Adah Sharma scares with ‘C.D’ trailer

‘C.D’ ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

అదా శర్మ ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అయ్యారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తున్నారు. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో అదా శర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత అదా శర్మ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు అదా శర్మ ‘C.D క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమాతో రాబోతున్నారు. ది కేర‌ళ స్టోరీ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం.

C.D (క్రిమినల్ ఆర్ డెవిల్) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. RR ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మే 10న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

‘చీకటి, వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు.. ఎవరు చేస్తున్నారు ఇదంతా?.. నా చుట్టూ ఏదో జరుగుతోంది.. నాతో పాటు ఇంట్లో ఉంటోంది దెయ్యమా?.. మరణంతో పాటు యుద్దం తప్పదా?.. నన్ను చంపడానికి వచ్చింది ఎవరు క్రిమినల్? ఆర్ డెవిల్?’ అంటూ హీరో విశ్వంత్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ సాగుతుంది. ఇక ఈ ట్రైలర్‌లో అదా శర్మ యాక్షన్ సీక్వెన్స్, భయపెట్టేలా చూసే చూపులతో ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే విజువల్స్, ఆర్ఆర్ అన్నీ కూడా టాప్ నాచ్‌లో ఉన్నాయనిపిస్తోంది.

ఈ మూవీలో రీసెంట్ సెన్సేషన్ అదా శర్మ కీలక పాత్ర పోషిస్తుండగా.. విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏ.ముద్దు కృష్ణ డైలాగ్స్ అందించగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. సత్య గిడుతూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాను మే 10న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

నటీనటులు
అదా శర్మ, విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా

టెక్నీషియన్స్
బ్యానర్ : SSCM ప్రొడక్షన్స్
డైరెక్టర్ : కృష్ణ అన్నం
స్టోరీ డైలాగ్స్ : ఏ ముద్దు కృష్ణ
DOP : సతీష్ ముత్యాల
మ్యూజిక్ : RR ధృవన్
ఎడిటర్ : సత్య గిడుతూర్
యాక్షన్స్ : రామ కృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గిరిధర్
PRO : సాయి సతీష్

Adah Sharma Terrifies In The Trailer Of Psychological Horror Thriller C.D (Criminal Or Devil), Grand Theatrical Release On May 10th

Adah Sharma is on cloud nine with the Pan India success of her last outing The Kerala Story. Obviously, there is huge anticipation for her next movie. Adah Sharma will next be seen in the psychological horror thriller C.D (Criminal Or Devil). After a long time, Adah Sharma is doing a straight Telugu film. Directed by Krishna Annam and produced by SSCM Productions, the movie also stars Viswant as the male lead. The film’s shoot and post-production works were already wrapped up and it is scheduled for its theatrical release on May 10th. Interim, the makers unveiled the film’s theatrical trailer.

The trailer begins with hero Viswant’s voiceover which depicts the core point of the movie. “There is an invisible enemy between darkness and light... Who is doing all his?... Something is happening around me... Is it a ghost staying in the house with me?... Are war and death inevitable?... The one who came to kill me is a criminal or a devil?

Adah Sharma terrified the viewers with her intense performance, scary looks, and deadly stunts. She made a lasting impression and we can’t conclude after watching the trailer whether she is a criminal or a devil. Viswant looked innocent and has played his part brilliantly.

Although the trailer doesn’t disclose much about the motive of Adah Sharma, it gives a thrilling experience. While the camera work by Satish Mutyala is exceptional, RR Dhruvan complemented the visuals with his terrific background score. The trailer has definitely heightened the excitement to watch the movie in cinemas.

Jabardast Rohini, Bharani Shankar, Ramana Bhargav, and Mahesh Vitta will be seen in other important roles. While A. Muddu Krishna penned the dialogues for this film, Satya Giduthuri handled the editing duties. Rama Krishna supervises fights, whereas Giridhar is the executive producer.

Cast: Adah Sharma, Viswant, Rohini (Jabardasth), Bharani Shankar, Ramana Bhargav, and Mahesh Vitta

Technical Crew:
Producer: SSCM Productions
Director: Krishna Annam
Story, Dialogues: A Muddu Krishna
DOP: Satish Mutyala
Music: RR Dhruvan
Editor: Satya Giduturi
Fights: Rama Krishna
Executive Producer: Giridhar
PRO: Sai Satish

https://youtu.be/W_IQODwSUPI?si

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Share

This website uses cookies.

%%footer%%