Social News XYZ     

‘Pratnidhi 2’ is a highly loaded commercial thriller. There are many goose bumps moments. A treat for all movie lovers: Director Murthy Devagupthapu

'ప్రతినిధి 2' హైలీ లోడెడ్ కమర్షియల్ థ్రిల్లర్. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి. సినీ లవర్స్ అందరికీ నచ్చుతుంది: డైరెక్టర్ మూర్తి దేవగుప్తా

నారా రోహిత్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తూ, ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం ప్రతినిధి 2. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఇంటెన్స్ టీజర్, ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించి మంచి అంచనాలు నెలకొల్పాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు మూర్తి దేవగుప్తా చిత్ర విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

'ప్రతినిధి 2' ఎజెండా ఏమిటి?
ప్రతినిధి1 ఎజెండా వ్యవస్థని ప్రశ్నించడం. అందులో ఏ పార్టీని టార్గెట్ చేయలేదు. ప్రతినిధి 2 ఎజెండా కూడా అదే. అయితే ప్రతినిధి1లో సిస్టం బయట నుంచి ప్రశ్నిస్తాడు, ఇందులో సిస్టం లోపల వుండి ప్రశ్నిస్తాడు. సినీ గోయర్స్, సినీ లవర్స్ ఇష్టపడే సినిమా ఇది. పక్కా కమర్షియల్ థ్రిల్లర్. ఠాగూర్, లూసిఫర్, ఒకే ఒక్కడు, భారతీయుడు, లీడర్ ఈ సినిమాలన్నీ ఏ పార్టీని టార్గెట్ చేసినవి కాదు. వ్యవస్థని ప్రశ్నించేవే. 'ప్రతినిధి 2' కూడా అంతే.

 

'ప్రతినిధి 2' లో జర్నలిస్ట్ ఎవరికి ప్రతిరూపం గా వుంటాడు?
ప్రతి జర్నలిస్ట్ కి ప్రతిరూపంగా ఇందులో హీరో పాత్ర వుంటుంది. జర్నలిస్ట్ సమాజంపై బాధ్యతతో ఉద్యోగం చేస్తాడు. ఇందులో హీరో అదే భాద్యతతో పని చేస్తాడు. ఇందులో చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వుంటాయి. కలం వీరులకు, యోధులకు ఒక ట్రిబ్యుట్ లా వుంటుంది. నేను ముఫ్ఫై ఏళ్ళుగా జర్నలిజంలో వున్నాను. మ్యానేజ్మెంట్ పాలసీ ఏదైనా నేను చేసిన స్టోరీకి కట్టుబడి వుంటాను. ఇలా చాలా మంది వున్నారు. ప్రాణాలకు తెగించిన జర్నలిస్టులు కూడా వున్నారు. ఈ సినిమాలో హీరో తను నమ్మిన పాలసీకి కమిట్ అయి వుంటాడు. తను చేసిన స్టొరీలు ప్రసారం కాకపొతే ఛానల్ ని వదిలేస్తాడు. ఎక్కడా ఇదే పరిస్థితి వుందని ఫ్రీలాన్స్ జర్నలిజం చేస్తాడు. ఎలాంటి అధికారం లేకుండా పబ్లిక్ నుంచి ప్రశ్నించే వ్యక్తి జర్నలిస్ట్. చావుకు తెగించి పని చేస్తాడు. అలాంటి జర్నలిస్ట్ ని హీరోగా చూపించాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఇందులో హీరో పాత్ర ఆలోచన రేకెత్తించేలా వుంటుంది.

ఈ కథ ఆలోచన ఎప్పుడు వచ్చింది ? 'ప్రతినిధి' ఫ్రాంచైజ్ కోసమే అనుకున్నారా?
నిజానికి ఈ కథ 'ప్రతినిధి' ఫ్రాంచైజ్ కోసం అనుకోలేదు. నాకు పుస్తకాలకు కథలు రాసే అలవాటు వుంది. వేరే కలం పేరుతో రాస్తాను. అనుకోకుండా ఒక సినిమాలో జర్నలిస్ట్ పాత్ర చేశాను. అప్పుడు సినిమా మేకింగ్ ని పరిశీలించాను. అప్పుటి నుంచి కథలని సినిమాటిక్ గా రాయడం మొదలుపెట్టాను. ఈ కథని మొదట హీరో గారికి చెప్పాను. స్క్రిప్ట్ గా డెవలప్ చేయమని చెప్పారు. పూర్తి కథ విన్నాక మీరు బాగా చెబుతున్నారు మీరే డైరెక్ట్ చేయమని చెప్పారు. నిర్మాతలు నా మిత్రులే. వారు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పుడు దర్శకత్వంపై మరింత రిసెర్చ్ చేసి ఈ ప్రాజెక్ట్ కోసం సిద్ధమైయ్యాను.

