'ఆ ఒక్కటీ అడక్కు' ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశాను. కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా ప్రామెసింగ్ గా వుంది. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని
'ఆ ఒక్కటీ అడక్కు'తో ఈ సమ్మర్ లో ఖచ్చితంగా ప్రేక్షకులని నవ్వించడంతో పాటు మంచి కంటెంట్ చెప్తాను: హీరో అల్లరి నరేష్
నేచురల్ స్టార్ నాని లాంచ్ చేసిన అల్లరి నరేష్, మల్లి అంకం, రాజీవ్ చిలక, చిలక ప్రొడక్షన్స్ ఆ ఒక్కటీ అడక్కు హిలేరియస్ ట్రైలర్
కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు
హీరో అన్ మేరిడ్ అని తెలియజేసేలా హిలేరియస్ ఎపిసోడ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. హీరోకి క్యాస్ట్ ఫీలింగ్ లేకపోయినా 49 సార్లు వివిధ అమ్మాయిలచే రిజెక్ట్ అవుతాడు. మ్యారేజ్ బ్యూరోలు కూడా తనకి తగిన జోడి వెతకడంలో విఫలమౌతాయి. అతను ఫరియా అబ్దుల్లాతో ప్రేమలో పడతాడు. అయితే, రిలేషన్ ని నెక్స్ట్ లెవల్ తీసుకెళ్లడానికి వారికి సమస్య ఉంది.
ఈ తరం యువతకు పెళ్లి పెద్ద సమస్య కావడంతో మల్లి అంకెం ఈ అంశాన్ని ఎంచుకుని వినోదాత్మకంగా చెప్పారు. కామెడీ సీక్వెన్స్‌లలో అల్లరి నరేష్ ఎప్పటిలాగే అదరగొట్టారు. అతని కామిక్ టైమింగ్ ఆకట్టుకున్నారు. ఫరియా అబ్దుల్లాకు కీలక పాత్ర లభించింది. ఆమె పాత్రలో చక్కగా అలరించారు. వెన్నెల కిషోర్, వైవా హర్షల ప్రజెంస్ తగిన వినోదాన్ని అందిస్తుంది.
సూర్య కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది, గోపీ సుందర్ తన స్కోర్‌తో ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు సరైన మూడ్‌ని సెట్ చేశాడు. ఈ చిత్రానికి అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్ కాగా, జె కె మూర్తి ఆర్ట్ డైరెక్టర్.
టాలీవుడ్ బిగ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రం ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ఈ వేడుకకు రావడం చాలా సంతోషంగా వుంది. నరేష్ ఇలాంటి వేడుకలకు రమ్మని సాధారణంగా నన్ను అడగరు. అడిగారంటేనే ఈ సినిమా తన మనసుకు ఎంత దగ్గరైయిందో అర్ధమౌతుంది. 'ఆ ఒక్కటీ అడక్కు'.. నరేష్ నాన్న గారు డైరెక్ట్ చేసిన టైటిల్ వాడటం వలన స్పెషల్ కనెక్షన్ వుందని అనుకుంటున్నాను. నరేష్ అద్భుతమైన నటుడు. తను బ్యాక్ టు బ్యాక్ కామెడీ సినిమాలు చేస్తుంటే వాటికి కొంచెం బ్రేక్ ఇవ్వమని నేనే కోరాను. కానీ ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ బ్రేక్ లో తన కామెడీ మిస్ అయ్యానని అనిపించింది. ఇందులో పెళ్లి కంటెంట్ అందరూ రిలేట్ అయ్యేలా వుంది. అందరూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతున్నాను. ట్రైలర్ ని చాలా ఎంజాయ్ చేశాను. మే 3న నరేష్ తో కలసి సినిమాని ఎంజాయ్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. 'ఆ ఒక్కటీ అడక్కు'తనని మరో మెట్టు ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. ఫారియా అందమైన చిరునవ్వు గల నటి. దర్శకుడు మల్లి గారికి ఆల్ ది బెస్ట్. చాలా మంచి టీంతో కలసి ఈ సినిమా చేస్తున్నారు. కంటెంట్ ప్రామెసింగ్ అండ్ ఫ్రష్ గా వుంది. ఈవీవీ గారి ఆశీర్వాదం కూడా టీం అందరికీ వుంటుంది. తప్పకుండా సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. నాని మా ఫ్యామిలీ మెంబర్ లానే వుంటారు. తను ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది.'ఆ ఒక్కటీ అడక్కు' టీం ఎఫర్ట్. రవి గారి మాటలు మల్లి గారి డైరెక్షన్, సూర్య గారి కెమరా వర్క్, చోటా గారి ఎడిటింగ్, నిర్మాత రాజీవ్ గారు.. అందరం కలసి కష్టపడి ఇష్టపడి అద్భుతంగా చేసిన సినిమా ఇది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ కామెడీ మూవీతో వస్తున్నాను. ఖచ్చితంగా ఈ సమ్మర్ లో మిమ్మ్మల్ని బాగా నవ్విస్తాను. ఇందులో నవ్విస్తూ మంచి కంటెంట్ కూడా చెప్తాను. తప్పకుండా ఈ సినిమా మే3న చూడండి' అని కోరారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. 'ఆ ఒక్కటీ అడక్కు' బ్యూటీఫుల్ స్టొరీ, కాన్సెప్ట్. ఈ సినిమాలో నా పాత్ర పేరు సిద్ది. మీరంతా చిట్టి చిట్టి అని పిలుస్తారు. సిద్ది అని పిలిచినా బావుటుంది.( నవ్వుతూ). నిర్మాత రాజీవ్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు మల్లి గారు, టీం అందరి సపోర్ట్ కి ధన్యవాదాలు. అందరూ ఇష్టపడే సినిమా ఇది. తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది. నాని గారు సపోర్ట్ చేయడానికి రావడం చాలా స్ఫూర్తిని ఇచ్చింది' అన్నారు.
