Megastar Chiranjeevi, Vassishta, UV Creations’ Vishwambhara Massive Interval Stunt Sequence Filmed Outstanding ly For 26 Days

The works of Megastar Chiranjeevi’s magnum opus Vishwambhara under the direction of Vassishta are happening as per schedules, as the movie, which involves high-end VFX with the story set in a fantasy world, is scheduled for Sankranthi release. Trisha Krishnan is the leading lady opposite Chiranjeevi in this mega-budgeted venture produced lavishly by UV Creations.

Currently, the team is canning a massive interval stunt sequence extravagantly in a huge set with a mammoth 54 ft Hanuman statue in it erected by Tollywood’s leading production designer AS Prakash. Ram-Lakshman masters duo is supervising the sequence. The interval block is going to be bang-on with this breathtakingly designed fight between Chiranjeevi and the fighters. This sequence is canned in 26 working days like never before in Indian Cinema, which is the highest for Chiru to allot so many working days for a single fight sequence. The shoot of this sequence will be completed by today. Fans and masses will have a blast in theaters to witness this first-of-its-kind action block.

Vikram, Vamsi, and Pramod are bankrolling this fantasy action adventure. MM Keeravani who recently won an Oscar Award scores the music, while the popular lensman Chota K Naidu is the cinematographer.

Vishwambhara will be released for Sankranthi in 2025 on January 10th.

Cast: Megastar Chiranjeevi, Trisha Krishnan

Technical Crew:
Writer & Director: Vassishta
Producers: Vikram, Vamsi, Pramod
Banner: UV Creations
Music: MM Keeravani
DOP: Chota K Naidu
Production Designer: AS Prakash
Fights: Ram-Lakshman
PRO: Vamsi-Shekar
Marketing: First Show

26 రోజుల పాటు అత్యద్భుతంగా చిత్రీకరణ జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ 'విశ్వంభర' మ్యాసీవ్ ఇంటర్వెల్ స్టంట్ సీక్వెన్స్

మెగాస్టార్ చిరంజీవి మాగ్నమ్ ఓపస్ 'విశ్వంభర'. వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ ప్రపంచంలోని కథాంశంతో అత్యాధునిక వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు షెడ్యూల్‌ ప్రకారం జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష కృష్ణన్ కథానాయిక.

ప్రస్తుతం టీమ్, టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ AS ప్రకాష్ నిర్మించిన 54 అడుగుల హనుమాన్ విగ్రహంతో కూడిన హ్యుజ్ సెట్‌లో మ్యాసీవ్ స్టంట్ సీక్వెన్స్‌ను అత్యద్భుతంగా చిత్రీకరిస్తోంది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని పర్యవేక్షిస్తున్నారు. చిరంజీవి, ఫైటర్స్ మధ్య ఉత్కంఠభరితంగా రూపొందించిన ఈ ఫైట్‌తో ఇంటర్వెల్ బ్లాక్ బ్యాంగ్-ఆన్ కానుంది. ఈ సీక్వెన్స్ ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా 26 వర్కింగ్ డేస్‌లో చిత్రీకరించబడింది. మెగాస్టార్ ఒక్క ఫైట్ సీక్వెన్స్ కోసం ఇన్ని వర్కింగ్ డేస్ కేటాయించడం ఇదే అత్యధికం. ఈ సీక్వెన్స్ షూటింగ్ నేటితో పూర్తవుతుంది. ఈ హైవోల్టేజ్ యూనిక్ యాక్షన్ బ్లాక్ అభిమానులు, మాసెస్ ను థియేటర్‌లలో మెస్మరైజ్ చేయనుంది.

విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్.

విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్

సాంకేతిక విభాగం:
రచన & దర్శకత్వం: వశిష్ట
నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్
బ్యానర్: యువి క్రియేషన్స్
సంగీతం: ఎంఎం కీరవాణి
డీవోపీ: చోటా కె నాయుడు
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Facebook Comments

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

    Share

    This website uses cookies.

    %%footer%%