నాకు మొదటి నుంచి సినిమాపై ఆసక్తి వుంది. కాలేజ్ డేస్ లో నాటకాలు కూడా వేసేవాళ్ళం. రోహిత్ గారిని ఓ సందర్భంలో కలిశాను. అప్పటికే నా దగ్గర నాలుగైదు కథలు వున్నాయి. ఐతే ఆయన ప్రతినిధి చూశాను. నేను రాసుకున్న ఈ కథలో ఆయన హీరోగా అయితే బావుంటుందనిపించింది, ఆయన వాయిస్ ఈ కథకి మరింత బలం చేకూర్చుతుంది. రోహిత్ గారు సెటిల్డ్ నటుడు. మంచి చదువరి. వాయిస్ కల్చర్ అద్భుతంగా వుంటుంది. ఈ కథకు ఆయన పర్ఫెక్ట్.

ఇందులో హీరో ఎలాంటి అంశాలని ప్రశ్నిస్తాడు?
ఇందులో హీరో చాలా పెద్ద ఇష్యూ డీల్ చేస్తాడు. వ్యవస్థని ప్రశ్నించడం నుంచి మొదలుపెడితే దానిని క్లీన్ చేసే పరిస్థితి వరకూ వెళ్తాడు. హ్యుజ్ స్పాన్ వున్న కథ ఇది. ఇది ప్రాపగాండ మూవీ కాదు. ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. ఇది హైలీ లోడెడ్ థ్రిల్లర్.

దర్శకత్వంకు సంబధించిన మెలకువలు ఎలా నేర్చుకున్నారు? అప్డేట్ ఫిల్మ్ మేకింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే ముందు కూడా దిని గురించి పూర్తిగా రీసెర్చ్ చేశా. ఇప్పుడు ఏఐ చేతిలోకి వచ్చింది. ఎవరు ఏదైనా నేర్చుకోవచ్చు. దర్శకత్వం కు సంబధించి అనేక వీడియోలు, సినిమాలు, క్లాసులు చూశాను. నేర్చుకున్నాను. కంప్లీట్ అప్డేట్ గా వున్నాను. అనుకున్న బడ్జెట్ లోనే చాలా గ్రాండ్ గా తీశాం. డీవోపీ, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్, ఫైట్ మాస్టర్స్ చాలా సపోర్ట్ చేశారు. మంచి టీం వర్క్ చేశాం.

ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నారు?
ఆలోచన రేకెత్తించే మంచి కమర్షియల్ సినిమా ఇది. సమాజంలో జీవితాలని నిర్ణయించేది రాజకీయ వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనకి సేవ చేసేవాడిని ఎన్నుకునే హక్కు మనకి వుంది. కానీ ఇప్పటివరకూ అరవై శాతమే ఓటింగ్ పోల్ అవుతుంది. మిగతా నలభై శాతం మంది ఓటింగ్ కి దూరంగా వుంటున్నారు. వీరంతా బాగా చదువుకున్నవాళ్ళు. టీజర్, ట్రైలర్ చూస్తే ప్రజలనే అలోచించమని చెబుతున్నా. ఇందులో మంచి కంటెంట్ వుంది. అయితే అది మెసేజ్ ఇచ్చినట్లుగా వుండదు. ప్రస్తుత రాజకీయాల గురించి, ప్రజల భావజాలం గురించి ఇందులో లోతుగా బలంగా చర్చించాం.

రోహిత్ గారు ఈ సినిమాకి ఎలా ప్రిపేర్ అయ్యారు?
రోహిత్ గారు సినిమా కోసం అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. ఆయన కొంత బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. దిని కోసం చాలా కష్టపడ్డారు. జర్నలిస్ట్ బాడీ లాంగ్వేజ్ ని చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. చాలా హోమ్ వర్క్ చేశారు.

ఒక ఫిల్మ్ మేకర్ గా ఎలాంటి అనుభూతిని పొందారు ?
నేను ముఫ్ఫై ఏళ్ళుగా కెమరాతో లైవ్ లో వున్నాను. కెమరాతో పరిచయం వుంది. నాకు టీం చాలా గొప్పగా సపోర్ట్ చేసింది. అందుకే నాకు పెద్ద కొత్తగా అనిపించలేదు. సచిన్ ఖేడ్కర్, జీషు సేన్ గుప్తా, అజయ్ ఘోస్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ.. ఇలా ది బెస్ట్ ఆర్టిస్ట్ లని తీసుకున్నాను. దీంతో వర్క్ ఇంకా ఈజీ అయ్యింది.

నెక్స్ట్ సినిమా గురించి ?
నాలుగు కథలు రెడీగా వున్నాయి. రెండో సినిమా నా మిత్రుడే నిర్మిస్తామని చెప్పాడు. మా చైర్మన్ గారు సపోర్ట్ చేస్తే రెండో సినిమా కూడా వెంటనే మొదలుపెడతాను. నాకు సినిమా ఇష్టం, పాషన్. ఆ పాషన్ ని కొనసాగించాలనే ప్రయత్నిస్తాను.

ఆల్ ది బెస్ట్
థాంక్ యూ

Facebook Comments
'Pratnidhi 2' is a highly loaded commercial thriller. There are many goose bumps moments. A treat for all movie lovers: Director Murthy Devagupthapu

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.