A movie with a concept like ‘Prasanna Vadanam’ has not come out till now. It has surprise content till the end. Surely the audience will enjoy it a lot: Producer JS Manikantha

'ప్రసన్న వదనం'లాంటి కాన్సెప్ట్ తో ఇప్పటివరకూ సినిమా రాలేదు. ఇందులో చివరి వరకూ సర్ ప్రైజ్ అయ్యే కంటెంట్ వుంది. ఖచ్చితంగా ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు: నిర్మాత జెఎస్ మణికంఠ

యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో నిర్మాత జెఎస్ మణికంఠ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.

'ప్రసన్న వదనం' ప్రాజెక్ట్ ఎలా మొదలైయింది ?
- కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా చిత్రాలకు సహా నిర్మాతగా చేశాను. ఓ స్నేహితుడి ద్వారా ప్రసన్న వదనం కథ నా దగ్గరకి వచ్చింది. ఈ చిత్ర దర్శకుడు అర్జున్, సుకుమార్ గారి దగ్గర పని చేశారు. అర్జున్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సుహాస్ కి వినిపిస్తే ఆయనకి కూడా నచ్చింది. అలా ప్రాజెక్ట్ మొదలైయింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా సినిమా చేశాం. నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. బిజినెస్ పరంగా లాభాల్లో వున్నాం. మైత్రీ, హోంబలే లాంటి పెద్ద సంస్థలు ఈ సినిమాని విడుదల చేయడం ఆనందంగా వుంది.

కథ విన్నప్పుడు ఎలా అనిపించింది ?
-అర్జున్ చెప్పిన కథ చాలా ఎక్సయిటింగ్ గా అనిపించింది. సుహాస్ కి యూనిక్ కాన్సెప్ట్స్, కథలు భలే నప్పుతాయి. ఈ సినిమా ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ తో వస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఇండియన్ సినిమాలో ఇప్పటికీ రాలేదు. ఇది అన్నీ వర్గాల ప్రేక్షకులని అలరించేలా వుంది. చివరి వరకూ సర్ ప్రైజ్ అయ్యే కంటెంట్ వుంది.

ఇలాంటి కాన్సెప్ట్ సినిమాలు ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తారు కదా.. ఆ లోచనాలు ఉన్నాయా?
-ఇప్పుడు అదే ప్రయత్నాల్లో వున్నాం. తమిళ్ లో ఓ పెద్ద సంస్థ నుంచి మంచి ఆఫర్ వచ్చింది. డబ్బింగ్ చేయాలా ? రిమేక్ చేయాలా ? అనేది చర్చిస్తున్నాం.

దర్శకుడు అర్జున్ గురించి ?
-అర్జున్ అద్భుతమైన వర్క్ చేశాడు. కథని చాలా పగద్భందీగా రాశారు. దాని కోసం చాలా కసరత్తులు చేశాడు. మాకు ఎలాంటి ఎమోషన్ చెప్పాడో అదే ఎమోషన్ ని తెరపైకి తీసుకొచ్చాడు. తను చాలా ప్లెక్స్ బుల్ గా వుంటారు. సుకుమార్ గారి దగ్గర పని చేశాననే గర్వం ఆయనకీ వుండదు. అందరి సలహాలు వింటాడు. సినిమాకి ఏది మంచిదో అది తీసుకుంటారు. ఒక నిర్మాతగా తనకి కావాల్సిన క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చాం. సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. తను భవిష్యత్ లో చాలా పెద్ద దర్శకుడౌతాడు.

సుహాస్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-సుహాస్ తెలుగు పరిశ్రమకి అదృష్టం. ఇప్పుడు చాలా మంది దర్శకులు సుహాస్ ని ద్రుష్టిలో పెట్టుకొని కథలు రాస్తున్నారు. తనపై కొత్తకథలు వర్క్ అవుట్ అవుతున్నాయి. తను చాలా క్రమశిక్షణ గల నటుడు. నిర్మాతలకు, దర్శకులకు కంఫర్ట్బుల్ గా ఉంటాడు. తనతో వర్క్ చేయడం చాలా మంచి అనుభవం.

విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ గురించి ?
-విజయ్ నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో బీజీయం అద్భుతంగా చేశాడు. తన సౌండ్ సినిమాలో నెక్స్ట్ లెవల్ వుంటుంది. సౌండ్ ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.

కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకి సౌండ్, కలర్ ముఖ్యం..ఈ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
-థ్రిల్లర్ అనేసరికి ఒక డార్క్ లైట్ సెట్ చేస్తారు. నిజానికి ఒక మర్డర్ అనేది కేవలం డార్క్ లైట్ లోనే జరగదు. అందుకే ఆ డార్క్ లైట్ వద్దని అనుకున్నాం. పేలెట్ లైవ్లీగా బ్యూటీఫుల్ గా వుండేలా చూసుకున్నాం. థ్రిల్లర్ కి కావాల్సిన టోన్ ని సెట్ చేశాం. డివోపీ చంద్రశేఖర్ చాలా అద్భుతంగా చేశాడు.

సెన్సార్ ఫీడ్ బ్యాక్ ఎలా వుంది ?
-సెన్సార్ ఫీడ్ బ్యాక్ చాలా బావుంది. సెన్సార్ వాళ్ళు కూడా థ్రిల్లర్ ని చాలా కొత్తగా లైవ్లీగా తీశారని అభినందించారు.

ఒకపక్క ఐపీఎల్, మరో పక్క ఎలక్షన్.. ఇలాంటి సమయంలో సినిమా విడుదల కావడాన్ని ఎలా చూస్తారు ?
సమ్మర్ లో సినిమా అనేది మంచి వినోదం. ఫ్యామిలీతో కలసి సినిమా సినిమాకి వెళ్ళే ప్రేక్షులు ఎప్పుడూ వుంటారు. మా టార్గెట్ ఆడియన్స్ మాకు వున్నారని నమ్ముతున్నాం. మేము ఆశించిన ఫుట్ ఫాల్స్ ని చేరుకుంటామనే విశ్వాసం వుంది.

ఓవర్సీస్ విడుదల గురించి ?
-ది విలేజ్ గ్రూప్ వారు ఓవర్సీస్ లో చాలా గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. వారికి సినిమా షో రీల్ చూపించాం. అది చాలా నచ్చి ప్రాజెక్ట్ ని తీసుకున్నారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్ ?
-నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సుహాస్ తోనే వుంటుంది. తన వీలుని బట్టి మొదలుపెడతాం.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.