నిర్మాత రాజీవ్ చిలక మాట్లాడుతూ.. నాని గారికి ధన్యవాదాలు. ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మల్లి చాలా చక్కగా తెరకెక్కించారు. తొలి సినిమా నిర్మాతలమైన మాతో సినిమా చేసినందుకు అల్లరి నరేష్ గారికి ధన్యవాదాలు. నరేష్ గారితో వర్క్ చేయడం మంచి అనుభవం. ఫారియాకు మిగతా చిత్ర యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు' తెలిపారు.
రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా సందడిగా గోలగా గా ఉంటుంది. వినోదంతో పాటు చివర్లో అందరికీ ఉపయోగపడే మాట వుంటుంది. అందరికోసం తీసిన సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది' అన్నారు.
తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకుడు- మల్లి అంకం
నిర్మాత - రాజీవ్ చిలక
సహ నిర్మాత - భరత్ లక్ష్మీపతి
బ్యానర్ - చిలక ప్రొడక్షన్స్
విడుదల - ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ LLP
రచయిత - అబ్బూరి రవి
ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్
డీవోపీ - సూర్య
సంగీతం - గోపీ సుందర్
ఆర్ట్ డైరెక్టర్ - జె కె మూర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అక్షిత అక్కి
మార్కెటింగ్ మేనేజర్ - శ్రావణ్ కుప్పిలి
మార్కెటింగ్ ఏజెన్సీ - వాల్స్ అండ్ ట్రెండ్స్
పీఆర్వో - వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్ - అనిల్ భాను
Comedy King Allari Naresh is coming up with out-and-out family entertainer Aa Okkati Adakku which marks the directorial debut of Malli Ankam. Rajiv Chilaka is producing the movie under the banner of Chilaka Productions. Given that Allari Naresh has done a comedy film, after a long time, a special interest has been created for the movie. The teaser of the movie also got a positive response. Today, Natural Star Nani unveiled the film’s theatrical trailer.
The trailer opens with a hilarious episode which is meant to designate that the protagonist is unmarried. The protagonist was rejected 49 times by different girls, though he has no caste feeling. Even marriage bureaus fail to find a match for him. He happens to meet Faria Abdullah with whom he falls in love. However, there is a problem for them to take their relationship to the next level.
Marriage is a big problem for youngsters of this generation and Malli Ankem chose this subject and narrated it entertainingly. Allari Naresh is at his usual best in comedy sequences. His comic timing is impeccable. Faria Abdullah has got a meaty role, and she played it seamlessly. The presence of Vennela Kishore and Viva Harsha assures adequate entertainment.
Suryaa’s camera work is impressive, while Gopi Sundar sets a perfect mood for this comedy entertainer with his score. The movie has dialogues by Abburi Ravi. Chota K Prasad is the editor of the movie, while J K Murthy is the art director.
Tollywood’s big distribution house Asian Suresh Entertainment LLP acquired the theatrical rights of Aa Okkati Adakku for AP and Telangana. The movie will be released in Telugu states on May 3rd.
Cast: Allari Naresh, Faria Abdullah, Vennela Kishore, Jamie Lever, Viva Harsha, Ariyana Glory And Others.
Technical Crew:
Director- Malli Ankam
Producer - Rajiv Chilaka
Co-producer - Bharath Laxmipati
Banner - Chilaka Productions
Release By - Asian Suresh Entertainment LLP
Writer - Abburi Ravi
Editor - Chota k Prasad
DOP - Suryaa
Music director - Gopi Sundar
Art director - J K Murthy
Executive producer - Akshita Akki
Marketing Manager - Sravan Kuppili
Marketing Agency - Walls and Trends
Pro - Vamsi Shekar
Publicity design - Anil Bhanu
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.