుడు బరువుగా అనిపించలేదా?
-'ఆ ఒక్కటీ అడక్కు' ఈ కథకు యాప్ట్ టైటిల్. ఈ టైటిల్ పెట్టాలనే ఆలోచన కూడా నరేష్ గారిదే. కేవలం టైటిల్ వరకే తీసుకున్నాం. ఈ కథకు, ఆ సినిమాకు సంబంధం లేదు. పెళ్లి చుట్టూ ఎలాంటి ఎమోషన్స్ వుంటాయి? కొందరు ఆ ఎమోషన్స్ ని ఎలా క్యాష్ చేసుకుంటారు? ఇలాంటి అంశాలని చాలా వినోదాత్మకంగా చూపిస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేశాం. ఇందులో వుండే కంటెంట్ అందరూ కనెక్ట్ అయ్యేలా వుంటుంది. ఇది అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

'ఆ ఒక్కటీ అడక్కు' అనేది ఇందులో ఎవరి మాట ?
-హీరోని పెళ్లి గురించి అందరూ అడుగుతున్నప్పుడు ఆయన సమాధానంగా చెప్పే మాట 'ఆ ఒక్కటీ అడక్కు'. నిజానికి పెళ్లి గురించి అందరూ చాలా తేలిగ్గా అడిగేస్తారు కానీ.. తీసుకున్నవారు దాన్ని చాలా పెయిన్ ఫీల్ అవుతారు. ఆ కుటుంబంలో కూడా అదో బాధలా వుంటుంది. ఇందులో ఆ ఎమోషన్ ని వినోదాత్మకంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇందులోని కామెడీ, ఎమోషన్ ఆడియన్స్ ని హత్తుకునేలా వుంటాయి.

ఇందులో సందేశం ఏవైనా ఉందా ?
-ప్రత్యేకంగా సందేశంలా వుండదు కానీ.. పెళ్లి ఎప్పుడు? అని అడగడం కన్నా మీ దగ్గర ఏదైనా మంచి సంబంధం వుంటే చూసి పెట్టండనే ఆలోచనని రేకెత్తించేలా ఈ సినిమా వుంటుంది. అలాగే పెళ్లి సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చూపించే ప్రయత్నం చేశాం.

కామెడీ సినిమాల్లో నరేష్ గారికి ఇది రీఎంట్రీ లాంటి సినిమా కదా.. ఆయన్ని ఎలా ఒప్పించారు ?
-నరేష్ గారిని అమ్మిరాజు గారి ద్వారా కలిశాను. అప్పటికే ఆయన నాలుగు సినిమాలతో బిజీగా వున్నారు. కామెడీ కథ అనేసరికి మొదట అంత ఉత్సాహం చూపించలేదు. అయితే నేను కథ చెప్పడం మొదలుపెట్టాను. ఫస్ట్ హాఫ్ విని షేక్ హ్యాండ్ ఇచ్చి 'ఈ కథ మనం చేసేద్దాం' అన్నారు. నాలుగు సినిమాల్లో రెండు వెనక్కి పెట్టి ఈ సినిమా ముందుకు తీసుకొచ్చారు. అంతలా ఈ కథ ఆయనికి నచ్చింది. ఇందులో కామెడీ తో పాటు చాలా మంచి ఎమోషన్ వుంది. నరేష్ గారి క్యారక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తాయి.

ఫరియా అబ్దులా గురించి ?
-ఫారియా పాత్ర ఇందులో చాలా కీలకంగా వుంటుంది. కథ ఆమె పాత్ర ద్వారానే మలుపు తిరుగుతుంది. ఫరియాలో మంచి కామెడీ టైమింగ్ వుంది. ఇందులో తన పాత్రని చాలా అద్భుతంగా చేసింది. సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది.

ఈ కథకు స్ఫూర్తి ఉందా ? ఎలాంటి రిసెర్చ్ చేశారు ?
-సమాజంలో జరిగే సంఘటనల స్ఫూర్తి వుంది. నా ఫ్రెండ్స్ లో కొంతమందికి పెళ్లి కాలేదు. వారంతా ఒక వేడుకకు వచ్చినపుడు వేదికపైకి రాలేదు. కారణం అడిగితే.. అందరూ పెళ్లి గురించి అడుగుతారు. వారికి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక రాలేదని చెప్పారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళ పెయిన్ ని ఫీలయ్యాను. అలాగే మ్యాట్రిమోనీకి సంబధించిన సంఘటనలు, పేపర్ లో వచ్చే కొన్ని వార్తలు కూడా ఆశ్చర్యపరుస్తుంటాయి. వీటన్నిటికీ ఫిక్షన్ జోడించి ఈ కథ చేయడం జరిగింది.

నిర్మాత గురించి ?
-చిలక ప్రొడక్షన్ రాజీవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ కథకు కావాల్సిన బడ్జెట్ ని సమకూర్చారు. వారితో నాకు ముందే అనుబంధం వుంది. ఛోటా బీమ్స్ కి సంబధించిన కొన్ని పనులు నేనే చేసేవాడిని. వారికి ఎప్పటినుంచో సినిమా చేయలని వుంది. అలాంటి సమయంలో ఈ కథ చెప్పాను. వారికి నచ్చడంతో ప్రాజెక్ట్ మొదలైయింది.

డైలాగ్ రైటర్ అబ్బూరి రవి గురించి ?
-అబ్బూరి రవి గారు ఎమోషన్ ని అద్భుతంగా రాస్తారు. ఇందులో కూడా మాటలు ఆకట్టుకునేలా వుంటాయి. రవిగారు సినిమాకి చాలా హెల్ప్ అయ్యారు.

సినిమాలపై మీకు ఆసక్తి ఎప్పుడు ఏర్పదింది ?
-నేను బియస్సీ పూర్తి చేశాను. ఒకసారి మా కాలేజ్ కి దాసరి నారాయణ గారు అతిధిగా వచ్చారు. అప్పుడు నేనో స్కిట్ రాశాను. చాలా బాగా రాశావ్ అని ఆయన మెచ్చుకున్నారు. తెలియకుండానే అప్పటి నుంచి పరిశ్రమలోకి రావాలనే ఆసక్తి ఏర్పడింది. ఇక్కడి వచ్చిన తర్వాత భాను శంకర్ గారు, సాయి కిరణ్ అడవి తో పాటు మరికొన్ని చోట్ల పని చేశాను.

గోపిసుందర్ మ్యూజిక్ గురించి ?
-గోపిసుందర్ చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. అవుట్ పుట్ చూశాక చాలా ఆనందంగా అనిపించింది. నేపథ్య సంగీతం హత్తుకునేలా చేశారు.

జామీ లివర్ ని తెలుగు పరిచయం చేయడం గురించి ?
-జామీ లివర్ ఇందులో నరేష్ గారి తమ్ముడి భార్య పాత్రలో కనిపిస్తారు. ఆ పాత్ర చాలా హిలేరియస్ గా వుంటుంది. ఆమె చేసిన ఓ వెబ్ సిరిస్ చూశాం. మా పాత్ర ఆమె అయితే సరిగ్గా సరిపోతారనిపించింది. తీరా చూస్తే ఆమె జానీ లీవర్ గారి కుమార్తె. జామీ చాలా చక్కని తెలుగు మాట్లాడుతుంది. ఇందులో హర్ష, వెన్నెల కిషోర్ పాత్రలు కూడా వినోదాత్మకంగా వుంటాయి. పాత్రలన్నీ ఎంటర్ టైనింగ్ గా ఉంటూనే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి.

ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నరేష్ గారి రియాక్షన్ ఏమిటి ?
-నరేష్ గారు ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇది వారి నాన్నగారి టైటిల్. ఖచ్చితంగా భాద్యత మరింతగా వుంటుంది. సినిమా చూసిన తర్వాత నమ్మకాన్ని నిలబెట్టాననే భావన ఆయనలో కనిపించింది. టీం అంతా అవుట్ పుట్ పై చాలా ఆనందంగా, నమ్మకంగా వున్నాం.
సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ వాళ్ళు మంచి పాయింట్ చెబుతున్నారని చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చాలామందికి తెలియని విషయాలు చెబుతున్నారని అభినందించారు.

కొత్తగా చేయబోయే ప్రాజెక్ట్స్ ?
-కొన్ని కథలు వున్నాయి. అయితే ప్రస్తుతం నా ద్రుష్టి ఈ సినిమా విడుదలపైనే వుంది.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%